పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ప్రియవ్రతుని బ్రహ్మదర్శనంబు

  •  
  •  
  •  

5.1-9-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హరి నా ముఖమున నీకును
మెఱిఁగింపంగఁ బనిచెఁ గావున నిదె సు
స్థి మతి విను మంతయు శ్రీ
రి వాక్యముగా నెఱింగి వనీనాథా!

టీకా:

హరి = నారాయణుడు; నా = నా యొక్క; ముఖమునన్ = నోటి ద్వారా; నీకునున్ = నీకు; కరమున్ = గట్టిగా; ఎఱిగింపంగన్ = తెలుపుటకు; పనిచెన్ = నియమించెను; కావునన్ = కనుక; ఇదె = ఇదిగో; సుస్థిర = నిశ్ఛలమైన; మతిన్ = బుద్ధితో; వినుము = వినుము; అంతయున్ = అంతటిని; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; వాక్యమున్ = మాటలు; కాన్ = అగునట్లు; ఎఱింగి = తెలిసికొని; అవనీనాథ = రాజా {అవనీనాథుడు - అవని (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు}.

భావము:

“రాజా! విష్ణుమూర్తి నా నోటితో నీకు చెప్పమన్న విషయాన్ని చెప్తున్నాను. అందుచేత నా మాటలను శ్రీహరి మాటలుగానే భావించి నిశ్చలమైన మనస్సుతో విను.