పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-44-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్లు ప్రత్యక్షమగు పరమేశ్వరునకుఁ
బెన్నిధానంబుఁ గనుఁగొన్న పేద మాడ్కి
ర్షమున ఋత్విగాదికు వనతాస్యు
గుచు నభినుతి చేసి రిట్లనుచు నపుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రత్యక్షమున్ = ప్రత్యక్షము; అగు = అయిన; పరమేశ్వరున్ = పరమేశ్వరుని; కున్ = కు; పెన్నిధానంబున్ = పెద్దనిధిని; కనుగొన్న = కనుక్కొన్న; పేద = పేదవాని; మాడ్కిన్ = వలె; హర్షమునన్ = సంతోషముతో; ఋత్విక్ = యజ్ఞము నడిపించువారు; ఆదికులు = మొదలగువారు; అవనత = వంచిన; ఆస్యులు = మోములు గలవారు; అగుచున్ = అగుచూ; అభినుతిచేసిరి = స్తుతించిరి; ఇట్లు = ఈ విధముగ; అనుచున్ = అనుచూ; అపుడున్ = అప్పుడు;

భావము:

ఈ విధంగా ప్రత్యక్షమైన భగవంతుణ్ణి ఋత్విక్కులు చూసి పెన్నిధిని దర్శించిన పేదలవలె సంతోషంతో తలలు వంచి ఇలా స్తోత్రం చేశారు.