పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-46-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిపుడు చేయు సంస్తుతి
నీ హిమ నెఱింగి కాదు; నిరతముఁ బెద్దల్
దా మెది యుపదేశించిరొ
యా తమునఁ బ్రస్తుతింతు య్య! మహాత్మా!

టీకా:

ఏము = మేము; ఇపుడున్ = ఇప్పుడు; చేయు = చేసెడి; సంస్తుతి = స్తోత్రము; నీ = నీ యొక్క; మహిమన్ = మహత్య్యమును; ఎఱింగి = తెలిసి; కాదు = కాదు; నిరతమున్ = ఎల్లప్పుడును; పెద్దల్ = పెద్దవారు; తాము = వారు; ఎది = ఏదైతే; ఉపదేశించిరో = నేర్చుకొనునట్లు చెప్పిరో; ఆ = ఆ; మతమునన్ = విధముగా; ప్రస్తుతింతుము = స్తుతింతుము; అయ్య = తండ్రి; మహాత్మా = గొప్పవాడ.

భావము:

మహాత్మా! మే మిప్పుడు నీ మహిమలు తెలిసి సంస్తుతి చేయడం లేదు. పెద్దలు మాకు ఏ విధంగా ఉపదేశించారో ఆ విధంగా ప్రస్తుతి చేస్తున్నాము.