పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-176-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అక్కట! మానుష జన్మము
పెక్కువయై యుండు నెపు డభేదమతిం బెం
పెక్కిన యోగిసమాగమ
క్కజముగఁ గలిగెనేని ఖిలాత్ములకున్.

టీకా:

అక్కట = అయ్యో; మానుష = మానవ; జన్మము = జన్మ; పెక్కువ = శ్రేష్ఠము; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ఎపుడున్ = ఎప్పుడైతే; అభేద = ద్వంద్వాతీత; మతిన్ = జ్ఞానముతో; పెంపెక్కిన = అతిశయించిన; యోగి = యోగి యొక్క; సమాగమము = సాంగత్యము; అక్కజముగన్ = ఆశ్చర్యకరముగ; కలిగెన్ = కలిగిన; ఏనిన్ = అప్పుడు మాత్రమే; అఖిల = సామాన్య; ఆత్ముల్ = పురుషుల {ఆత్ములు - ఆత్మ కలవారు, జీవులు}; కున్ = కు; =

భావము:

“ఔరా! అన్ని జన్మలలో మానవ జన్మ శేష్ఠ మంటారు. మీ వంటి సర్వసములైన యోగుల సాంగత్యం కలిగినప్పుడే కదా మానవ జన్మ శ్రేష్ఠమౌతుంది.