పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : వనంబునకుఁ జనుట

  •  
  •  
  •  

5.1-23-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హరిసేవనా ప్రియవ్రతుఁ
యఁగఁ గైవల్యపదవి నందుట యరుదే?
రఁ జండాలుం డైనను
రి నామస్మరణఁ జెందు వ్యయపదమున్."

టీకా:

హరి = నారాయణుని; సేవనా = సేవించుట యందు; ప్రియవ్రతుడు = ప్రీతినిష్ఠ కలవాడు; అరయన్ = తరచి చూసిన; కైవల్య = ముక్తి; పదవిన్ = స్థానమును; అందుట = అందుకొనుట; అరుదే = అపూర్వమా ఏమి; ధరన్ = భూమిపైన; చండాలుండు = నీచ జన్మ గలవాడు; ఐననున్ = అయినప్పటికిని; హరి = నారాయణ; నామ = నామమును; స్మరణన్ = స్మరించుటవలన; చెందున్ = పొందును; అవ్యయ = తరగని; పదమున్ = స్థితిని.

భావము:

“హరిసేవా ప్రభావం వల్ల ప్రియవ్రతుడు ముక్తిని అందుకొన్నాడంటే ఆశ్చర్యం ఏముంది? లోకంలో ఎంతటి చండాలుడైనా సరే, హరి చరణ స్మరణం వల్ల మోక్షపదవిని చేరుకోగలడు”.