పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-158-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విప్రవర్య! నేను వేడ్కతో నా సంశ
యంబులెల్ల నిన్ను డిగి తెలియఁ
లఁచి యున్నవాఁడ; ప్పక యెఱిఁగింపు
ముచితవృత్తిఁ దత్త్వయోగమెల్ల.

టీకా:

విప్ర = భ్రాహ్మణులలో; వర్య = ఉత్తముడా; నేను = నేను; వేడ్క = కుతూహలము; తోన్ = తో; నా = నా యొక్క; సంశయంబులన్ = సంశయములను; ఎల్లన్ = అన్నిటిని; నిన్నున్ = నిన్ను; అడిగి = అడిగి; తెలియన్ = తెలిసికొనవలెనని; తలచి = భావించి; ఉన్నవాడన్ = ఉన్నాను; తప్పక = తప్పకుండ; ఎఱిగింపుము = తెలుపుము; ఉచిత = తగిన; వృత్తిన్ = విధానములో; తత్త్వయోగము = తత్త్వయోగము {తత్త్వయోగము - ఆత్మతత్త్వమునకు సంబంధించిన యోగము}; ఎల్ల = సమస్తమును.

భావము:

బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నా సందేహా లన్నిటినీ నిన్ను అడిగి నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. దయచేసి నాకు అధ్యాత్మ తత్త్వాన్ని సమగ్రంగా వివరించు”.