పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-157-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్వరితార్తుం డగు రోగి కౌషధ మతీష్టంబైన చందంబునన్
లో నాతపతప్త దేహి గడు శీతంబైన తోయంబునున్
రిమం గోరినరీతి నెంతయు నహంకారాహి దష్టుండనై
రఁగున్ నాకును నీ వచోమృతము దప్పన్ మందు వేఱున్నదే?

టీకా:

జ్వరిత = జ్వరమువలన; ఆర్తుండు = బాధపడెడివాడు; అగు = అయిన; రోగి = రోగి; కిన్ = కి; ఔషధము = మందు; అతి = మిక్కిలి; ఇష్టంబు = ఇష్టము; ఐన = అగు; చందంబునన్ = విధముగ; ధర = ప్రపంచము; లోనన్ = లో; ఆతప = ఎండకి; తప్త = కాలుతున్న; దేహి = దేహము గలవాడు; కడు = మిక్కిలి; శీతంబున్ = చల్లటివి; ఐన = అయిన; తోయంబునున్ = నీటిని; గరిమన్ = గట్టిగా; కోరిన = అపేక్షించెడి; రీతిన్ = విధముగనె; ఎంతయున్ = మిక్కిలి; అహంకార = అహంకారము యనెడి; అహిన్ = పాముచేత; దష్టుండను = కాటువేయబడినవాడను; ఐ = అయ్యి; పరగన్ = ప్రసిద్దముగ; నా = నా; కునున్ = కు; నీవున్ = నీవు; వచస్ = పలుకులు యనెడి; అమృతమున్ = అమృతము; తప్పన్ = తప్పించి; మందు = ఔషధము; వేఱ = వేరే ఇతరమైనది; ఉన్నదే = ఉన్నదా ఏమి, లేదు.

భావము:

జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లు, ఎండలో తపించిన వానికి చల్లని నీరు సమకూరినట్లు అహంకారమనే పాముకాటుకు గురి అయిన నాకు నీ మాటలు అనే అమృతం తప్ప వేరే మందు ఉన్నదా?