పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-139-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతటఁ గొన్ని హానములు చన సింధు-
భూపాలనము చేయు భూవరుండు
ధీరత నిక్షుమతీ తీరమున నున్న-
పిల మహామునిఁ గాంచి తత్త్వ
విజ్ఞాన మెఱిఁగెడు వేడ్క తోడుత శిబి-
కారోహణము చేసి రుగుచుండ
నాలోన నాశిబికావహు లా చేనఁ-
గాపున్న విప్రునిఁ గాంచి తెచ్చి

5.1-139.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిబిక మోపింత మీతనిచేత ననుచుఁ
ట్టి మూపునఁ బల్లకిఁ బెట్టి మోపు
నుచు మోపించునంత ధరామరుండు
శిబిక మూఁపున నిడి యందుఁ జింత లేక.

టీకా:

అంతటన్ = ఆ తరువాత; కొన్ని = కొన్ని; హాయనములున్ = సంవత్సరములు; చనన్ = గడవగా; సింధు = సింధుదేశపు; భూపాలనము = పరిపాలన; చేయు = చేసెడి; భూవరుండు = రాజు; ధీరతన్ = బుద్ధిబలముకలిగి; ఇక్షుమతీ = ఇక్షుమతి యనెడి నది యొక్క; తీరమునన్ = ఒడ్డున; ఉన్న = ఉన్నట్టి; కపిల = కపిలుడు యనెడి; మహా = గొప్ప; మునిన్ = మునిని; కాంచి = దర్శించి; తత్త్వ = వేదాంత; విజ్ఞానమున్ = విద్యను; ఎఱిగెడు = తెలిసికొనెడు; వేడ్కన్ = కోరికతో; శిబిక = పల్లకీ {శిబిక - మనుష్యులు మోసెడి వాహనము, పల్లకి}; ఆరోహణముచేసి = ఎక్కి; అరుగుచుండన్ = వెళుతుండగా; ఆ = ఆ; లోనన్ = మధ్యలో; ఆ = ఆ; = శిబిక = పల్లకీ; ఆవహులు = మోయువారు; ఆ = ఆ; చేనన్ = పొలమున; కాపు = కాపలా; ఉన్న = ఉన్నట్టి; విప్రునిన్ = బ్రాహ్మణుని; కాంచి = చూసి; తెచ్చి = తీసుకొని వచ్చి.
శిబికన్ = పల్లకీని; మోపింతము = మోయించెదము; ఈతని = ఇతని; చేతన్ = చేత; అనుచున్ = అనుచూ; పట్టి = పట్టుకొని; మూపునన్ = భుజముపైన; పల్లకిన్ = పల్లకీని; పెట్టి = పెట్టి; మోపుము = మోయుము; అనుచున్ = అనుచూ; మోపించున్ = మోయించుచున్న; అంతన్ = సమయములో; ధరామరుండు = బ్రాహ్మణుడు; శిబికన్ = పల్లకీని; మూపునన్ = భుజముపైన; ఇడిన్ = ఉంచినా; అందున్ = దానిలో; చింత = ఆలోచన; లేక = లేకుండగ.

భావము:

కొన్ని సంవత్సరాలు గడిచాయి. సింధుదేశాన్ని పరిపాలించే రహూగణు డనే రాజుకు ఇక్షుమతి నదీ తీరంలోని కపిల మహర్షి వద్ద ఆధ్యాత్మవిద్య తెలుసుకోవాలనే కోరిక కలిగింది. పల్లకి ఎక్కి బయలుదేరాడు. పల్లకిని మోసే బోయీలు పొలానికి కావలి ఉన్న భరతుణ్ణి చూసారు. అతని చేత పల్లకిని మోయిద్దామనుకొని అతణ్ణి తీసుకొని వచ్చి ఒకవైపు పల్లకి బొంగును భుజంమీద పెట్టి మొయ్యమన్నారు. భరతుడు చీకు చింత లేకుండా మోస్తున్నాడు.