పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఆగ్నీధ్రాదుల జన్మంబు

  •  
  •  
  •  

5.1-17.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు బర్హిష్మతీ కాంతయందుఁ బ్రీతి
లిగి యౌవన లీలా వికాస హాస
హేలనాదులఁ జిత్తంబు గీలుకొల్పి
త వివేకుండుబోలె భోములఁ బొందె.

టీకా:

వసుధేశ = రాజా {వసుధేశుడు - వసుధ (భూమికి) ఈశుడు (ప్రభువు), రాజు}; ఆ = ఆ; ప్రియవ్రతుడు = ప్రియవ్రతుడు; ఒండు = మరియొక; కాంత = భార్య; అందున్ = అందు; అధికులన్ = గొప్పవారిని; మన్వంతర = మన్వంతరములకు; అధిపతులన్ = ప్రభువులను; మఱియున్ = ఇంకను; ఉత్తముండు = ఉత్తముడు; తామసుడు = తామసుడు; రైవతుడున్ = రైవతుడు; అను = అనెడి; సుతులన్ = పుత్రులను; పుట్టించెన్ = పొందెను; సుమహితులను = చాలగొప్పవారిని; మున్ను = ముందు; జన్మించిన = పుట్టిన; మువ్వురు = ముగ్గురు; పుత్రులున్ = కుమారులును; అవ్యయ = శాశ్వతమైన; పదవి = స్థితి (ముక్త్తి); కిన్ = కి; అరగుటయున్ = వెళ్లుట; అంతన్ = అంతట; ప్రియవ్రతుండున్ = ప్రియవ్రతుడు; అఖిల = సర్వమైన; = శాత్రవ = శత్రువుల; కోటిన్ = సమూహమును; తన = తన యొక్క; బాహుబలము = భుజబలము; చేతను = వలన; జయించి = జయించి.
అతడు = అతడు; బరిష్మతీ = బరిష్మతి యనెడు; కాంత = భార్య; అందున్ = ఎడల; ప్రీతిన్ = ఇష్టమున; కలిగి = కలిగుండి; యౌవన = యౌవన; లీలా = క్రీడలందు; వికాస = వికసించుటలు; హాస = నవ్వులు; హేలన = ఆనందించుటలు; ఆదులన్ = మొదలగువానియందు; చిత్తంబున్ = మనసును; కీలుకొల్పి = ప్రేరేపించుకొని; = గత = నశించిన; వివేకుండును = వివేకముగలవాడు; పోలెన్ = వలె; భోగములన్ = భోగములను; పొందె = పొందెను.

భావము:

రాజా! ఆ ప్రియవ్రతుడు మరొక భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కుమారులను కన్నాడు. వారు చాలా గొప్పవారు. మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ముందు పుట్టిన కవి, మహావీరుడు, సవనుడు నాశనం లేని మోక్షపదాన్ని అందుకున్నారు. తరువాత ప్రియవ్రతుడు తన బాహుబలంతో సమస్త శత్రుసమూహాన్ని ఓడించాడు. బర్హిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌవన వికాసాలైన హాసలీలావిలాసాలలో మనస్సును లగ్నం చేసి వివేకం కోల్పోయిన వానివలె అఖండ భోగాలను అనుభవించాడు.