పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : వనంబునకుఁ జనుట

 •  
 •  
 •  

5.1-21-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"క్కట! యే నింద్రిములచేఁ గట్టంగఁ-
డియుండి యందులఁ బాయలేక
జ్ఞాన విరచితం గు సర్వవిషయము-
ను నంధకూపంబులందు నడఁగి
రుణుల కే వినోమృగంబనై యుంటి-
వి యెల్ల నే నొల్ల"నుచు రోసి
రికృపచే నప్పు బ్బిన యాత్మ వి-
ద్యను గల్గి తనవెంట రుగుదెంచు

5.1-21.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కొడుకులకు నెల్ల రాజ్యము గుదురు పఱచి
నదు పత్నుల దిగనాడి నము విడిచి
రివిహారంబు చిత్తంబునందు నిలిపి
రఁగ నల్లన నారదదవి కరిగె.

టీకా:

అక్కట = అయ్యో; ఏన్ = నేను; ఇంద్రియముల్ = ఇంద్రియముల; చేన = చేత; కట్టంగబడి = బంధనములలో; ఉండి = ఉండిపోయి; అందులన్ = వాటినుండి; పాయలేక = విడువడలేక; అజ్ఞాన = అజ్ఞానముచే; విరచితంబున్ = ఏర్పరుపబడినవి; అగు = అయిన; సర్వ = సకలమైన; విషయముల్ = ఇంద్రియార్థ విషయములు; అను = అనెడు; అంధ = చీకటి; కూపంబుల్ = కూపములు; అందున్ = అందు; అడగి = అణగిపోయి; = తరుణుల్ = స్త్రీల; కిన్ = కి; ఏన్ = నేను; వినోద = క్రీడా; మృగంబన్ = జంతువును; ఐ = అయ్యి; ఉంటిన్ = ఉంటిని; అవి = వాటిని; ఎల్లన్ = అన్నిటిని; నేన్ = నేను; ఒల్లన్ = అంగీకరించను; అనుచున్ = అనుచూ; రోసి = అసహ్యించుకొని; హరి = నారాయణుని; కృప = దయ; చేన్ = వలన; అప్పుడు = అప్పుడు; అబ్బిన = అబ్భినట్టి; ఆత్మవిద్య = ఆత్మవిద్యను; కల్గి = కలిగుండి; = తన = తనకు; వెంటన్ = వెంటను; అరుగుదెంచు = వచ్చెడి.
కొడుకులను = పుత్రులను; ఎల్లన్ = అందరను; రాజ్యమున్ = రాజ్యమును; కుదురుపఱచి = స్థిరపరచి; తనదు = తనయొక్క; పత్నులన్ = భార్యలను; దిగనాడి = వదలిపెట్టి; ధనము = సంపదలను; విడిచి = వదలివేసి; హరి = నారాయణుని; విహారంబున్ = వర్తనను; చిత్తంబున్ = మనసు; అందు = లో; నిలిపి = నిలుపుకొని; పరగన్ = ప్రసిద్ధముగ; అల్లన = మెల్లగా; నారద = నారదుని; పదవి = స్థానము; కిన్ = కి; అరిగె = వెళ్ళెను.

భావము:

“అయ్యో! నేను ఇంద్రియాలకు కట్టుబడి ఆ బంధనాల నుండి తప్పించుకోలేక అజ్ఞానంతో నిండిన విషయసుఖాలనే చీకటినూతిలో పడిపోయాను. విలాసవతులైన సతులకు వినోదమృగంగా అయినాను. ఇక అటువంటి సుఖాలను నేను ఏమాత్రం ఇష్టపడను” అని ప్రియవ్రతుడు నిశ్చయించుకున్నాడు. శ్రీహరి దయవల్ల అబ్బిన ఆత్మవిద్యను అందుకున్నాడు. తనవెంట వచ్చిన కుమారులందరికీ వారి వారి రాజ్యాలను స్థిరపరిచి, భార్యలను పరిత్యజించి, ధనాన్ని వదలుకొని, చిత్తంలో శ్రీహరిని నిలుపుకొని గొప్పదైన నారదుని స్థాయికి చేరాడు.