పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-164-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రణీశ! మాయచేను దాఁటఁగారాని-
దమునఁ బెట్టంగఁడ్డ జీవుఁ
డెమిమై గుణకర్మములఁ జేయుచును లాభ-
మాశించి తిరుగు బేహారి మాడ్కి
ల మపేక్షించుచుఁ బాయక జీవుండు-
సంసారగహన సంచారి యగుచు
నవరతము నుండు నా మహావనమందుఁ-
గామ లోభాది తస్కరులుగూడి

5.1-164.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రణి విజితేంద్రియుఁడు గాని రునిఁబట్టి
ర్మ మనియెడి యా మహానమునెల్ల
రసి గొనిపోవుచుండుదు నుదినంబుఁ
గాన సంసారమందు నాకాంక్ష వలదు.

టీకా:

ధరణీశ = రాజా; మాయ = మాయ; చేతను = వలన; దాటగరాని = దాటలేని; పదమునన్ = స్థితిలో; పెట్టంగబడ్డ = ఉంచబడిన; జీవుండు = జీవుడు; ఎలమిమై = కుతూహలముకొలది; గుణ = త్రిగుణాత్మకమైన; కర్మములన్ = కర్మములను; చేయుచున్ = చేయుచూ; లాభము = ప్రయోజనమును; ఆశించి = అపేక్షించి; తిరుగు = తిరిగెడి; బేహారి = వ్యాపారి; మాడ్కిన్ = వలె; ఫలమున్ = ప్రయోజనమును; అపేక్షించుచున్ = కోరుతూ; పాయక = విడువక; జీవుండు = జీవుడు; సంసార = సంసారము యనెడి; గహన = అడవియందు; సంచారి = తిరిగెడివాడు; అగుచున్ = అగుచు; అనవరతము = ఎల్లప్పుడు; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మహా = గొప్ప; వనము = అడవి; అందు = అందు; కామ = కామము; లోభ = లోభము; ఆది = మొదలగు; తస్కరులన్ = దొంగలు; కూడి = కలిసికట్టుగా.
ధరణిన్ = భూమిపైన; విజిత = జయించిన; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; కాని = కానట్టి; నరునిన్ = మానవుని; ధర్మము = ధర్మము; అనియెడి = అనెడి; ఆ = ఆ; మహా = గొప్ప; ధనమున్ = సంపదను; ఎల్లన్ = అంతటిని; అరసి = వెదకి; కొనిపోవుచున్ = పట్టుకుపోవుచు; ఉండుదురు = ఉంటారు; అనుదినంబున్ = ప్రతిదినము; కాన = కావున; = సంసారము = సంసారము; అందు = ఎడల; ఆకాంక్ష = లాలస; వలదు = వద్దు.

భావము:

“రాజా! మాయ వల్ల దృఢమైన సంసార బంధాలలో బంధింపబడిన జీవుడు ప్రయోజనాన్ని ఆశించిన వర్తకుని లాగా లాభదృష్టితో కర్మలను ఆచరిస్తూ సంచరిస్తాడు. సంసారమనే అడవిలో కామం, లోభం మొదలైన దొంగలు తిరుగుతూ ఉంటారు. ఆ దొంగలు ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకొంటారు. వాడు దాచుకున్న ధర్మమనే మహాధనాన్ని దోచుకుపోతారు. అందువల్ల సంసారం పట్ల కోరికలు పెంచుకోకూడదు.