పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ప్రియవ్రతుని బ్రహ్మదర్శనంబు

  •  
  •  
  •  

5.1-14-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు స్వాయంభువమనువు భూచక్ర పరిపాలనంబునకుఁ బ్రియ వ్రతునిఁ బట్టంబు గట్టి విషమంబులగు విషయంబుల వలన విముక్తుండై వనంబునకుం జనియె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; స్వాయంభువ = స్వాయంభువుడు యనెడి; మనువు = మనువు; భూచక్ర = భూమండలమును; పరిపాలనంబున్ = పరిపాలించుట; కున్ = కు; ప్రియవ్రతునిన్ = ప్రియవ్రతుని; పట్టంబున్ = పట్టాభిషిక్తునిగా; కట్టి = నియమించి; విషమంబులున్ = దాటరానివి; అగు = అయిన; విషయంబుల్ = ఇంద్రియార్థ విషయముల; వలన = నుండి; విముక్తుండు = విడివడినవాడు; ఐ = అయ్యి; వనంబున్ = అడవుల; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అంతట.

భావము:

ఈ విధంగా స్వాయంభువ మనువు భూచక్రాన్ని పరిపాలించడానికి ప్రియవ్రతునికి పట్టాభిషేకం చేసి, దాటరాని ఇంద్రియార్థాల నుండి బయటపడి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు…