పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-149-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పావక శిఖలచే భాండంబు దాఁ దప్త-
గుఁ; దప్త ఘటముచే నందు నున్న
లము తపించు; నా లముచేఁ దండులం-
బులు తప్త మొంది యప్పుడు విశిష్ట
మైన యన్నం బగు; నా చందమునను దా-
దేహేంద్రియంబులఁ దెలివితోడ
నాశ్రయించుక యున్న ట్టి జీవునకు దే-
హంబునఁ బ్రాణేంద్రియాదికమున

5.1-149.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుగుచుండు నిట్లు సంసారఘట వృత్తి
దుండు నయిన రాజు దుష్టమైన
ర్మములకుఁ బాసి కంజాక్షపద సేవఁ
జేసెనేని భవముఁ జెందకుండు."

టీకా:

పావక = అగ్ని; శిఖల్ = శిఖల; చేన్ = చేత; భాండంబున్ = కుండ; తాన్ = తాను; తప్తము = వేడిది; అగున్ = అగును; తప్త = వేడెక్కిన; ఘటము = కుండ; చేన్ = వలన; అందున్ = దానిలో; ఉన్న = ఉన్నట్టి; = జలము = నీరు; తపించున్ = మరుగును; ఆ = ఆ; జలము = నీటి; చేన్ = వలన; తండులంబులు = బియ్యము; తప్తము = వేడిని; ఒంది = పొంది; అప్పుడు = అప్పుడు; విశిష్టము = చక్కటిది; ఐన = అయిన; అన్నంబున్ = అన్నము; అగున్ = అగును; ఆ = ఆ; చందంబుననున్ = విధముగనే; తాన్ = తాను; దేహ = శరీరము; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; తెలివి = బుద్ధిల; తోడన్ = తోటి; ఆశ్రయించుకన్ = ఆశ్రయించుకొని; ఉన్నయట్టి = ఉన్నట్టి; జీవున్ = జీవున; కున్ = కు; దేహంబునన్ = శరీరమున; ప్రాణ = ప్రాణము; ఇంద్రియ = ఇంద్రియములు; ఆదికమునన్ = మొదలగునవి; =
జరుగుచుండున్ = నడచుచుండును; ఇట్లు = ఈ విధముగ; సంసార = సంసారము యనెడి; ఘట = కుండ; వృత్తిదుండున్ = వర్తించెడివాడు; అయిన = అయినట్టి; రాజు = రాజు; దుష్టము = చెడ్డవి; ఐన = అయినట్టి; కర్మముల = కర్మల; కున్ = కు; పాసి = దూరమై; కంజాక్ష = విష్ణుమూర్తి; పద = పాదముల; సేవన్ = సేవించుటను; చేసెనేని = చేసినచో; భవమున్ = పునర్జన్మము, సంసారమును; చెందకుండు = చెందకనుండును.

భావము:

“అగ్ని జ్వాలలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులోని నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యపు గింజలు బాగా ఉడికి పక్వమై అన్నం సిద్ధమవుతుంది. అలాగే దేహాన్నీ, ఇంద్రియాలనూ ఆశ్రయించుకొని జీవుడున్నాడు. దేహంలోనే ప్రాణం, ఇంద్రియాలు ఉన్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకూ సంక్రమిస్తాయి. ప్రజల శిక్షణ, రక్షణ కోసం రాజున్నాడు. ఆ రాజు చెడు కర్మలు వదలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే సంసార బంధాలనుండి విముక్తు డౌతాడు”.