పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-162-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రలోన బ్రహ్మంబుఁ పమున దానంబు-
ను గృహధర్మంబును జలాగ్ని
సోమసూర్యులచేత శ్రుతులచే నైనను-
రమ భాగవతుల పాదసేవఁ
బొందిన మాడ్కిని బొందంగ రాదని-
లుకుదు రార్యులుఁ రమమునులు
నతపోబాహ్య సౌఖ్యములకు విముఖులు-
నై పుణ్యులు హరిగుణానువాద

5.1-162.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోదితాత్ములు నగు బుధపాసేవ
నుదినంబును జేసిన నంతమీఁద
మోక్షమార్గంబునకును బద్మాక్షునందు
ట్టుపడి యుండు నెప్పుడుఁ రఁగబుద్ధి.

టీకా:

ధర = ధరిత్రి; లోనన్ = అందు; బ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; తపమునన్ = తపస్సుచేతను; దానంబులనున్ = దానములుచేతను; గృహ = గృహస్థ; ధర్మబులను = ధర్మములచేతను; జల = జలము; అగ్ని = అగ్ని; సోమ = చంద్రుడు; సూర్యుల = సూర్యుల; చేతన్ = చేత; శ్రుతుల్ = వేదముల; చేన్ = చేత; ఐననున్ = అయినప్పటికిని; పరమ = అత్యున్నతమైన; భాగవతుల = భాగవతుల యొక్క; పాద = పాదములను; సేవన్ = సేవించుటవలన; పొందిన = పొందినట్టి; మాడ్కినిన్ = విధమున; పొందంగరాదు = పొందలేరు; అని = అని; పలుకుదురు = చెప్పెదరు; ఆర్యులున్ = శ్రేష్ఠులు; పరమ = అత్యుత్తమ; మునులున్ = మునులు; ఘన = గొప్ప; తపః = తపస్సుకన్న; బాహ్య = ఇతరమైన; సౌఖ్యముల్ = సుఖకరముల; కున్ = కు; విముఖులున్ = వ్యతిరిక్తులు; ఐ = అయ్యి; పుణ్యులున్ = పుణ్యులు; హరి = నారాయణుని; గుణ = గుణములను; అనువాద = కీర్తించుటలందు {అనువాద - మరలమరలపలుకుట, కీర్తించుట}.
మోదిత = సంతోషించిన; ఆత్ములున్ = మనసులుగలవారు; అగు = అయిన; బుధ = జ్ఞానుల; పాద = పాదములను; సేవన్ = సేవించుటను; అనుదినంబున్ = ప్రతిదినము; చేసి = చేసి; అంతమీద = ఆ తరువాత; = మోక్ష = మోక్షమును చెందెడి; మార్గంబున్ = మార్గమున; కునున్ = కు; పద్మాక్షున్ = విష్ణుని; అందున్ = అందు; పట్టుపడి = కట్టుబడి; ఉండున్ = ఉండును; ఎప్పుడున్ = నిరతము; పరగన్ = ప్రవర్తిల్లెడి; బుద్ధిన్ = బుద్ధితో; =

భావము:

పరబ్రహ్మ (జ్ఞానం) పరమ భాగవతుల పాదసేవ వల్ల లభించినంత సులభంగా తపస్సు, దానం, గృహస్థాశ్రమ ధర్మం, స్నానం, హోమాలు, సూర్య చంద్రోపాసనం, వేదాధ్యయనం మొదలైన వాటివల్ల లభించదు. భగవద్భక్తుల చరణ సేవయే పరబ్రహ్మ ప్రాప్తికి సులభమార్గం అని ఆర్యులంటారు. బాహ్య సుఖాలకు విముఖులై శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలో సంతోష మనుభవించే భాగవతులను అనుదినం ఆరాధిస్తే మన బుద్ధి మోక్షమార్గం వైపు పయనిస్తుంది. నారాయణుని యందు నెలకొంటుంది.