పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

 •  
 •  
 •  

5.1-139-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంతటఁ గొన్ని హానములు చన సింధు-
భూపాలనము చేయు భూవరుండు
ధీరత నిక్షుమతీ తీరమున నున్న-
పిల మహామునిఁ గాంచి తత్త్వ
విజ్ఞాన మెఱిఁగెడు వేడ్క తోడుత శిబి-
కారోహణము చేసి రుగుచుండ
నాలోన నాశిబికావహు లా చేనఁ-
గాపున్న విప్రునిఁ గాంచి తెచ్చి

5.1-139.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శిబిక మోపింత మీతనిచేత ననుచుఁ
ట్టి మూపునఁ బల్లకిఁ బెట్టి మోపు
నుచు మోపించునంత ధరామరుండు
శిబిక మూఁపున నిడి యందుఁ జింత లేక.

టీకా:

అంతటన్ = ఆ తరువాత; కొన్ని = కొన్ని; హాయనములున్ = సంవత్సరములు; చనన్ = గడవగా; సింధు = సింధుదేశపు; భూపాలనము = పరిపాలన; చేయు = చేసెడి; భూవరుండు = రాజు; ధీరతన్ = బుద్ధిబలముకలిగి; ఇక్షుమతీ = ఇక్షుమతి యనెడి నది యొక్క; తీరమునన్ = ఒడ్డున; ఉన్న = ఉన్నట్టి; కపిల = కపిలుడు యనెడి; మహా = గొప్ప; మునిన్ = మునిని; కాంచి = దర్శించి; తత్త్వ = వేదాంత; విజ్ఞానమున్ = విద్యను; ఎఱిగెడు = తెలిసికొనెడు; వేడ్కన్ = కోరికతో; శిబిక = పల్లకీ {శిబిక - మనుష్యులు మోసెడి వాహనము, పల్లకి}; ఆరోహణముచేసి = ఎక్కి; అరుగుచుండన్ = వెళుతుండగా; ఆ = ఆ; లోనన్ = మధ్యలో; ఆ = ఆ; = శిబిక = పల్లకీ; ఆవహులు = మోయువారు; ఆ = ఆ; చేనన్ = పొలమున; కాపు = కాపలా; ఉన్న = ఉన్నట్టి; విప్రునిన్ = బ్రాహ్మణుని; కాంచి = చూసి; తెచ్చి = తీసుకొని వచ్చి.
శిబికన్ = పల్లకీని; మోపింతము = మోయించెదము; ఈతని = ఇతని; చేతన్ = చేత; అనుచున్ = అనుచూ; పట్టి = పట్టుకొని; మూపునన్ = భుజముపైన; పల్లకిన్ = పల్లకీని; పెట్టి = పెట్టి; మోపుము = మోయుము; అనుచున్ = అనుచూ; మోపించున్ = మోయించుచున్న; అంతన్ = సమయములో; ధరామరుండు = బ్రాహ్మణుడు; శిబికన్ = పల్లకీని; మూపునన్ = భుజముపైన; ఇడిన్ = ఉంచినా; అందున్ = దానిలో; చింత = ఆలోచన; లేక = లేకుండగ.

భావము:

కొన్ని సంవత్సరాలు గడిచాయి. సింధుదేశాన్ని పరిపాలించే రహూగణు డనే రాజుకు ఇక్షుమతి నదీ తీరంలోని కపిల మహర్షి వద్ద ఆధ్యాత్మవిద్య తెలుసుకోవాలనే కోరిక కలిగింది. పల్లకి ఎక్కి బయలుదేరాడు. పల్లకిని మోసే బోయీలు పొలానికి కావలి ఉన్న భరతుణ్ణి చూసారు. అతని చేత పల్లకిని మోయిద్దామనుకొని అతణ్ణి తీసుకొని వచ్చి ఒకవైపు పల్లకి బొంగును భుజంమీద పెట్టి మొయ్యమన్నారు. భరతుడు చీకు చింత లేకుండా మోస్తున్నాడు.

5.1-140-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మనసు కొలఁది నప్పుడు
మునుకొని యట్లప్రయత్నమున నడవఁగ నా
పతి నిమ్నోన్నతమై
నుట యెఱిఁగి శిబిక మోచు నులకు ననియెన్.

టీకా:

తన = తన యొక్క; మనసుకొలది = ఇష్టము వచ్చినట్లు; అపుడున్ = అప్పుడు; మునుకొని = పూని; అట్ల = ఆ విధముగ; అప్రయత్నమునన్ = అప్రయత్నముగా; నడవగాన్ = నడచుచుండగా; ఆ = ఆ; జనపతి = రాజు; నిమ్నోన్నతము = ఎగుడు దిగుడు; ఐ = అయ్యి; చనుటన్ = వెళ్లుటను; ఎఱిగి = తెలిసి; శిబిక = పల్లకీ; మోచు = మోసెడి; జనుల్ = వారి; కున్ = తోటి; అనియెన్ = అనెను.

భావము:

భరతుడు అలవాటు లేక మనసుకు తోచినట్లు ఎంతో ప్రయత్నంతో నడుస్తున్నాడు. పల్లకి ఎగుడు దిగుడుగా ఊగుతుంటే రాజు బోయీలను చూచి ఇలా అన్నాడు.

5.1-141-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మీర లిప్పు డిచటఁ జేరి మిక్కిలి ప్రయ
త్నంబుతోడఁ దగిలి డచుచుండ
విషమ మగుచు గమనవేగంబు నను బాధఁ
బెట్టుచున్న" దనిన బెస్త లనిరి.

టీకా:

మీరలు = మీరు; ఇప్పుడున్ = ఇప్పుడు; ఇచటన్ = ఇక్కడ; చేరి = చేరి; మిక్కిలి = అధికమైన; ప్రయత్నంబున్ = ప్రయత్నము; తోడన్ = తోటి; తగిలి = పట్టుదలగా; నడచుచున్ = నడచుచూ; ఉండన్ = ఉండగా; విషమము = అసమము; అగుచున్ = అగుచూ; గమన = నడక; వేగంబున్ = వేగము; ననున్ = నన్ను; బాధన్ = బాధ; పెట్టుచున్నది = పెడుతున్నది; అనినన్ = అనగా; బెస్తలు = బోయీలు; అనిరి = పలికిరి.

భావము:

“మీరు ఇప్పు డిక్కడ ఇంత శ్రమ తీసుకొని మోస్తూ నడుస్తున్నా కుదురు లేదు. మీ ఎగుడు దిగుడు నడకవల్ల కుదుపు ఎక్కువై నాకు బాధగా ఉన్నది” అని పలికిన రాజుతో బెస్త లిలా అన్నారు.

5.1-142-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"దేవా! యీ విషమగమనంబు మావలన నైనది గా; దీ తురీయవాహకుండు సుఖగమనంబుగా నడవ నేరండు; వీనితోడ మేము నడవ నేరము" యనిన రహూగణుం డను నా రాజు పాసిత వృద్ధజనుం డైనను బలాత్కారంబునం బుట్టిన కోపంబునం గోపించి విమర్శ దప్పి నీఱుగప్పిన నిప్పునుం బోలె నెఱుంగరాని బ్రహ్మతేజంబుగల బ్రాహ్మణునికిం గంటకంబుగా నిష్ఠుర వాక్యంబుల నిట్లనియె.

టీకా:

దేవా = భగవంతుడా; ఈ = ఈ; విషమ = అసమముగా; గమనంబు = నడకలు; మా = మా; వలనన్ = వలన; ఐనది = అయినది; కాదు = కాదు; ఈ = ఈ; తురీయ = నాలుగవ; వాహకుండు = మోయువాడు; సుఖ = సుఖకరమైన; గమనంబుగా = వెళ్ళునట్లు; నడవన్ = నడచుట; నేరండు = తెలియడు; వీని = వీడి; తోడన్ = తో; మేము = మేము; నడవనేరము = నడవలేము; అనినన్ = అనగా; రహూగణుండు = రహూగణుడు యనెడి; ఆ = ఆ; రాజు = రాజు; ఉపాసిత = సేవించుతున్న; వృద్దజనుండు = పెద్దవారు గలవాడు; ఐనను = అయినప్పటికి; బలాత్కారంబునన్ = బలవంతముగా; పుట్టిన = జనించిన; కోపంబునన్ = కోపమువలన; కోపించి = కోపగించి; విమర్శదప్పి = వివేచన మరచి; నీఱు = నివురు; కప్పిన = కప్పిన; నిప్పునున్ = నిప్పును; పోలెన్ = వలె; ఎఱుంగరాని = తెలియ లేని; బ్రహ్మ = గొప్ప; తేజంబున్ = తేజస్సు; కల = కలిగిన; బ్రాహ్మణునిన్ = విప్రుని; కిన్ = కి; కంటకంబు = ముల్లు; కాన్ = లాంటి; నిష్ఠుర = కఠినమైన; వాక్యంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

“మహాప్రభూ! ఈ ఎగుడు దిగుడు నడక మాది కాదు. ఈ నాల్గవ బోయీ సరిగా నడవడం లేదు. వీనితో పాటు మేము సరిగా నడవలేక పోతున్నాము” అన్నారు. అందుకు రాజు పెద్దలంటే గౌరవం ఉన్నవాడైనా అకస్మాత్తుగా పుట్టిన కోపంతో మంచి చెడు లాలోచింపక నివురు గప్పిన నిప్పులా తెలియరాని బ్రహ్మ తేజస్సు కల బ్రాహ్మణుని బాధించే విధంగా నిష్ఠురవాక్యాలతో ఇలా అన్నాడు.

5.1-143-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"సితి; వెంతయున్ ముసలి; వాఁకట డస్సితి; వెన్ను మిక్కిలిం
లుచన యున్న; దీ శిబిక భారము; దూరము మోసి; తే గతిన్
నిలిచెద?" వంచు భూవరుఁడు నిష్ఠురముల్దగ బల్క నా యెడం
లుకక మోసె నా శిబిక బ్రాహ్మణవర్యుఁడు పార్థివేశ్వరా!

టీకా:

అలసితివి = అలసిపోయావు; ఎంతయున్ = ఎంతగానో; ముసలివిన్ = ముసలాడివి; ఆకటన్ = ఆకలితో; డస్సితి = నీరసించిపోయావు; వెన్ను = వెన్నుపూస; మిక్కిలిన్ = చాలా; పలుచన = సన్నగా; ఉన్నది = ఉంది; ఈ = ఈ; శిబిక = పల్లకీ యొక్క; భారమున్ = బరువును; దూరము = చాలా దూరము; మోసితి = మోసినావు; ఏ = ఏ; గతిన్ = విధముగా; నిలిచెదవు = నిలబడగలవు; అంచున్ = అనుచూ; భూవరుండు = రాజు; నిష్ఠురమున్ = ఎత్తిపొడుపు మాటలు; తగన్ = మిగిలి; పల్కన్ = పలుకగా; ఆ = ఆ; ఎడన్ = సమయములో; పలుకక = సమాధానము చెప్పకుండగా; మోసెన్ = మోసెను; ఆ = ఆ; శిబికన్ = పల్లకీని; బ్రాహ్మణ = బ్రాహ్మణులలో; వర్యుడు = వరించ దగినవాడు; పార్థివేశ్వరా = రాజా {పార్థివేశ్వరుడు - రాజులలో ఈశ్వరుడు, రాజు}.

భావము:

“అలసిపోయావు. ఎంతో వృద్ధుడవు. ఆకలితో నీరసించి ఉన్నావు. నీ వెన్నెముక పలుచగా ఉంది. పల్లకి బరువుగా ఉంది. ఇంతదూరం మోసి ఇంకా ఎలా నిలబడ గలుగుతున్నావో కదా!” అని రాజు ఎత్తిపొడుపుగా మాట్లాడినా, మహారాజ! బ్రాహ్మణుడు బదులు చెప్పకుండా పల్లకిని మోస్తూనే ఉన్నాడు.

5.1-144-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అప్పు డా విప్రవరుండు దనకుం గడపటి శరీరం బయిన కళేబరంబు నందు నహంకార మమకారంబులం బొందనీక మిథ్యాజ్ఞానరహితుండై బ్రహ్మభూతుండై మౌనవ్రతంబున నా శిబిక మోయుచున్న విషమగమనంబుఁ జూచి యతి కుపితుం డగుచు నా భూవరుండు వెండియు నిట్లనియె.

టీకా:

అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; విప్ర = బ్రాహ్మణులలో; వరుండు = ఉత్తముడు; తన = తన; కున్ = కు; కడపటి = చివరి; శరీరంబున్ = దేహము; అయిన = అయినట్టి; కళేబరమున్ = భౌతికశరీరము; అందున్ = ఎడల; అహంకార = అహంకారము; మమకారంబులన్ = మమకారములను; పొందనీక = కలుగనీయక; మిథ్యాజ్ఞాన = అజ్ఞానము; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి; బ్రహ్మభూతుండు = పరబ్రహ్మ తానే ఐనవాడు; ఐ = అయ్యి; మౌనవ్రతంబున = మౌనమే వ్రతముగా గలవాడు; ఆ = ఆ; శిబికన్ = పల్లకిని; మోయుచున్న = మోయుచున్నట్టి; విషమ = అసమ; గమనంబున్ = నడకను; చూచి = చూసి; అతి = మిక్కిలి; కుపితుండు = కోపము చెందినవాడు; అగుచున్ = అగుచూ; ఆ = ఆ; భూవరుండు = రాజు; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; =

భావము:

అప్పుడా బ్రాహ్మణుడు తనకు చివరిదైన ఆ జన్మలో అహంకారానికి, మమకారానికి లొంగక, జ్ఞాని కనుక పరబ్రహ్మ స్వరూపుడై మౌనంగా ఆ పల్లకిని మోస్తూనే ఉన్నాడు. అది యథాతథంగా ఎగుడు దిగుడుగా పోతూ ఉంటే రహూగణుడు మిక్కిలి కోపించి మళ్ళీ ఇలా అన్నాడు.

5.1-145-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రి! దుర్మద! విన రోరి జీవన్మృత!-
నా యాజ్ఞఁ దప్పించి డచె దీవు;
నీ వక్రమార్గంబు లిన్నియు విడిపించి-
డపింతు నిన్ను సన్మార్గమందు"
ని రాజగర్వాంధుఁ గుచు గుణత్రయం-
బున వృద్ధిఁ బొందిన భూవరుం డ
ద్ధప్రలాపము ల్పల్కుచుండినఁ జూచి-
మదమాదులచేఁ ప్రస్తుఁ డగుచు

5.1-145.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గతి బ్రహ్మస్వరూపమై కలభూత
ములకునత్యంతహితుఁడైన భూసురుండు
యోగివర్తన దెలియ లేకున్న రాజు
నంత వీక్షించి యల్ల ని ట్లనుచుఁ బలికె.

టీకా:

ఓరి = ఓరి; దుర్మద = మిక్కిలి మదమెక్కినవాడ; వినర = విను; ఓరి = ఓరి; జీవన్మృత = జీవచ్చవమా {జీవన్మృతుడు - జీవించియున్నను మరణించినవాడు, జీవచ్చవము}; నా = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; తప్పించి = మీరి; నడచెదవు = ప్రవర్తించుతున్నావు; ఈవు = నీవు; నీ = నీ యొక్క; వక్ర = వంకర; మార్గంబులు = దార్లు; ఇన్నియున్ = అన్నిటిని; విడిపించి = వదిలించి; నడపింతున్ = నడపించెదను; నిన్నున్ = నిన్ను; సన్మార్గము = సరియగుదారి; అందున్ = లో; అని = అని; రాజ = రాజుననెడి; గర్వ = గర్వమువలన; అంధుడున్ = గుడ్డివాడు; అగుచున్ = అగుచూ; గుణత్రయంబునన్ = త్రిగుణములతో; వృద్ధిన్ = అతిశయమును; పొందిన = పొందినట్టి; భూవరుండు = రాజు; అబద్ధ = నిబద్దతలేని; ప్రలాపముల్ = వాగుడు; పల్కుచుండిన = పలుకుతుండగా; చూచి = చూసి; శమ = శాంతము; దమ = ఇంద్రియ నిగ్రహము; ఆదుల్ = మొదలగువాని; చేన్ = వలన; ప్రశస్తుడు = ప్రసిద్దమైనవాడు; అగుచున్ = అగుచూ.
జగతిన్ = జగత్తునందు; బ్రహ్మ = పరబ్రహ్మ; స్వరూపము = స్వరూపము; ఐ = అయ్యి; సకల = సర్వ; భూతముల్ = జీవుల; కున్ = కు; అత్యంత = అత్యధికమైన; హితుడు = ఇష్టమైనవాడు; ఐన = అయినట్టి; భూసురుండు = బ్రాహ్మణుడు; యోగి = యోగియొక్క; వర్తన = ప్రవర్తన; తెలియలేక = తెలిసికొనలేకుండగా; ఉన్న = ఉన్నట్టి; రాజున్ = రాజుని; అంతన్ = అంతట; వీక్షించి = చూసి; అల్లన = మెల్లగా; ఇట్లు = ఈ విధముగ; అనుచున్ = అనుచూ; పలికె = పలికెను.

భావము:

“ఓరీ పొగరుబోతా! నడపీనుగా! నీవు నా ఆజ్ఞను మీరి నడుస్తున్నావు. నీ కుంటి నడకలను వదిలించి మంచి మార్గంలో నడిపిస్తాను” అని గర్వాంధకారంతో, తమోగుణ ప్రకోపంతో కారుకూతలు కూశాడు. అప్పుడు శమదమాది గుణ సంపన్నుడు, బ్రహ్మస్వరూపుడు, సమస్త జీవరాసుల హితం కోరేవాడు అయిన ఆ బ్రాహ్మణుడు యోగుల స్వభావం తెలియని ఆ రాజును చూచి ఇలా అన్నాడు.

5.1-146-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నరేంద్రా! నీవు చెప్పునది సత్యంబు; భారం బీ శరీరంబునకే కాని నాకుం గలుగనేర; దైనను స్థౌల్యకార్శ్యంబులు వ్యాధులు నాధులు క్షుత్తృష్ణలు నిచ్ఛావిరోధభయంబులు జరామరణంబులు రోషనిద్రాజాగరణంబులు నహంకార మమకార మదశోషణాదులు దేహంబుతోడన జనియించుం గాని నాకుం గలుగనేరవు; జీవన్మృతుండ నేన కాదాద్యంతంబులు గలుగుటం జేసి యందఱి యందును గలిగి యుండు; స్వామిభృత్య సంబంధంబులు విధికృతంబు లగుచు వ్యవహారంబులం జేసి శరీరంబులకుం గలుగుంగాని జీవునికి లేక యుండు; నదియునుంగాక రాజాభిమానంబున నీవు నన్నాజ్ఞాపించెదవేనిం బ్రమత్తుండవైన నీకుం బూర్వస్వభావం బెట్లుండె; నట్లుగాక యేనేమి చేయుదు? నెఱింగింపు; మున్మత్త మూకాంధ జడులు బోలె సహజస్వభావంబునుం బొందిన నాయందు నీ శిక్ష యేమి లాభంబుఁ బొందింప నేర్చు. నదియునుం గాక స్తబ్దుండు మత్తుండు నైన నాకు నీ శిక్ష వ్యర్థంబగు"నని పలికి యుపశమశీలుండైన మునివరుండు పూర్వకర్మశేషంబున గల్గు భారవాహకత్వంబుం దలంగం ద్రోయుటకు భారంబు వహించి శిబిక మోచుచుం జనునెడ నా రాజవల్లభుండు దత్త్వజ్ఞానాపేక్షితుండై చనియెడి వాఁడగుటం దన హృదయ గ్రంథి విమోచకంబులును బహు యోగగ్రంథ సమ్మతంబులును నగు బ్రాహ్మణవాక్యంబులు విని యా శిబిక దిగ్గన డిగ్గనుఱికి యావిప్రునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి సర్వ గర్వవర్జితుండై ముకుళిత హస్తుం డగుచు ని ట్లనియె.

టీకా:

నరేంద్రా = రాజా; నీవున్ = నీవు; చెప్పునది = చెప్పెడిది; సత్యంబున్ = నిజమే; భారంబు = బరువు; ఈ = ఈ; శరీరంబునకే = దేహమునకు మాత్రమే; కాని = కాని; నా = నా; కున్ = కు; కలుగన్ = కలుగుటకు; నేరదు = సాధ్యము కాదు; = ఐననున్ = అయినప్పటికిని; స్థౌల్య = బలముగా ఉండుట; కార్శ్యంబులు = కృశించి ఉండుట; వ్యాధులున్ = జబ్బులు; ఆధులు = మానసిక బాధలు; క్షుత్ = ఆకలి; తృష్ణలున్ = దప్పులు, దాహములు; ఇచ్ఛా = ఇష్టములు; విరోధ = అయిష్టములు; భయంబులున్ = భయములు; జరా = ముసలితనము; మరణంబులు = చావులు; రోష = పౌరుషము; నిద్ర = నిద్రించుట; జాగరణంబులున్ = మెలకువగా ఉండుటలు; అహంకార = నే ననెడి భావము; మమకార = నా దనెడి భావము; మద = మదము; శోషణ = క్షీణించుట; ఆదులు = మొదలగునవి; దేహంబు = శరీరము; తోడన = తోటే; జనియించున్ = పుట్టును; కాని = కాని; నా = నా; కున్ = కు; కలుగన్ = కలుగుటకు; నేరవు = సమర్థములు గావు; జీవన్మృతుండను = జీవచ్ఛవమును; నేన = నేనే; కాదు = కాదు; ఆది = పుట్టుట; అంతంబులు = గిట్టుటలు; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; అందఱ = అందరి; అందునున్ = ఎడలను; కలిగి = కలిగే; ఉండున్ = ఉండును; స్వామి = యజమాని; భృత్య = సేవక; సంబంధంబులు = సంబంధములు; విధి = కర్మలవలన; కృతంబులు = జరుగునవి; అగుచున్ = అగుచు; వ్యవహారంబులన్ = లౌకికవ్యవహారములు; చేసి = వలన; శరీరంబులకున్ = దేహముల; కున్ = కు; కలుగున్ = కలుగును; కాని = కాని; జీవున్ = జీవుని; కిన్ = కి; లేక = లేకుండగా; ఉండును = ఉండును; అదియునున్ = అంతే; కాక = కాకుండగా; రాజ = రాజుననే; అభిమానంబునన్ = అహంకారముచేత; నీవున్ = నీవు; నన్ = నన్ను; ఆజ్ఞాపించెదవు = శిక్షించెదవు; ఏనిన్ = అయినచో; ప్రమత్తుండవు = మిక్కిలి మద మెక్కిన వాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; పూర్వ = తొలి; స్వభావంబు = స్వభావము; ఎట్లు = ఏ విధముగా; ఉండెన్ = ఉందో; అట్లు = ఆ విధముగా; కాక = కాకుండగా; ఏను = నేను; ఏమి = ఏమి; చేయుదున్ = చేయగలను; ఎఱింగింపుము = తెలుపుము; ఉన్మత్త = పిచ్చివారు; మూక = మూగవారు; అంధ = గుడ్డివారు; జడులు = తెలివిలేనివారు; సహజ = సహజమైన; స్వభావంబునున్ = స్వాభావమును; పొందినన్ = పొందినట్టి; నా = నా; అందున్ = అందు; నీ = నీ; శిక్ష = శిక్ష; ఏమి = ఏమి; లాభంబున్ = ప్రయోజనమును; పొందింపన్ = కలిగించ; నేర్చును = కలుగును; అదియునున్ = అంతే; కాక = కాకుండగా; స్తబ్దుండు = స్పందనలు లేనివాడు; మత్తుండు = దేహముపైన నిర్లక్ష్యము గలవాడు; ఐన = అయిన; నా = నా; కున్ = కు; నీ = నీ యొక్క; శిక్ష = శిక్ష; వ్యర్థంబు = ప్రయోజనము లేనిది; అగున్ = అగును; అని = అని; పలికి = పలికి; ఉపశమ = శాంతించిన; శీలుండు = స్వభావము గలవాడు; ఐన = అయిన; ముని = మునులలో; వరుండున్ = శ్రేష్ఠుడు; పూర్వ = పూర్వకాలపు; కర్మ = కర్మల యొక్క; శేషంబునన్ = మిగిలినవానివలన; కల్గు = కలిగిన; భార = బరువును; వాహకత్వంబున్ = మోయవలసిన స్థితిని; తలగంద్రోయుటకున్ = తొలగించుకొనుటకు; భారంబున్ = బరువుగా; వహించి = స్వీకరించి; శిబికన్ = పల్లకిని; మోచుచున్ = మోయుచూ; చను = వెళ్ళెడి; ఎడన్ = సమయములో; ఆ = ఆ; రాజ = రాజులలో; వల్లభుండు = శ్రేష్ఠుడు; తత్త్వజ్ఞాన = తత్త్వజ్ఞానమును; ఆపేక్షితుండు = కోరెడివాడి; ఐ = అయ్యి; చనియెడి = వెళ్ళెడి; వాడు = వాడు; అగుటన్ = అగుటవలన; తన = తన యొక్క; హృదయ = హృదయము యనెడి; గ్రంథి = ముడినుండి; విమోచకంబులును = విడిపించునవి; బహు = అనేక; యోగ = యోగశాస్త్రముల; గ్రంథ = గ్రంథము లందలి విషయములకు; సమ్మతంబులున్ = అంగీకార యోగ్యములు; అగు = అయిన; బ్రాహ్మణ = విప్రుని; వాక్యంబులు = మాటలు; విని = విని; ఆ = ఆ; శిబికన్ = పల్లకిని; దిగ్గన = తటాలున; డిగ్గన్ = దిగుటకు; ఉఱికి = దుమికి; ఆ = ఆ; విప్రున్ = బ్రాహ్మణుని; కిన్ = కి; సాష్టాంగదండప్రణామంబులు = సాష్టాంగదండప్రణామములు {సాష్టాంగ దండప్రణామము - స (కూడిన) అష్ట (ఎనిమిది (శిరస్సు కన్నులు చెవులు ముక్కు గడ్డము వక్షము చేతులు కాళ్ళు)) అంగ (అవయవము)లతో దండ (కఱ్ఱవలె పడుకొని చేసెడి) ప్రణామములు (నమస్కారములు)}; ఆచరించి = చేసి; సర్వ = పూర్తిగా; గర్వ = గర్వములను; వర్జితుండు = విడిచినవాడు; ఐ = అయ్యి; ముకుళిత = ముకుళించిన; హస్తుండు = చేతులు గలవాడు; అగుచున్ = అగుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

“రాజా! నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే కాని నాకు కాదు. మానవుడు బలిసి పోవడం, చిక్కిపోవడం, శరీరానికి మనస్సుకు సంబంధించిన జబ్బులు, ఆకలి దప్పులు, ఇష్టపడడం, ద్వేషించడం, భయపడడం, వార్ధక్యం, మరణం, రోషం, నిద్ర, మెలకువ, అహంకార మమకారాలు, మదమాత్సర్యాలు దేహంతో పుడతాయి. కాని నాకు అవి లేవు. నేనే కాదు జనన మరణాలు కలిగి ఉన్న వారందరూ జీవన్మృతులే. యజమాని, సేవకుడు అనే సంబంధం కర్మ వల్ల కలుగుతుంది. కనుక అది శరీరానికే కాని జీవునకు సంబంధించింది కాదు. రాజు ననే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. అంటే నీవు మదోన్మత్తుడవై ఉన్నావన్న మాట! అది నీ వెనుకటి స్వభావం కాని మరేమీ కాదు. అందుకు నేనేం చేయగలను? చెప్పు. పిచ్చివాడు, మూగవాడు, గ్రుడ్డివాడు, తెలివి లేనివాడు ఎంతో నేనుకూడా అంతే. అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం లేదు. అంతే కాకుండా జడుడను, మత్తుడను అయిన నాకు శిక్ష విధిస్తే నీ శ్రమ వ్యర్థం” అని పలికి శాంత స్వభావుడైన ఆ భరతుడు పూర్వ కర్మఫలాన్ని అనుభవించక తప్పదనే భావంతో దండె వదలిపెట్టకుండా ఎప్పటిలాగే పల్లికిని మోయసాగాడు. శాస్త్ర సమ్మతాలైన బ్రాహ్మణుని మాటలను రాజు విన్నాడు. ఆ మాటలు తత్త్వజ్ఞానాపేక్షతో పోతున్న ఆ రాజు హృదయానికి సూటిగా తగిలాయి. అతనిలోని అహంకారం తొలగింధి. ఆ రాజు వెంటనే పల్లకి దిగాడు. బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామం చేసాడు. వినయ వినమ్రుడై చేతులు జోడించి ఇలా అన్నాడు.

5.1-147-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రణీసురులలోనఁ లఁప నెవ్వఁడవు నీ-
వధూతవేషివై వనియందు
నేమిటికై చరియింపంగ వచ్చి? తి-
ట నొక్కఁడవు నొంటి నుట నేఁడు
నుఁ గృతార్థునిఁ జేయ నుకూలుఁ డగుచున్న-
ట్టి యా కపిలమహామునీంద్రుఁ
వొ? నీ మహత్త్వంబు విలి విచారింప-
నెఱుఁగక చేసితిఁ; రుణఁ జూడు

5.1-147.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్పుసైరింపు; నే యమదండమునకు
రుని శూలంబునకును వజ్రాయుధమున
నల చంద్రార్క ధనదశస్త్రాస్త్రములకు
వెఱవ విప్రుని కే మది వెఱచినట్లు.

టీకా:

ధరణీసురుల్ = బ్రాహ్మణుల; లోనన్ = లో; తలపన్ = తరచిచూసిన; ఎవ్వడవు = ఎవరివి; నీవున్ = నీవు; అవధూత = అవధూత; వేషివి = వేషము ధరించినవాడవు; ఐ = అయ్యి; అవనిన్ = భూమి; అందున్ = పైన; ఏమిటి = దేని; కై = కోసమై; చరియింపంగన్ = వర్తించుటకు; వచ్చితి = వచ్చినావు; ఇచటన్ = ఇక్కడ; ఒక్కడవున్ = ఒక్కడవే; ఒంటిన్ = ఒంటరిగా; చనుట = వెళ్ళుట; నేడు = ఈ దినము; ననున్ = నన్ను; కృతార్థునిన్ = ధన్యుని; చేయన్ = చేయుటకు; అనుకూలుడు = అనుగ్రహించువాడు; అగుచున్ = అగుచూ; ఉన్న = ఉన్న; అట్టి = అటువంటి; ఆ = ఆ; కపిల = కపిలుడు యనెడి; మహా = గొప్ప; ముని = మునలలో; ఇంద్రుడవో = ఇంద్రునివంటివాడివేమో; నీ = నీ యొక్క; మహత్త్వంబున్ = గొప్పదనము; తవిలి = పూని; విచారింపన్ = వివరముగా; ఎఱుగక = తెలిసికొనలేక; చేసితిన్ = చేసినాను; కరుణన్ = దయతో; చూడు = చూడుము.
తప్పు = పొరపాటు; సైరింపుము = కాయుము; నేన్ = నేను; యమదండంబున్ = యమదండమున {యమదండము - యముని ఆయుధము}; కున్ = కైనా; హరుని = శివుని; శూలంబున్ = త్రిశూలమున {త్రిశూలము - శివుని ఆయుధము}; కును = కైనా; వజ్రాయుధమున్ = వజ్రాయుధమున {వజ్రాయుధము - ఇంద్రుని ఆయుధము}; కున్ = కైనా; అనల = అగ్ని; చంద్ర = చంద్రుడు; ఆర్క = సూర్యుడు; ధనద = కుబేరుల; శస్త్ర = శస్త్రములు; అస్త్రముల్ = అస్త్రముల; కున్ = కైనా; వెఱవన్ = జంకను; విప్రుని = బ్రాహ్మణుని; కిన్ = కి; ఏన్ = నేను; మదిన్ = మనసున; వెఱచిన = భయపడిన; అట్లు = విధముగ.

భావము:

“నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు. ఎవరివి నీవు? అవధూత వేషంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నన్ను ధన్యుణ్ణి చేయడం కోసం దయతో వచ్చిన కపిల మహర్షివా? నీ మహిమ తెలుసుకోలేక అపచారం చేశాను. నన్ను దయతో చూడు. నా తప్పును క్షమించు. నేను బ్రహ్మణునకు భయపడినట్లు యమధర్మరాజు కాలదండానికి కాని, శివుని శూలాయుధానికి కాని, ఇంద్రుని వజ్రాయుధానికి కాని, అగ్ని చంద్ర సూర్య కుబేరుల శస్త్రాస్త్రాలకు కాని ఏమాత్రం భయపడను.

5.1-148-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నిస్సంగుండవయి జడుండునుంబోలె నిగూఢ విజ్ఞానంబు గలిగి చరియించుచు నున్నవాఁడవు; నీ వచనంబులు యోగశాస్త్ర సమానంబులై వాఙ్మనసంబులకు నభేద్యంబులయి యున్న; వే నవ్విష్ణుకళావతీర్ణుండు సాక్షాద్ధరియు నగు కపిలమహాముని వలన బ్రహ్మవిద్య దెలియం గోరి చనుచున్నవాఁడ; నీవు లోకనిరీక్షణార్థం బవ్యక్తలింగుండవై చరియించుచున్న కపిలమహామునీంద్రుండవు గాబోఁలుదువు; మందుండైన గృహస్థుండు యోగీశ్వర చరిత్రంబు లెట్టు లెఱుంగనేర్చు? కర్మవశంబున దృష్టంబైన భ్రాంతి వహించుచు నడచుచునున్న యీ యాశ్రమంబు నాకునుం బోలె నీకు నగు నని తోఁచుచున్న; దది యెట్లనిన ఘటంబు లేక జలంబు దేనేరని తెఱంగున లేనిది గలుగనేరదు; గావునం బ్రమాణమూలం బయిన లోక వ్యవహారంబు సత్పథంబున సమ్మతంబై యుండుటం జేసి నీ వాడు వాక్యంబులు నాకు సమ్మతంబు గానేర" వని సింధు దేశాధీశ్వరుండు వినిపించిన నా విప్రుండు లోకవ్యవహారంబునకు నిత్యత్వం బౌపాధికం బగుంగాని నిత్యంబు గానేరదని దృష్టాంత నిదర్శనంబుగా నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; నిస్సంగుండవు = సాంగత్యములను విడిచినవాడవు; అయి = అయ్యి; జడుడునున్ = మూఢుని; పోలెన్ = వలె; నిగూఢ = రహస్య; విజ్ఞానంబున్ = విజ్ఞానమును; కలిగి = ఉండి; చరియించుచున్ = వర్తించుచున్; ఉన్నవాడవు = ఉన్నావు; నీ = నీ యొక్క; వచనంబులున్ = మాటలు; యోగశాస్త్ర = యోగశాస్త్రములకు; సమానంబులున్ = సమానమైనవి; ఐ = అయ్యి; వాక్ = వాక్కునకు; మానసంబుల్ = మనసుల; కున్ = కు; అభేద్యంబులున్ = భేదములులేనివి; అయి = అయ్యి; ఉన్నవి = ఉన్నవి; ఏన్ = నేను; ఆ = ఆ; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; కళా = అంశతో; అవతీర్ణుండు = అవతరించినవాడు; సాక్షాత్ = సాక్షాత్తు, కంటి కెదురుగా ఉన్న; హరి = విష్ణుమూర్తి; అగు = అయిన; కపిల = కపిలుడు యనెడి; మహా = గొప్ప; ముని = ముని; వలన = నుండి; బ్రహ్మవిద్యన్ = తత్త్వజ్ఞానమును; తెలియన్ = తెలిసికొనుటను; కోరి = అపేక్షించి; చనుచున్నవాడన్ = వెళుతున్నవాడను; నీవున్ = నీవు; లోక = లోకమును; నిరీక్షార్థంబున్ = పరిశీలించుటకు; అవ్యక్త = వ్యక్తము గాని; లింగుండవు = గుర్తులు గలవాడవు; ఐ = అయ్యి; చరియించుచున్న = తిరుగుతున్న; కపిల = కపిలుడు యనెడి; మహా = గొప్ప; ముని = మునులలో; ఇంద్రుండవు = ఇంద్రుని వంటి వాడవు; కాబోలుదువు = అయ్యియుండవచ్చును; మందుండను = తెలివితక్కువవాడను; ఐన = అయిన; గృహస్థుండు = గృహస్థుడు; యోగి = యోగులలో; ఈశ్వర = ఈశ్వరునివంటివాని; చరిత్రంబుల్ = వర్తనలను; ఎట్టుల్ = ఏ విధముగా; ఎఱుంగన్ = తెలిసికొన; నేర్చున్ = కలుగును; కర్మ = కర్మములకు; వశంబునన్ = వశమయి; దృష్టంబున్ = కనబడునది; ఐన = అయిన; భ్రాంతిన్ = భ్రమను; వహించుచున్ = ధరించి; నడచుచున్న = నడచెడి; ఈ = ఈ; ఆశ్రమంబున్ = ఆశ్రమము; నా = నా; కునున్ = కు; పోలెన్ = వలె; నీ = నీ; కునున్ = కు; అగును = కలుగును; అని = అని; తోచుచున్నది = అనిపించుతున్నది; అది = అది; ఎట్లు = ఏ విధముగా; అనినన్ = అనగా; ఘటంబున్ = కుండ; లేక = లేకుండా; జలంబున్ = నీటిన; తేనేరని = తీసుకు రాలేని; తెఱంగునన్ = విధముగనే; లేనిది = లేనట్టిది; కలుగన్ = ఉండుటకు; నేరదు = సాధ్యపడదు; కావునన్ = అందుచేత; ప్రమాణ = ప్రమాణములపైన; మూలంబున్ = ఆధారపడినది; అయిన = అయినట్టి; లోక = లోకమునకు సంబంధించిన; వ్వవహారంబున్ = వ్యవహారములు; సత్ఫథంబుననన్ = సరియగు మార్గమున; సమ్మతంబున్ = అంగీకార యోగ్యములు; ఐ = అయ్యి; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; నీవున్ = నీవు; ఆడు = పలుకు; వాక్యంబులు = మాటలు; నా = నా; కున్ = కు; సమ్మతంబున్ = అంగీకారము; కానేరవు = కాలేవు; అని = అని; సింధు = సింధు యనెడి; దేశ = దేశమునకు; అధీశ్వరుండు = ప్రభువు; వినిపించినన్ = చెప్పగా; ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; లోకవ్యవహారంబున్ = లౌకికవ్యవహారముల; కున్ = కు; నిత్యత్వంబున్ = శాశ్వతత్వము; ఉపాధికంబున్ = ఆదారభూతము; అగున్ = అగును; కాని = కాని; నిత్యంబున్ = శాశ్వతము; కానేరదు = కాలేదు; అని = అని; దృష్టాంత = ఉదాహరణలతో; నిదర్శనంబు = ఋజువు; కాన్ = అగునట్లు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా నీవు కోరికలు లేనివాడవై పైకి జడుని వలె కనిపిస్తూ నిగూఢమైన విజ్ఞానంతో తిరుగుతున్నావు. నీ మాటలు యోగశాస్త్రాలలోని వాక్యాలకు దీటుగా ఉండి, వాక్కుకు కాని మనసుకు కాని విమర్శించడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి. నేనిప్పుడు విష్ణుదేవుని అంశతో అవతరించినవాడు, సాక్షాత్ విష్ణు స్వరూపుడు అయిన కపిల మహాముని వల్ల బ్రహ్మవిద్యోపదేశం పొందాలని వెళ్తున్నాను. నీవు లోకులను పరీక్షించడం కోసం, ఇతరులు గుర్తించడానికి వీలు లేని ఆకారంలో తిరుగుతున్న సాక్షాత్ కపిల మహర్షివే అనుకుంటున్నాను. మూర్ఖుడైన నావంటి గృహస్థుడు మీవంటి యోగీశ్వరుల చరిత్రలను ఎలా తెలుసుకోగలడు? కుండ లేకపోతే నీరు తీసుకురావడం కుదరదు. అందువల్ల అసలు లేనిది అనుభవానికి రానేరాదు. ప్రమాణాలను బట్టి లోకవ్యవహారాన్ని నమ్ముతున్నాము. అందువల్ల నీ మాటలు నాకు సరిపడుటలేదని అనిపిస్తున్నది” అని సింధుదేశాధిపతి అయిన రహూగణుడు అన్నాడు. ఆ మాటలు విని బ్రహ్మణ కుమారుడైన భరతుడు “లోక వ్యవహారంలోని నిత్యత్వం ఉపాధిపై ఆధారపడి ఉంటుందే కాని అది సత్యం కానేకాదు” అని ఉదాహరణాలతో ఇలా విశదీకరించాడు.

5.1-149-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"పావక శిఖలచే భాండంబు దాఁ దప్త-
గుఁ; దప్త ఘటముచే నందు నున్న
లము తపించు; నా లముచేఁ దండులం-
బులు తప్త మొంది యప్పుడు విశిష్ట
మైన యన్నం బగు; నా చందమునను దా-
దేహేంద్రియంబులఁ దెలివితోడ
నాశ్రయించుక యున్న ట్టి జీవునకు దే-
హంబునఁ బ్రాణేంద్రియాదికమున

5.1-149.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రుగుచుండు నిట్లు సంసారఘట వృత్తి
దుండు నయిన రాజు దుష్టమైన
ర్మములకుఁ బాసి కంజాక్షపద సేవఁ
జేసెనేని భవముఁ జెందకుండు."

టీకా:

పావక = అగ్ని; శిఖల్ = శిఖల; చేన్ = చేత; భాండంబున్ = కుండ; తాన్ = తాను; తప్తము = వేడిది; అగున్ = అగును; తప్త = వేడెక్కిన; ఘటము = కుండ; చేన్ = వలన; అందున్ = దానిలో; ఉన్న = ఉన్నట్టి; = జలము = నీరు; తపించున్ = మరుగును; ఆ = ఆ; జలము = నీటి; చేన్ = వలన; తండులంబులు = బియ్యము; తప్తము = వేడిని; ఒంది = పొంది; అప్పుడు = అప్పుడు; విశిష్టము = చక్కటిది; ఐన = అయిన; అన్నంబున్ = అన్నము; అగున్ = అగును; ఆ = ఆ; చందంబుననున్ = విధముగనే; తాన్ = తాను; దేహ = శరీరము; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; తెలివి = బుద్ధిల; తోడన్ = తోటి; ఆశ్రయించుకన్ = ఆశ్రయించుకొని; ఉన్నయట్టి = ఉన్నట్టి; జీవున్ = జీవున; కున్ = కు; దేహంబునన్ = శరీరమున; ప్రాణ = ప్రాణము; ఇంద్రియ = ఇంద్రియములు; ఆదికమునన్ = మొదలగునవి; =
జరుగుచుండున్ = నడచుచుండును; ఇట్లు = ఈ విధముగ; సంసార = సంసారము యనెడి; ఘట = కుండ; వృత్తిదుండున్ = వర్తించెడివాడు; అయిన = అయినట్టి; రాజు = రాజు; దుష్టము = చెడ్డవి; ఐన = అయినట్టి; కర్మముల = కర్మల; కున్ = కు; పాసి = దూరమై; కంజాక్ష = విష్ణుమూర్తి; పద = పాదముల; సేవన్ = సేవించుటను; చేసెనేని = చేసినచో; భవమున్ = పునర్జన్మము, సంసారమును; చెందకుండు = చెందకనుండును.

భావము:

“అగ్ని జ్వాలలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులోని నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యపు గింజలు బాగా ఉడికి పక్వమై అన్నం సిద్ధమవుతుంది. అలాగే దేహాన్నీ, ఇంద్రియాలనూ ఆశ్రయించుకొని జీవుడున్నాడు. దేహంలోనే ప్రాణం, ఇంద్రియాలు ఉన్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకూ సంక్రమిస్తాయి. ప్రజల శిక్షణ, రక్షణ కోసం రాజున్నాడు. ఆ రాజు చెడు కర్మలు వదలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే సంసార బంధాలనుండి విముక్తు డౌతాడు”.

5.1-150-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుచు ధారుణీసురాత్మజుఁ డీ రీతి
లుకుటయును రాజు రిణమించి
వినయవాక్యములను వినుతించి క్రమ్మఱఁ
బుణ్యుఁ డైన సింధు భూవరుండు.

టీకా:

అనుచున్ = అనుచూ; ధారుణీసుర = బ్రాహ్మణ; ఆత్మజుడు = పుత్రుడు; ఈ = ఈ; రీతిన్ = విధముగ; పలుకుటయును = చెప్పెను; రాజు = రాజు; పరిణమించి =సంతసించి; వినయ = వినయముగల; వాక్యములను = మాటలతో; వినుతించి = స్తుతించి; క్రమ్మఱన్ = మరల; పుణ్యుండు = పుణ్యాత్ముడు; ఐన = అయినట్టి; సింధు = సింధుదేశపు; భూవరుండు = రాజు.

భావము:

బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఈ విధంగా పలుకగానే రాజులో మార్పు కలిగింది. ఆ తరువాత వినయోక్తులతో స్తుతించి భరతునితో సింధురాజు ఇలా అన్నాడు.

5.1-151-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మహాత్మ! నేను రాజ ననియెడి యభిమాన మదాంధుండనై మహాత్ములం దిరస్కరించిన నన్నుఁ గరుణింపుము; నీ వార్తబంధుండవు; నీ కృపాదృష్టింజేసి మహాత్ముల నవమానంబు చేసిన దురితంబువలన విముక్తుండ నయ్యెద; విశ్వసుహృత్త వైన నీకుం గోపంబు గలుగనేర; దసమర్థులయిన మాబోఁటి వారలు మహాజనావమానంబున శీఘ్రంబె నశింతురు; గావున నీవు దయాళుండ వయి నన్ను మన్నింపు" మనిన నా విప్రుం డిట్లనియె.

టీకా:

మహాత్మ = గొప్పవాడ; నేను = నేను; రాజన్ = రాజును; అనియెడి = అనెడి; అభిమాన = అహంకారమువలని; మద = మదముచే; అంధుండను = గుడ్డివాడిని; ఐ = అయ్యి; మహాత్ములన్ = గొప్పవారిని; తిరస్కరించిన = అవమానించిన; నన్నున్ = నన్ను; కరుణింపుము = దయచూడుము; నీవున్ = నీవు; ఆర్త = ఆర్తులకు; బంధుండవు = చుట్టమవు; నీ = నీ యొక్క; కృపా = దయతో కూడిన; దృష్టిన్ = చూపుల; చేసి = వలన; మహాత్ములన్ = గొప్పవారిని; అవమానంబు = అవమానము; చేసిన = ఒనరించిన; దురితంబు = పాపము; వలనన్ = నుండి; విముక్తుండను = వెలువడినవాడను; అయ్యెదన్ = అయ్యెదను; విశ్వ = జగత్తునకే; సుహృత్తవు = స్నేహితుడవు; ఐన = అయినట్టి; నీ = నీ; కున్ = కు; కోపంబున్ = కోపము; కలుగనేరదు = పుట్టదు; అసమర్థులు = చేతకానివారము; అయిన = అయినట్టి; మా = మా; పోటి = వంటి; వారలు = వారు; మహా = గొప్ప; జన = వారిని; అవమానంబునన్ = అవమానించుటచే; శీఘ్రంబె = వెంటనే; నశింతురు = నశించెదరు; కావునన్ = అందుచేత; నీవున్ = నీవు; దయాళుండవు = కృపచేయువాడవు; అయి = అయ్యి; నన్నున్ = నన్ను; మన్నింపుము = క్షమింపుము; అనినన్ = అనగా; ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

“మహాత్మా! నేను రాజునన్న గర్వంతో గుడ్డివాణ్ణై మీవంటి మహాత్ములను తిరస్కరించిన నన్ను కరుణించు. నీవు దీన బాంధవుడవు. నీ కృపాకటాక్షంతో మహాత్ముల నవమానించిన పాపంనుండి నేను విముక్తుణ్ణి అవుతాను. లోకానికి మిత్రుడవైన నీకు కోపం ఉండదు. అసమర్థులమైన మావంటివాళ్ళు గొప్పవారిని అవమానించి తొందరగా నాశనమౌతారు. అందువల్ల దయాదృష్టితో నన్ను క్షమించు” అని రాజు చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు.

5.1-152-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కడు వేడ్క నీ వవిద్వాం
సుఁవై యుండియును మిగులఁ జోద్యము విద్వాం
సుఁడుఁ బోలెను బలికెద వి
ప్పుడు మేలనవచ్చుఁగొంత పురుషులలోనన్

టీకా:

కడు = మిక్కిలి; వేడ్కన్ = కుతూహలముగా; నీవున్ = నీవు; అవిద్వాంసుడవు = పండితుండవు కాకపోయి; ఐ = ఉండి; ఉండియునున్ = ఉండినను; మిగులన్ = మిక్కిలి; చోద్యమున్ = వింతగా; విద్వాంసుడున్ = పండితుడు; పోలెనున్ = వలె; పలికెదవు = పలుకుచున్నావు; ఇప్పుడు = ఇప్పుడు; = మేలు = ఉత్తముడవు; అనవచ్చున్ = అనవచ్చు; కొంతన్ = కొంతవరకు; పురుషుల్ = మానవుల; లోనన్ = అందు.

భావము:

“నీవు విద్వాంసుడవు కాకున్నా విద్వాంసుని వలె మాట్లాడుతున్నావు. వింతగా ఉంది. అయినా నిన్ను కొంత మెచ్చుకొనవచ్చు.

5.1-153-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రఁగఁ బెద్ద లీ ప్రపంచమంతయుఁ దథ్య
నరు; నీవు తథ్య నుచుఁ బలికి;
ట్లుగాన నిన్ను ధికుండ వని పల్క
రాదు నాకుఁ జూడ రాజచంద్ర!

టీకా:

పరగన్ = ప్రసిద్దముగ; పెద్దలు = పెద్దవారు; ఈ = ఈ; ప్రపంచము = జగత్తు; అంతయున్ = అంతటిని; తథ్యము = నిజము; అనరు = అని చెప్పరు; నీవున్ = నీవు; తథ్యము = నిజము; అనుచున్ = అని; పలికితి = అంటివి; అట్లుగాన = అందుచేత; నిన్నున్ = నిన్ను; అధికుండవు = గొప్పవాడవు; అని = అని; పల్కరాదు = చెప్పలేము; నా = నా; కున్ = కు; చూడన్ = తరచిచూసినచో; రాజ = రాజులలో; చంద్ర = చంద్రునివంటివాడ.

భావము:

రాజా! పెద్ద లెవరూ ఈ ప్రపంచం సత్యమని చెప్పరు. కాని నీవు సత్య మంటున్నావు. అందువల్ల నీవు అధికుడవు అని చెప్పడానికి వీలులేదు.

5.1-154-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జ్ఞాదికములందు నామ్నాయములయందుఁ-
ఱచుగాఁ దత్త్వవాదంబు లేదు
స్వప్నంబునందుల సౌఖ్యమాకారంబు-
నందుల నిత్యమై యంతలేని
ట్టి చందమున వేదాంత వాక్యంబులు-
త్త్వంబు నెఱిఁగించి లఁగుఁగాని
నిత్యంబులై యుండనేరవు; పురుషుని-
చిత్తంబు గుణములఁ జెంది యెంత

5.1-154.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాలముండును మఱి యంత కాలమందు
రయ విజ్ఞాన కర్మేంద్రిములచేత
రగి ధర్మంబులను నధర్మంబులట్లు
గిలి పుట్టించుచుండు నత్యంత మహిమ.

టీకా:

యజ్ఞ = యజ్ఞము; ఆదికముల్ = మొదలగువాని; అందున్ = అందు; ఆమ్నాయమున్ = వేదము; అందున్ = లోను; తఱచుగా = ఎక్కువగా; తత్త్వవాదంబు = పరబ్రహ్మముగురించినవిచారణ; లేదు = లేదు; స్వప్నంబున్ = కల; అందులన్ = లో; సౌఖ్యము = సుఖపడుట యొక్క; ఆకారంబున్ = ఆకారముల; అందులన్ = లో; నిత్యము = ఎల్లప్పుడు ఉండునవి; ఐ = అయ్యి; అంతన్ = అంతలోనే; లేని = లేకపోవును; అట్టి = అటువంటి; చందమునన్ = విధముగనే; వేదాంత = వేదాంతములలోని; వాక్యంబులు = సూక్తులు; తత్త్వంబున్ = తత్త్వమును; ఎఱిగించి = తెలియజేసి; తలగున్ = తొలగిపోవును; కాని = అంతేకాని; నిత్యంబులు = శాశ్వతములు; ఐ = అయ్యి; ఉండనేరవు = ఉండలేవు; పురుషుని = మానవుని; చిత్తంబున్ = మనసు; గుణములన్ = త్రిగుణములకు; చెంది = చెంది; ఎంత = ఎంత.
కాలమున్ = కాలమైతే; ఉండును = ఉండునో; మఱి = మఱి; అంత = అంత; కాలమున్ = కాలము; అందున్ = వరకు; అరయన్ = తరచిచూసినచో; విజ్ఞాన = జ్ఞానేంద్రియములు; కర్మేంద్రియముల్ = కర్మేంద్రియముల; చేత = కు; మరగి = అలవాటుపడి; ధర్మంబులనున్ = ధర్మములను; అధర్మంబుల్ = అధర్మములు; అట్లున్ = అయినట్లు; తగిలి = పూని; పుట్టించుచుండు = కలిగించుతుండును; అత్యంత = అత్యధికమైన; మహిమ = మహత్యముతో.

భావము:

యజ్ఞాలలోను, వేదాలలోను స్వస్వరూప స్థాపనం లేదు. కలలో అనుభవించిన సౌఖ్యాలకు ఆకారాలు ఉన్నాయి. కలలో అవి సత్యాలే. కాని మెలకువలో అసత్యాలు. అలాగే వేదాంత వాక్యాలనేవి తత్త్వస్వరూపం అనుభవమయ్యే వరకు సత్యాలుగా భాసిస్తాయి. కాని అవి నిత్యాలు కావు. జీవుని చిత్తం ఎంతకాలం త్రిగుణాలతో కూడి ఉంటుందో అంతకాలం జ్ఞానేంద్రియాలతోను, కర్మేంద్రియాలతోను సన్నిహితత్వం కలిగి ఉంటుంది. ఈ అలవాట్లు ధర్మాలో, అధర్మాలో మనసులో పుడుతుంటాయి.

5.1-155-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు ధర్మాధర్మవాసనాయుక్తంబు విషయానురక్తంబు నైన చిత్తంబు గుణ ప్రవాహంబులచేత వికారంబు నొంది దేవతిర్యఙ్మనుష్య రూపంబు లయిన దేహంబులం బుట్టించుచుఁ గాలప్రాప్తంబులైన సుఖదుఃఖ తదుభయ ఫలంబు లననుభవించుచు ననవరతంబు జీవునికిం బ్రత్యక్షం బగుచు స్థూల సూక్ష్మరూపంబుల నుండు; స్వాంతంబు గుణరహితంబైన ముక్తి కారణంబగు; ఘృతవర్తులుగల దీపంబు సధూమ శిఖలం బుట్టించు; ఘృతవర్తులు నాశంబు నొందిన స్వరూపంబుఁ బొందు; నీ తెఱంగున మనంబు గుణకర్మానుబంధంబైన జన్మాదులం బుట్టించు; గుణకర్మంబులం బాసెనేనిం బరతత్త్వంబు నొందు; జ్ఞానేంద్రియంబు లేనును విషయంబులమీఁదఁ దోఁచు; బుద్ధు లేనును నభిమానంబును నను నేకాదశవృత్తులం గూడిన మనంబు జీవునికి నసంఖ్యంబు లయిన జన్మంబుల బొందించు; మనోవృత్తుల నతిక్రమించిన జీవుండు పరంజ్యోతియైన నారాయణ స్వరూపంబుగా నెఱుంగుము; స్థావర జంగమంబు లయిన జీవులకుం బవనుండు ప్రాణంబై యున్న చందంబున నీశ్వరుండు సర్వభూతాంతర్యామి యగుచు జీవాత్మ స్వరూపంబున నుండు; జీవాత్ముండు జ్ఞానోదయంబునం జేసి మాయ నెంతకాలంబు గెలువకుండు నంతకాలంబు ముక్తసంగుండు గాఁ; డరిషడ్వర్గంబును జయించి పరతత్త్వంబు నెఱింగిన నీశ్వరుం డగు; చిత్తం బెంత కాలంబు విషయాసక్తం బగు నంతదడవు సంసారచక్రంబు నందు సంచరించుం గావున మహావీరుండైనను దనకు శత్రువైన మనంబు నప్రమత్తుండయి యుపేక్షాబుద్ధింజేసి యిచ్ఛావిహారంబున జరగనీక పరమ గురుండైన శ్రీహరిచరణోపాసనాస్త్రంబునం జిత్తంబు గెలిచినం బరతత్త్వంబు నొందు" నని విప్రుండు పలికిన నతని మహిమకు వెఱఁ గంది బ్రాహ్మణునకు నమస్కారంబుచేయుచు భూవరుం డిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; ధర్మ = ధర్మముల; అధర్మ = అధర్మముల; వాసనా = సంస్కారములతో; యుక్తంబున్ = కూడియున్నది; విషయ = ఇంద్రియార్థములందు; అనురక్తంబున్ = ఆసక్తిగలది; ఐన = అయిన; చిత్తంబున్ = మనసు; గుణములన్ = త్రిగుణముల యొక్క; ప్రవాహంబుల్ = నడకల; చేత = వలన; వికారంబున్ = మార్పులను; ఒంది = పొంది; దేవ = దేవతలు; తిర్యక్ = జంతువులు; మనుష్య = మానవ; రూపంబుల్ = రూపములు; అయిన = అయిన; దేహంబుల = శరీరములను; పుట్టించుచున్ = పుట్టించుతూ; కాల = కాలానుగుణముగా; ప్రాప్తంబులు = సంభవించునవి; ఐన = అయిన; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములు; తత్ = ఆ; ఉభయ = రెండు; ఫలంబులన్ = ఫలితములను; అనుభవించుచున్ = అనుభవించుతూ; అనవరతంబున్ = ఎడతెగక; జీవుని = జీవుని; కిన్ = కి; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; అగుచున్ = అగుతూ; స్థూల = భౌతికముగ తెలియునట్టి; సూక్ష్మ = బౌతికముగా కనిపించని; స్వాంతంబు = మనసు; గుణ = త్రిగుణములు; రహితంబున్ = లేనిది; ఐన = అయినచో; ముక్తి = మోక్షమును; కారణంబున్ = కలిగించునది; అగున్ = అగును; ఘృత = నేయి; వర్తులు = వత్తులు; కల = కలిగిన; దీపంబు = దీపము; సధూమ = పొగతోకూడిన; శిఖలన్ = జ్వాలలను; పుట్టించున్ = కలుగజేయును; ఘృత = నేయి; వర్తులు = వత్తులు; నాశంబున్ = నాశనమును; ఒందిన = పొందినచో; స్వ = స్వంత; రూపంబున్ = రూపమును; పొందును = పొందును; ఈ = ఈ; తెఱంగునన్ = విధముగనే; మనంబున్ = మనసు; గుణ = గుణములతోను; కర్మ = కర్మలతోను; అనుబంధంబులు = సంబంధములు కలవి; ఐన = అయిన; జన్మ = జన్మలు; ఆదులన్ = మొదలగువానిని; పుట్టించున్ = కలిగించును; గుణ = గుణములను; కర్మంబులన్ = కర్మములనుండి; పాసెన్ = విడివడినట్లు; ఏని = అయితే; పరతత్త్వంబున్ = పరబ్రహ్మమును; ఒందున్ = పొందును; జ్ఞానేంద్రియంబులు = జ్ఞానేంద్రియములు {పంచజ్ఞానేంద్రియములు - 1కన్ను 2చెవి 3ముక్కు 4నాలుక 5చర్మము}; ఏనునున్ = ఐదు (5); విషయంబుల్ = ఇంద్రియార్థముల; మీదన్ = పైన; తోచు = తెలిసెడి; బుద్ధులు = తన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1రూపు 2ధ్వని 3వాసన 4రుచి 5స్పర్శ}; ఏనునున్ = ఐదు (5); అభిమానంబునున్ = అహంకారము; అను = అనెడి; ఏకాదశవృత్తులన్ = ఏకాదశవృత్తులను {ఏకాదశవృత్తులు - పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు అహంకారము యనెడి వ్యాపారములు పదకొండు (11)}; కూడిన = కలిసినట్టి; మనంబున్ = మనసు; జీవుని = జీవుని; కిన్ = కి; అసంఖ్యలు = అనేకమైనవి; అయిన = అయినట్టి; జన్మంబులన్ = జన్మలను; పొందించున్ = కలిగించును; మనోవృత్తులన్ = మనోవృత్తులను {మనోవృత్తులు – మనసున కేర్పడు ఏకాదశవృత్తులు}; అతిక్రమించిన = దాటిన; జీవుండు = జీవుడు; పరంజ్యోతి = పరబ్రహ్మము {పరంజ్యోతి - సర్వాతీతమైన ప్రకాశము, పరబ్రహ్మము}; ఐన = అయినట్టి; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; స్వ = స్వంత; రూపంబున్ = రూపము; కాన్ = అగునట్లు; ఎఱుంగుము = తెలియుము; స్థావర = కదలలేనివి; జంగంబులు = కదలగలవి; అయిన = అయినట్టి; జీవుల్ = ప్రాణుల; కున్ = కు; పవనుండు = వాయువు; ప్రాణంబున్ = ప్రాణము; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; చందంబునన్ = విధముగా; ఈశ్వరుండు = భగవంతుడు; సర్వ = సకలమైన; భూత = ప్రాణుల; అంతర్యామి = లోపలవ్యాపించియుండువాడు; అగుచున్ = అగుచూ; జీవాత్మ = జీవాత్మ {జీవాత్మ - జీవుల యొక్క ఆత్మ}; స్వరూపంబునన్ = స్వరూపమున; ఉండున్ = ఉండును; జీవాత్ముండు = కేవల జీవాత్మ ఐనవాడు; జ్ఞానోదయంబునన్ = జ్ఞానోదయమున {జ్ఞానోదయము – జ్ఞానము కలిగి ఉండుట}; చేసి = వలన; మాయన్ = మాయను; ఎంత = ఎంత; కాలంబున్ = కాలము; గెలవకుండున్ = జయించకుండునో; అంత = అంత; కాలంబున్ = కాలము; ముక్తసంగుండు = ముక్తసంగుడు {ముక్తసంగుడు - ముక్త (విడువబడిన) సంగుడు (తగులములు కలవాడు)}; కాడు = కాలేడు; అరిషడ్వర్గంబును = అరిషడ్వర్గమును {అరిషడ్వర్గము - 1కామ 2క్రోధ 3మోహ 4లోభ 5మద 6మాత్సర్యంబులు యనెడి ఆరుగురు శత్రువులు}; జయించి = జయించి; పరతత్త్వంబున్ = పరబ్రహ్మమును; ఎఱింగినన్ = తెలుసుకొన్నచో; ఈశ్వరుండు = భగవంతుడు; అగున్ = అగును; చిత్తంబున్ = మనస్సు; ఎంత = ఎంత; కాలంబున్ = కాలమైతే; విషయ = ఇంద్రియార్థము లందు; ఆసక్తంబున్ = తగులుకొన్నది; అగున్ = అగునో; అంత = అంత; తడవు = కాలము; సంసారచక్రంబున్ = చావు పుట్టుకలు అనెడి వలయము; అందున్ = లోపలనే; సంచరించున్ = తిరుగుతుండును; కావునన్ = అందుచేత; మహా = గొప్ప; వీరుండు = శూరుడు; ఐనను = అయినప్పటికిని; తన = తన; కున్ = కు; శత్రువు = శత్రువు; ఐన = అయిన; మనంబునన్ = మనసును; ప్రమత్తుండు = ఏమరుపాటు లేనివాడు; అయి = అయ్యి; ఉపేక్షా = నిర్లక్షము గల; బుద్ధిన్ = బుద్ధి; చేసి = వలన; ఇచ్చా = ఇష్టానుసారము; విహారంబునన్ = తిరుగుటను; జరగనీక = నడవనీయకుండా; పరమ = అత్యున్నతమైన; గురుండు = గురువు; ఐన = అయినట్టి; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదముల; ఉపాసనా = సేవించుట యనెడి; అస్త్రంబునన్ = ఆయుధముచే; చిత్తంబున్ = మనసును; గెలిచినన్ = జయించినచో; పరతత్త్వంబున్ = పరతత్త్వమును; ఒందును = చెందును; అని = అని; విప్రుండు = బ్రాహ్మణుడు; పలికినన్ = పలుకగా; అతని = అతని యొక్క; మహిమ = గొప్పదనమున; కున్ = కు; వెఱగున్ = ఆశ్చర్యమును; అంది = పడి; బ్రాహ్మణున్ = బ్రాహ్మణున; కున్ = కు; నమస్కారంబున్ = నమస్కారములు; చేయుచున్ = చేయుచూ; భూవరుండు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

మనస్సుకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ధర్మ, అధర్మాల రూపంలో ఉంటుంది. ఆ మనస్సు ఇంద్రియ వ్యసనాల పట్ల అనురక్తి కలిగి ఉంటుంది. సత్త్వరజస్తమోగుణాల ప్రవాహాలతో వికారం పొందుతుంది. ఈ సంస్కారాన్ని బట్టి జీవుడు దేవతలు, జంతువులు, మానవులు అనే రూపాలను ధరిస్తుంటాడు. అటువంటి దేహాలలోని మనస్సు ఆయా కాలాలలో ప్రాప్తించే సుఖ దుఃఖ ఫలాలను అనుభవిస్తూ జీవునికి ఎల్లప్పుడు ప్రత్యక్షమౌతూ స్థూల సూక్ష్మ రూపాలతో ఉంటుంది. మనస్సు గుణరహిత మైనపుడు కలిగే అనుభవమే ముక్తి. నేతిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తే పొగలతో కూడిన జ్యోతి పుడుతుంది. నేయి, వత్తి లేకపోతే స్వస్వరూపాన్ని పొందుతుంది. అలాగే గుణకర్మాల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకు, కర్మలకు తగిన జన్మలకు కారణమౌతుంది. గుణాలు, కర్మలు అసలు లేకపోతే మనస్సు అనేదే ఉండదు. కేవలం పరతత్త్వంగా మిగులుతుంది. జ్ఞానేంద్రియాలు ఐదు, ఇంద్రియార్థాల మీద పనిచేసే ప్రజ్ఞలు ఐదు, అభిమానం అనే పదకొండు మనస్సుకు ఏర్పడే వృత్తులు. ఈ పదకొండు వృత్తులలో కూడిన మనస్సు ఈ జీవునికి లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది. పైన చెప్పిన మనోవృత్తులను దాటిన జీవుడు పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపమే అవుతాడు. చరాలు, అచరాలు అయిన జీవులకు వాయువు ప్రాణంగా ఉన్నట్టు, ఈశ్వరుడు అన్ని ప్రాణులలోను ఉంటూ జీవాత్మ స్వరూపుడుగా గోచరిస్తాడు. మనస్సు ఎంతకాలం మాయను గెలువకుండా ఉంటుందో అంతకాలం జీవుడు ఇంద్రియ లంపటత్వంతో ఉంటాడు. కామ క్రోధాదులైన అరిషడ్వర్గాన్ని జయించి, పరబ్రహ్మను తెలుసుకుంటే భగవంతుడే అవుతాడు. మనస్సు ఎంతకాలం ఇంద్రియార్థాలలో తగులుకొని ఉంటుందో అంతకాల జీవుడు చావు పుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటాడు. కావున మహావీరుడైనా తనకు శత్రువైన మనోవృత్తుల పట్ల జాగరూకుడై ఉండాలి. మనస్సును తోచినట్లు తిరుగనీయరాదు. జీవుడు శ్రీహరి పాద ధ్యనమనే ఆయుధంతో మనస్సును గెలిచినట్లయితే పరతత్త్వాన్ని అందుకుంటాడు” అని బ్రాహ్మణుడైన భరతుడు చెప్పగా విని అతని మహిమకు ఆశ్చర్యపడి నమస్కరించి రాజైన రహూగణుడు ఇలా అన్నాడు.

5.1-156-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కాణ విగ్రహంబు నురుకాయము నీ యవధూతవేషమున్
భూరిధరామరత్వమును బూర్వసమాగమ మాత్మభావముం
జారువిహార మత్యతుల శాంతి గుణంబును గూఢ వర్తనం
బాయఁ గల్గు నీకు ననయంబును మ్రొక్కెదఁ బెక్కు భంగులన్.

టీకా:

కారణవిగ్రహంబునున్ = కారణజన్మ {కారణవిగ్రము - ప్రయోజనార్థమైన జన్మ}; ఉరు = పెద్ద; కాయమున్ = శరీరము; ఈ = ఈ; అవధూత = అవధూత {అవధూత – దిగంబర సన్యాసి}; వేషమున్ = వేషము; భూరి = అతిగొప్ప; ధరామరత్వమునున్ = బ్రాహ్మణత్వము; పూర్వసమాగమము = తొలిపరిచయము, పూర్వజన్మ సమాగతము; ఆత్మభావమున్ = ఆత్మజ్ఞానము; చారు = మనోహరమైన; విహారమున్ = విహరించుటలు; అత్యతుల = మిక్కిలి సాటిలేని; శాంతిగుణంబును = శాంత స్వభావము; గూఢ = నిగూఢమైన; వర్తనంబు = ప్రవర్తనలు; ఆరయన్ = తరచిచూసినచో; కల్గు = కలిగినట్టి; నీ = నీ; కున్ = కు; అనయంబునున్ = ఎల్లప్పుడు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; పెక్కు = అనేక; భంగులన్ = విధములుగా.

భావము:

"కారణ జన్మమైన ఈ నిండైన విగ్రహం, ఈ అవధూత వేషం, జన్మాంతర సమాగతమైన ఈ ఆత్మజ్ఞానం, ఈ స్వేచ్ఛా విహారం, సాటిలేని ఈ శాంతగుణం, ఈ విధమైన రహస్య ప్రవర్తనం కలిగిన నీకు సదా నమస్కరిస్తున్నాను.

5.1-157-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జ్వరితార్తుం డగు రోగి కౌషధ మతీష్టంబైన చందంబునన్
లో నాతపతప్త దేహి గడు శీతంబైన తోయంబునున్
రిమం గోరినరీతి నెంతయు నహంకారాహి దష్టుండనై
రఁగున్ నాకును నీ వచోమృతము దప్పన్ మందు వేఱున్నదే?

టీకా:

జ్వరిత = జ్వరమువలన; ఆర్తుండు = బాధపడెడివాడు; అగు = అయిన; రోగి = రోగి; కిన్ = కి; ఔషధము = మందు; అతి = మిక్కిలి; ఇష్టంబు = ఇష్టము; ఐన = అగు; చందంబునన్ = విధముగ; ధర = ప్రపంచము; లోనన్ = లో; ఆతప = ఎండకి; తప్త = కాలుతున్న; దేహి = దేహము గలవాడు; కడు = మిక్కిలి; శీతంబున్ = చల్లటివి; ఐన = అయిన; తోయంబునున్ = నీటిని; గరిమన్ = గట్టిగా; కోరిన = అపేక్షించెడి; రీతిన్ = విధముగనె; ఎంతయున్ = మిక్కిలి; అహంకార = అహంకారము యనెడి; అహిన్ = పాముచేత; దష్టుండను = కాటువేయబడినవాడను; ఐ = అయ్యి; పరగన్ = ప్రసిద్దముగ; నా = నా; కునున్ = కు; నీవున్ = నీవు; వచస్ = పలుకులు యనెడి; అమృతమున్ = అమృతము; తప్పన్ = తప్పించి; మందు = ఔషధము; వేఱ = వేరే ఇతరమైనది; ఉన్నదే = ఉన్నదా ఏమి, లేదు.

భావము:

జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లు, ఎండలో తపించిన వానికి చల్లని నీరు సమకూరినట్లు అహంకారమనే పాముకాటుకు గురి అయిన నాకు నీ మాటలు అనే అమృతం తప్ప వేరే మందు ఉన్నదా?

5.1-158-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విప్రవర్య! నేను వేడ్కతో నా సంశ
యంబులెల్ల నిన్ను డిగి తెలియఁ
లఁచి యున్నవాఁడ; ప్పక యెఱిఁగింపు
ముచితవృత్తిఁ దత్త్వయోగమెల్ల.

టీకా:

విప్ర = భ్రాహ్మణులలో; వర్య = ఉత్తముడా; నేను = నేను; వేడ్క = కుతూహలము; తోన్ = తో; నా = నా యొక్క; సంశయంబులన్ = సంశయములను; ఎల్లన్ = అన్నిటిని; నిన్నున్ = నిన్ను; అడిగి = అడిగి; తెలియన్ = తెలిసికొనవలెనని; తలచి = భావించి; ఉన్నవాడన్ = ఉన్నాను; తప్పక = తప్పకుండ; ఎఱిగింపుము = తెలుపుము; ఉచిత = తగిన; వృత్తిన్ = విధానములో; తత్త్వయోగము = తత్త్వయోగము {తత్త్వయోగము - ఆత్మతత్త్వమునకు సంబంధించిన యోగము}; ఎల్ల = సమస్తమును.

భావము:

బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నా సందేహా లన్నిటినీ నిన్ను అడిగి నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. దయచేసి నాకు అధ్యాత్మ తత్త్వాన్ని సమగ్రంగా వివరించు”.

5.1-159-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యడిగిన యా రాజునకు విప్రుం డిట్లనియె.

టీకా:

అని = అని; అడిగినన్ = అడుగగా; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; విప్రుండు = బ్రాహ్మణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని ప్రశ్నించిన రాజుతో బ్రాహ్మణుడైన భరతుడు ఇలా అన్నాడు.

5.1-160-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాన వచ్చిన ఫలములు ర్మమూల
ము లగుటను జేసి సంసారములను జిత్త
మెపుడు వర్తించుచుండఁగా నెఱుఁగ లేవు
త్త్వయోగంబు మిగుల నిత్యం బటంచు.

టీకా:

కాన = కావున; వచ్చిన = కలిగిన; ఫలములు = ఫలితములు; కర్మ = కర్మములు; మూలములు = కారణములుగా కలవి; అగుటను = అగుట; చేసి = వలన; సంసారములనున్ = సంసారములలో; చిత్తము = మనసు; ఎపుడున్ = ఎప్పుడును; వర్తించుచున్ = ప్రవర్తించుతూ; ఉండగాన్ = ఉండగా; ఎఱుగన్ = తెలిసికొన; లేవు = లేవు; తత్త్వయోగంబు = తత్త్వయోగము; మిగులన్ = మిక్కిలి; నిత్యంబున్ = శాశ్వతమైనది; అటన్ = అని; అంచున్ = అనుచూ.

భావము:

“పూర్వ జన్మలలో చేసిన కర్మలను బట్టే ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన యుక్తి శక్తుల వల్ల కలిగాయని భావిస్తుంటాడు. మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంత వరకు తత్త్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు.

5.1-161-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నీ వసుంధర నున్న చరణంబులకు నెక్కుడు జంఘ లా మీఁద జానువు లా పొడవున నూరువు లందులకు నుపరిప్రదేశంబున మధ్యం బట మీఁద నుర మందులకు నెక్కున కంఠం బటమీఁద స్కంధం బందుల దారు వా దారువున శిబిక శిబిక యందు రాజ ననియెడి యభిమానంబుగలిగి నీవున్నవాడ విట్టి చోద్యంబయిన కష్టదశంబొందిన నీవు ప్రజాపాలనంబు చేయుచున్నవాఁడ; నను గర్వంబున మా వంటి మహాత్ముల సభలలోనం బూజ్యుండవుగాక యున్నవాడ; వీ స్థావర జంగమంబులకు నివాస స్థానంబు వసుంధర యైన చందంబున సత్క్రియలచేత నెఱుఁగం దగిన జగత్కారణంబైన తత్త్వంబు నెఱింగించెద; పరమాణు సముదయం బీ ధరిత్రియైన చందంబున నవిద్యామనంబులచేతం గల్పితం బయిన కృశస్థూల బృహదణు సదసజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ కాల నామ బుద్ధిరూపంబైన మాయచే జగత్తు రెండవదియై కల్పింపంబడియె; బాహ్యాభ్యంతరంబులం గలిగి స్వప్రకాశంబై భగవచ్ఛబ్దవాచ్యంబును విశుద్ధంబును బరమార్థంబును జ్ఞానరూపంబును నైన బ్రహ్మంబు బొకటియే సత్యంబు; జగత్తసత్యం బగు”; నని పలికి మఱియును

టీకా:

మఱియున్ = ఇంకను; ఈ = ఈ; వసుంధరన్ = భూమిపైన; ఉన్న = అన్నట్టి; చరణంబుల = పాదముల; కున్ = కు; ఎక్కుడు = ఎత్తులో; జంఘలున్ = పిక్కలు; ఆ = ఆ; మీదన్ = పైన; జానువులున్ = మోకాళ్ళు; ఆ = ఆ; పొడవునన్ = పైన; ఊరువులున్ = తొడలు; అందుల = వాని; కునున్ = కి; పరి = పై; ప్రదేశంబునన్ = ప్రదేశము; మధ్యంబున్ = నడుము; అటన్ = దాని; మీదన్ = పైన; ఉరమున్ = వక్షస్థలము; అందుల = దాని; కున్ = కి; ఎక్కున = పైన; కంఠంబున్ = కంఠము; అటన్ = ఆ; మీదన్ = పైన; స్కంధంబు = మూపు; అందులన్ = అక్కడ; దారువు = కఱ్ఱ; దారువునన్ = కఱ్ఱకి; శిబిక = పల్లకి; శిబిక = పల్లకి; అందున్ = లో; రాజన్ = రాజును; అనియెడి = అనెడి; అభిమానంబున్ = అహంకారము; కలిగి = ఉండి; నీవున్ = నీవు; ఉన్నవాడవు = ఉన్నావు; ఇట్టి = ఇటువంటి; చోద్యంబు = ఆశ్చర్యకరము; అయిన = అయినట్టి; కష్ట = కష్టమైన; దశన్ = స్థితిని; పొందిన = పొందినట్టి; నీవున్ = నీవు; ప్రజా = ప్రజలను; పాలనంబున్ = పరిపాలించుటను; చేయుచున్న = చేయుచున్నట్టి; వాడను = వాడిని; అను = అనెడి; గర్వంబునన్ = గర్వముతో; మా = మా; వంటి = వంటి; మహాత్ములన్ = గొప్పవారిని; సభల = సభల; లోన్ = లోపల; పూజ్యుండవు = గౌరవింప దగిన వాడవు; కాక = కాకుండగ; ఉన్నవాడవు = ఉన్నావు; ఈ = ఈ; స్థావర = కదలలేనివి; జంగముల్ = కదలగలవి; కున్ = కు; నివాస = ఉండెడి; స్థానంబున్ = స్థలము; వసుంధరన్ = భూమి; ఐన = అయిన; చందంబునన్ = విధముగ; సత్క్రియల్ = మంచి పనుల; చేతన్ = చేత; ఎఱుగన్ = తెలిసికొనుటకు; తగిన = తగినట్టి; జగత్ = లోకములకు; కారణంబు = పుట్టుటకు కారణభూతము; ఐన = అయిన; తత్త్వంబున్ = తత్త్వమును; ఎఱింగించెదన్ = తెలిపెదను; పరమాణు = పరమాణువుల; సముదయంబున్ = సమూహమే; ఈ = ఈ; ధరిత్రి = భూమి; ఐన = అయిన; చందంబునన్ = విధముగా; అవిద్యా = అజ్ఞానము; మనంబువ్ = మనసుల; చేతన్ = చేత; కల్పితంబున్ = సృష్టించినది; అయిన = అయినట్టి; కృశ = సన్నని; స్థూల = లావైన; బృహత్ = మిక్కిలి పెద్దది; అణు = మిక్కిలి చిన్నది; సత్ = సత్యము; అసత్ = అసత్యము; జీవ = ప్రాణులు; అజీవ = నిర్జీవ; ద్రవ్య = పదార్థముల; స్వభావ = స్వభావము; ఆశయ = భావములు; కాల = కాలము; నామ = పేర్లు; బుద్ధిన్ = అభిప్రాయము; రూపంబున్ = రూపము కలది; ఐన = అయిన; మాయ = మాయ; చేన్ = చేత; జగత్తు = విశ్వము; రెండవది = అంతర్యామి కన్నను రెండవది; ఐ = అయ్యి; కల్పింపంబడియెన్ = సృష్టింపబడినది; బాహ్య = వెలుపల; అభ్యంతరంబులన్ = లోపల యందు; కలిగి = ఉండి; స్వ = స్వయముగా; ప్రకాశంబున్ = ప్రకాశము కలది; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుడు యనెడి; శబ్ద = పలుకుచేత; వాచ్యంబును = చెప్పబడునది; విశుద్దంబును = స్వచ్ఛమైనది; పరమార్థంబున్ = అత్యున్నతమైన ప్రయోజనము; జ్ఞాన = జ్ఞానము యొక్క; రూపంబున్ = స్వరూపము; ఐన = అయినట్టి; బ్రహ్మంబున = పరబ్రహ్మము; ఒకటియే = ఒకటే; సత్యంబున్ = సత్యమైనది; జగత్ = ప్రపంచము; అసత్యంబున్ = అసత్యము; అగును = అగును; అని = అని; పలికి = చెప్పి; మఱియును = ఇంకను.

భావము:

ఇంకా ఈ భూమి ఆధారంగా నా పాదాలు ఉన్నాయి. పాదాలకు పైభాగంలో పిక్కలు, ఆపైన మోకాళ్ళు, ఆపైన తొడలు, ఆపైన నడుము, ఆపైన వక్షం, ఆపైన కంఠం, ఆ దాపున మూపు, ఆ మూపుపైన పల్లకి బొంగు ఉన్నది. ఆ బొంగు ఆధారంగా పల్లకి ఉంది. పల్లకిలో నీవున్నావు. నేను రాజుననే అహంకారం నీలో ఉన్నది. కష్టపడే వారిని చూచి వారిపట్ల దయ చూపడం మాని వారిని బెదరించి, పీడించి ప్రజాపాలనం చేస్తున్నావు. “నేను పరిపాలిస్తున్నాను. ఇతరు లందరూ నాచేత పరిపాలింపబడుతున్నారు” అనే అహంకారం నీకుండడం వల్ల మావంటి వారున్న సభలలో నీకు పూజ్యత లేదు. ఈ సమస్త జీవరాసులకు భూమి నివాసస్థానం. అందువల్ల ప్రపంచ సృష్టికి కారణమైన తత్త్వం తెలియజేస్తున్నాను. ఈ భూమి పరమాణువుల సమూహంతో ఏర్పడింది. అవిద్య, మనస్సుల కలయికచేత ఈ జగత్తు పుట్టింది. ఈ అవిద్య కారణంగా జగత్తు రెండవది అయింది. ఇలా ఒకటి రెండుగా కల్పింపబడడం మాయ. ఈ కల్పన అనేక విధాలు. సన్నము, లావు, చిన్నది, పెద్దది, ఉన్నది, లేనిది. ఇలాగే జీవుడు, ద్రవ్యం, అణుభేదాలు, నామభేదాలు, బుద్ధి భేదాలు, లోపల వెలుపల అనే భేదాలు కలిగినదీ, తనంతట తాను ప్రకాశించేదీ, భగవంతుడనే మాటతో పిలువబడేదీ, పరిశుద్ధమైనదీ, జ్ఞానరూపమైనదీ అయిన బ్రహ్మ మొకటే సత్యం. జగత్తు అసత్యం” అని చెప్పి మళ్ళీ (ఇలా అన్నాడు).

5.1-162-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రలోన బ్రహ్మంబుఁ పమున దానంబు-
ను గృహధర్మంబును జలాగ్ని
సోమసూర్యులచేత శ్రుతులచే నైనను-
రమ భాగవతుల పాదసేవఁ
బొందిన మాడ్కిని బొందంగ రాదని-
లుకుదు రార్యులుఁ రమమునులు
నతపోబాహ్య సౌఖ్యములకు విముఖులు-
నై పుణ్యులు హరిగుణానువాద

5.1-162.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మోదితాత్ములు నగు బుధపాసేవ
నుదినంబును జేసిన నంతమీఁద
మోక్షమార్గంబునకును బద్మాక్షునందు
ట్టుపడి యుండు నెప్పుడుఁ రఁగబుద్ధి.

టీకా:

ధర = ధరిత్రి; లోనన్ = అందు; బ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; తపమునన్ = తపస్సుచేతను; దానంబులనున్ = దానములుచేతను; గృహ = గృహస్థ; ధర్మబులను = ధర్మములచేతను; జల = జలము; అగ్ని = అగ్ని; సోమ = చంద్రుడు; సూర్యుల = సూర్యుల; చేతన్ = చేత; శ్రుతుల్ = వేదముల; చేన్ = చేత; ఐననున్ = అయినప్పటికిని; పరమ = అత్యున్నతమైన; భాగవతుల = భాగవతుల యొక్క; పాద = పాదములను; సేవన్ = సేవించుటవలన; పొందిన = పొందినట్టి; మాడ్కినిన్ = విధమున; పొందంగరాదు = పొందలేరు; అని = అని; పలుకుదురు = చెప్పెదరు; ఆర్యులున్ = శ్రేష్ఠులు; పరమ = అత్యుత్తమ; మునులున్ = మునులు; ఘన = గొప్ప; తపః = తపస్సుకన్న; బాహ్య = ఇతరమైన; సౌఖ్యముల్ = సుఖకరముల; కున్ = కు; విముఖులున్ = వ్యతిరిక్తులు; ఐ = అయ్యి; పుణ్యులున్ = పుణ్యులు; హరి = నారాయణుని; గుణ = గుణములను; అనువాద = కీర్తించుటలందు {అనువాద - మరలమరలపలుకుట, కీర్తించుట}.
మోదిత = సంతోషించిన; ఆత్ములున్ = మనసులుగలవారు; అగు = అయిన; బుధ = జ్ఞానుల; పాద = పాదములను; సేవన్ = సేవించుటను; అనుదినంబున్ = ప్రతిదినము; చేసి = చేసి; అంతమీద = ఆ తరువాత; = మోక్ష = మోక్షమును చెందెడి; మార్గంబున్ = మార్గమున; కునున్ = కు; పద్మాక్షున్ = విష్ణుని; అందున్ = అందు; పట్టుపడి = కట్టుబడి; ఉండున్ = ఉండును; ఎప్పుడున్ = నిరతము; పరగన్ = ప్రవర్తిల్లెడి; బుద్ధిన్ = బుద్ధితో; =

భావము:

పరబ్రహ్మ (జ్ఞానం) పరమ భాగవతుల పాదసేవ వల్ల లభించినంత సులభంగా తపస్సు, దానం, గృహస్థాశ్రమ ధర్మం, స్నానం, హోమాలు, సూర్య చంద్రోపాసనం, వేదాధ్యయనం మొదలైన వాటివల్ల లభించదు. భగవద్భక్తుల చరణ సేవయే పరబ్రహ్మ ప్రాప్తికి సులభమార్గం అని ఆర్యులంటారు. బాహ్య సుఖాలకు విముఖులై శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలో సంతోష మనుభవించే భాగవతులను అనుదినం ఆరాధిస్తే మన బుద్ధి మోక్షమార్గం వైపు పయనిస్తుంది. నారాయణుని యందు నెలకొంటుంది.

5.1-163-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరేంద్రా! యేను బూర్వంబున భరతుం డను రాజను; సర్వసంగపరిత్యాగంబు చేసి భగవదారాధనంబు చేయుచు మృగంబుతోడి స్నేహంబు కతన మృగంబనై పుట్టియు నందును హరిభక్తి దప్పకుండిన కతంబున నిప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గంబును బాసి యేకాకి నై చరియించు చున్నవాఁడ; నరుండు వృద్ధసంసేవం జేసి సంసార మోహంబును బాసి హరిధ్యానకథలచే లబ్ధజ్ఞానుండై పుండరీకాక్షునిం బూజించుచుం బరలోకంబునుం బొందు" నని పలికి విప్రుండు మఱియు నిట్లనియె

టీకా:

నరేంద్రా = రాజా; ఏను = నేను; పూర్వంబునన్ = పూర్వపు జన్మలో; భరతుండు = భరతుడు; అను = అనెడి; రాజను = రాజును; సర్వసంగపరిత్యాగంబున్ = సర్వసంగపరిత్యాగంబు {సర్వసంగపరిత్యాగంబు - సర్వ (సమస్తమైన) సంగ (తగులములను) పరిత్యాగము (పూర్తిగా విడిచివేయుట)}; చేసి = చేసి; భగవత్ = భగవంతుని; ఆరాధనంబు = పూజించుట; చేయుచున్ = చేయుచూ; మృగంబున్ = లేడి; తోడి = తోటి; స్నేహంబు = ప్రీతి; కతనన్ = వలన; మృగంబ = లేడిని; ఐ = అయ్యి; పుట్టియున్ = జన్మించియును; అందునున్ = దానిలో కూడ; హరి = నారాయణుని; భక్తిన్ = భక్తని; తప్పక = విడువక; ఉండిన = ఉండినట్టి; కతంబునన్ = కారణముచే; ఇప్పుడు = ఇప్పుడు; మనుష్యుండను = మానవుడను; ఐ = అయ్యి; మనుష్య = మానవులను; సంసర్గంబును = చేరుటలు; పాసి = విడిచిపెట్టి; ఏకాకిని = ఒంటరిని; ఐ = అయ్యి; చరియించుచున్ = తిరుగుతూ; ఉన్నవాడన్ = ఉన్నాను; నరుండు = మనిషి; వృద్ధ = పెద్దల; సేవన్ = సేవించుట; చేసి = వలన; సంసార = సంసార మందలి; మోహంబునున్ = తగులమును; పాసి = విడిచిపెట్టి; హరి = నారాయణుని; ధ్యాన = ధ్యానించెడి; కథల్ = కథలు; చేన్ = చేత; లబ్ధ = లభించిన; జ్ఞానుండు = జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; పుండరీకాక్షునిన్ = నారాయణుని; పూజించుచున్ = సేవించుతూ; పరలోకంబునున్ = పరలోకమును; పొందును = పొందును; అని = అని; పలికి = పలికి; విప్రుండు = బ్రాహ్మణుడు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

“రాజా! నేను పూర్వజన్మలో భరతుడనే రాజును. సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుని ఆరాధిస్తూ ఒక జింకతో స్నేహం కారణంగా జింకనై పుట్టాను. ఆ జన్మలోను విష్ణుభక్తిని తప్పకుండా ఉన్నందున ఇప్పుడు మానవుడిగా జన్మించి జన సంపర్కాన్ని వదలి హరిని ధ్యానించడం, అతని కథలను వినడం ద్వారా లభించిన జ్ఞానంతో విష్ణువును పూజిస్తూ పరమపదాన్ని పొందుతాను” అని చెప్పి ఆ బ్రాహ్మణుడైన భరతుడు ఇంకా ఇలా అన్నాడు.

5.1-164-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రణీశ! మాయచేను దాఁటఁగారాని-
దమునఁ బెట్టంగఁడ్డ జీవుఁ
డెమిమై గుణకర్మములఁ జేయుచును లాభ-
మాశించి తిరుగు బేహారి మాడ్కి
ల మపేక్షించుచుఁ బాయక జీవుండు-
సంసారగహన సంచారి యగుచు
నవరతము నుండు నా మహావనమందుఁ-
గామ లోభాది తస్కరులుగూడి

5.1-164.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రణి విజితేంద్రియుఁడు గాని రునిఁబట్టి
ర్మ మనియెడి యా మహానమునెల్ల
రసి గొనిపోవుచుండుదు నుదినంబుఁ
గాన సంసారమందు నాకాంక్ష వలదు.

టీకా:

ధరణీశ = రాజా; మాయ = మాయ; చేతను = వలన; దాటగరాని = దాటలేని; పదమునన్ = స్థితిలో; పెట్టంగబడ్డ = ఉంచబడిన; జీవుండు = జీవుడు; ఎలమిమై = కుతూహలముకొలది; గుణ = త్రిగుణాత్మకమైన; కర్మములన్ = కర్మములను; చేయుచున్ = చేయుచూ; లాభము = ప్రయోజనమును; ఆశించి = అపేక్షించి; తిరుగు = తిరిగెడి; బేహారి = వ్యాపారి; మాడ్కిన్ = వలె; ఫలమున్ = ప్రయోజనమును; అపేక్షించుచున్ = కోరుతూ; పాయక = విడువక; జీవుండు = జీవుడు; సంసార = సంసారము యనెడి; గహన = అడవియందు; సంచారి = తిరిగెడివాడు; అగుచున్ = అగుచు; అనవరతము = ఎల్లప్పుడు; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మహా = గొప్ప; వనము = అడవి; అందు = అందు; కామ = కామము; లోభ = లోభము; ఆది = మొదలగు; తస్కరులన్ = దొంగలు; కూడి = కలిసికట్టుగా.
ధరణిన్ = భూమిపైన; విజిత = జయించిన; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; కాని = కానట్టి; నరునిన్ = మానవుని; ధర్మము = ధర్మము; అనియెడి = అనెడి; ఆ = ఆ; మహా = గొప్ప; ధనమున్ = సంపదను; ఎల్లన్ = అంతటిని; అరసి = వెదకి; కొనిపోవుచున్ = పట్టుకుపోవుచు; ఉండుదురు = ఉంటారు; అనుదినంబున్ = ప్రతిదినము; కాన = కావున; = సంసారము = సంసారము; అందు = ఎడల; ఆకాంక్ష = లాలస; వలదు = వద్దు.

భావము:

“రాజా! మాయ వల్ల దృఢమైన సంసార బంధాలలో బంధింపబడిన జీవుడు ప్రయోజనాన్ని ఆశించిన వర్తకుని లాగా లాభదృష్టితో కర్మలను ఆచరిస్తూ సంచరిస్తాడు. సంసారమనే అడవిలో కామం, లోభం మొదలైన దొంగలు తిరుగుతూ ఉంటారు. ఆ దొంగలు ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకొంటారు. వాడు దాచుకున్న ధర్మమనే మహాధనాన్ని దోచుకుపోతారు. అందువల్ల సంసారం పట్ల కోరికలు పెంచుకోకూడదు.

5.1-165-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యఁగ సంసారాటవిఁ
లక యా పుత్రమిత్ర దారాదు లనం
రఁగుచు నుండెడు వృకములు
రువడి నరబస్తములను క్షించు వడిన్.

టీకా:

అరయగన్ = తరచిచూసిన; సంసార = సంసారము అనెడి; అటవిన్ = అడవునినుండి; తరలక = తరలిపోక; ఆ = ఆ; పుత్ర = సంతానము; మిత్ర = స్నేహితులు; దార = భార్య; ఆదుల్ = మొదలగువారు; అనన్ = అనగా; పరగుచున్ = ప్రసిద్ధమగుచు; ఉండెడు = ఉండెడి; వృకములున్ = తోడేళ్ళు; పరువడిన్ = వరుసగా; నర = మానవులు యనెడి; బస్తములనున్ = మేకలను; బక్షించున్ = తినివేయును; వడిన్ = వేగముగా.

భావము:

అడవి వంటి సంసారంలో కొడుకులు, స్నేహితులు, భార్యలు మొదలైన వారందరూ తోడేళ్ళు మేకలను భక్షించినట్లు నరునిపీక్కుతింటారు.

5.1-166-త.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సి సంసృతి ఘోరకానన మందిరంబుల నెల్లనుం
జెలఁగి గుల్మలతాతృణాదులచేత గహ్వరమైన ని
శ్చనికుంజములందు దుర్జన సంజ్ఞలంగల మక్షికం
బు నిరోధము దన్ను సోఁకినఁ బొందుచుండు విపద్దశన్.

టీకా:

మలసి = విజృంభించి; సంసృతి = సంసారము అనెడి; ఘోర = భయంకరమైన; కానన = అడవి; మందిరంబులన్ = నివాసములలో; ఎల్లనున్ = అన్నిటను; చెలగి = చెలరేగి; గుల్మ = పొదలు; లతా = తీగలు; తృణ = గడ్డి; ఆదుల్ = మొదలగువాని; చేతన్ = చేత; గహ్వరము = గుహవంటిది; ఐన = అయిన; నిశ్చల = కదలని; నికుంజముల్ = పొదరిండ్ల; అందున్ = లో; దుర్జన = దుర్జనులు అనెడి; సంజ్ఞలన్ = పేర్లతో; కల = ఉండెడి; మక్షికంబుల = తేనెటీగల యొక్క; నిరోధమున్ = అడ్డగింపు; తన్నున్ = తనను; సోకినన్ = తగిలినచో; పొందుచుండున్ = పొందుతుండును; విపత్ = ఆపదల; దశలన్ = స్థితిని.

భావము:

సంసార మనేది భయంకరమైన అడవిలోని మందిరం వంటిది. దాని చుట్టూ తీగలు, పొదలు దట్టంగా అల్లుకొని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపద లుంటాయి. దుర్జనులనే కందిరీగలు జీవులను బాధిస్తూ ఉంటాయి. ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు.

5.1-167-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱియు నీ గృహస్థమార్గంబునం దెల్ల
విషయములను బొంది విశ్వమెల్లఁ
డఁకతోడ నిట్లు గంధర్వలోకంబుఁ
గాఁ లంచి మిగుల మోమందు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఈ = ఈ; గృహస్థమార్గంబున్ = గృహస్థాశ్రమమున; అందున్ = లో; ఎల్లన్ = సమస్తమైన; విషయములనున్ = ఇంద్రియార్థములను; పొంది = పొంది; విశ్వము = జగత్తు; ఎల్లన్ = అంతా; కడక = పట్టుదల; తోడన్ = తోటి; ఇట్లు = ఈ విధముగా; గంధర్వ = గంధర్వ; లోకంబున్ = లోకము; కాన్ = అయినట్లు; తలంచి = భావించి; మిగులన్ = మిక్కిలి; మోదము = సంతోషమును; అందు = పొందును.

భావము:

ఇంకా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడతాడు. అతడు విశ్వాన్నంతా ఒక గంధర్వ నగరంగా భావించి సంతోషపడుతూ ఉంటాడు.

5.1-168-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిగి కాననమునఁ గొవిదయ్యముఁ గాంచి
గ్నిఁగోరి వెంట రుగుమాడ్కిఁ
గాంచనంబు గోరి లవారియిండ్ల పం
లను దిరుగు నరుఁడు లనమంది.

టీకా:

మరిగి = అలవాటున; కాననమునన్ = అడవిలోన; కొఱవిదయ్యమున్ = కొఱవిదయ్యమును; కాంచి = చూసి; అగ్నిన్ = నిప్పు; కోరి = కావలెనని; వెంటన్ = వెనుక; అరుగు = వెళ్ళుట; మాడ్కిన్ = వలె; కాంచనంబున్ = బంగారమును; కోరి = కాంక్షించి; కలవారి = ధనవంతుల; ఇండ్ల = నివాసముల యొక్క; పంచలను = గుమ్మముల ముందు; తిరుగు = తిరిగెడి; నరుడు = మానవుడు; చలనమున్ = చలించుటను; అంది = పొంది.

భావము:

అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి నిప్పుకోసం దాని వెంటబడి తిరిగినట్లు ధనం కోసం భాగ్యవంతుల ఇళ్ళచుట్టూ ఊరకే రాకపోకలు చేస్తూ వ్యథలకు లోనవుతాడు.

5.1-169-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హుకుటుంబి యగుచు హుధనాపేక్షచే
నెండమావులఁగని యేగు మృగము
ణిఁ బ్రేమఁజేసి గురువులు వాఱుచు
నొక్కచోట నిలువకుండు నెపుడు.

టీకా:

బహు = పెద్ద; కుటుంబి = కుటుంబము కలవాడు; అగుచున్ = అగుచూ; బహు = మిక్కిలి; ధన = ధనము నందు; ఆపేక్ష = లాలస; చేన్ = చేత; ఎండమావులన్ = ఎండమావులను; కని = చూసి; ఏగు = వెళ్ళెడి; మృగమున్ = జంతువు; కరణి = వలె; ప్రేమన్ = లాలస; చేసి = వలన; గురువులు = పరుగులు; వాఱుచున్ = పెడుతూ; ఒక్క = ఒక; చోటన్ = స్థలములో; నిలువకుండున్ = నిలబడక ఉండును; ఎపుడు = ఎప్పుడు.

భావము:

పెరుగుతున్న కుటుంబాన్ని పోషించుకొనడం కోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి పరుగెత్తే మృగంలాగా మానవుడు పరుగులు పెడుతూ ఒకచోట నిలువక తిరుగుతూ ఉంటాడు.

5.1-170-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱియు నొక్కచోట త్తుఁ డై పవన ర
జోహతాక్షుఁ డగుచుఁ జూపు దప్పి
దిక్కెఱుంగ కొండుదిశ కేగు పురుషుని
రణిఁ దిరుగు నరుఁడు రవరేణ్య!

టీకా:

మఱియున్ = ఇంకను; ఒక్క = ఒక; చోటన్ = ప్రదేశమున; మత్తుడు = ఏమరుపాటు కలవాడు; ఐ = అయ్యి; పవన = గాలి; రజః = దుమ్ముచే; హత = కొట్టబడిన; అక్షుడు = కన్నులు కలవాడు; అగుచున్ = అగుచు; చూపు = కంటిచూపు; తప్పి = కనబడక; = దిక్కు = దారి; ఎఱుంగక = తెలిసికొనలేక; ఒండు = వేరొక; దిశ = వైపున; కున్ = కు; ఏగు = వెళ్ళెడి; పురుషునిన్ = మానవుని; కరణిన్ = విధముగ; తిరుగు = తిరుగుచుండును; నరుడు = మానవుడు; నరవరేణ్య = రాజా.

భావము:

రాజా! అడవిలో పోతున్నవాడు ఒకచోట ఏమరుపాటు పొంది సుడిగాలి వల్ల రేగిన దుమ్ము కళ్ళనిండా పడగా చూపు తప్పిపోయి దిక్కు తెలియక మరొక దిక్కుకు పోయినట్లు మానవుడు సంసారంలో త్రోవతప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు.

5.1-171-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నొక్కచోట నులూక ఝిల్లీ స్వనంబులతోడ సమానంబు లయిన శత్రురాజి తిరస్కారంబులకు దుఃఖపడుచు, నొక్కచోట క్షుధార్దితుండై యపుణ్య ఫలవృక్షంబుల నాశించు మాడ్కిఁ బాపకర్ములు ద్రవ్యహీనులు నగు వారి నాశ్రయించుచు, నొక్క యెడం బిపాసాతురుండై జలహీనం బయిన నదికిఁ జనిన రీతి నిహపరదూరు లైన పాషండుల సేవించుచు, మఱియు నొక్క ప్రదేశంబునం దగ్నిచేతం దప్తుడయిన వాఁడు దావాగ్నిం జేరి వ్యధ నొందురీతి, నన్నార్థి యగుచు దాయాదులం జేరి దుఃఖించుచు, మఱియు నొక్కచోటఁ బరబాధం జేసి మున్ను గానక రాజ్యాభిలాషం బ్రాణసఖులైన పితృపుత్రభ్రాతృ జ్యేష్ఠుల నైనను వధియించుచు, మఱియు శూరులచేతం గొట్టుబడి సర్వధనంబును బోనాడి చింతాపరవశుండై దుఃఖించుచు నున్నంత గంధర్వనగరప్రాయంబైన సంసార సుఖంబు ననుభవించి మోదించుచు, మఱియు నగారోహణంబు చేయు నరుండు గంటక పాషాణాదులవలనం బాదపీడితుం డగుచు దుఃఖించు చందంబున గృహాశ్రమోచిత మహానుష్ఠానంబునకు నుపక్రమించి వ్యసన కంటక శర్కరాపీడితుండై దుఃఖించుచు, నొక్కచోటన్ జఠరాగ్నిపీడితుండై కుటుంబంబు మీఁద నాగ్రహించుచు, వనంబున నజగరగళితుండై జీర్ణితుండైన చందంబున రాత్రి గృహాటవి యందు నిద్రాపరవశుండై యెఱుంగక వర్తించుచు, మఱియును వనంబునఁ దృణచ్ఛన్న కూపపతితుం డగుచు సర్పదష్టుండైన తెఱంగున సంసారి యై దుర్జనులచేత వ్యధితహృదయుం డగుచు నంధుండై యజ్ఞానాంధ కూపంబునం బడుచు, నొక్క యెడ జుంటితేనియకునై మక్షికాబాధ నత్యంతదుఃఖితుం డయిన మాడ్కిని సంసారకాముండై పరదార ద్రవ్యా భిలాషి యగుచు భూపాలకులచేతనైనను గృహపతిచేతనైనను దాడితుండై నరకంబునం బడుచు యౌవనంబున సంపాదించిన ద్రవ్యంబులు పరులచేతం బోనాడిన విధంబున శీతవాతాద్యనేక ప్రయాస లబ్ధంబైన ధనంబు వోనాడి సంసారి యతిచింతాక్రాంతుం డై యుండు; మఱియును వనంబున లుబ్ధకులు సంసృష్టంబయిన యల్పామిషంబునకు నన్యోన్య వైషమ్యంబునం గలహించిన విధంబున సంసృష్ట వ్యవహారియై యల్పద్రవ్యంబులకుం బోరాడుచుండు" నని భూపాలు నకు విప్రుండు సంసారాటవి తెఱం గెఱింగించి వెండియు నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకా; ఒక్క = ఒక; చోటన్ = చోట; ఉలూక = గుడ్లగూబలు; ఝిల్లీ = ఈలపురుగుల; స్వనంబుల్ = అరుపుల; తోడన్ = తో; సమానంబులు = సమానము; అయిన = అయినట్టి; శత్రు = శత్రువులైన; రాజి = రాజుల యొక్క; తిరస్కారంబులు = అవమానముల; కున్ = కు; దుఃఖ = దుఃఖము; పడుచున్ = పడుతూ; ఒక్క = ఒక; చోటన్ = చోట; క్షుధ = ఆకలితో; అర్థితుండు = కోరువాడు; ఐ = అయ్యి; అపుణ్య = పాప; ఫల = ఫలముల; వృక్షంబున్ = చెట్లను; ఆశించు = అపేక్షించు; మాడ్కిన్ = వలె; పాప = పాపపు; కర్ములనున్ = కర్మలు చేయు వారిని; ద్రవ్య = సంపదలు; హీనులున్ = లేనివారు; అగు = అయినట్టి; వారినిన్ = వారిని; ఆశ్రయించుచున్ = ఆశ్రయించుతూ; ఒక్క = ఒక; ఎడన్ = సమయములో; పిపాసా = దాహముచే; ఆతురుండు = తొందరపడువాడు; ఐ = అయ్యి; జల = నీరు; హీనంబున్ = లేనట్టిది; అయిన = ఐన; నది = నది; కిన్ = కి; చనిన = వెళ్శిన; రీతిన్ = విధముగ; ఇహ = ఈలోకమునకు; పర = పరలోకమునకు; దూరులు = చెడిపోయినవారు; ఐన = అయినట్టి; పాషండులన్ = పాషండులను; సేవించుచున్ = సేవించుతూ; మఱియున్ = ఇంకను; ఒక్క = ఒక; ప్రదేశంబునన్ = చోట; అగ్నిన్ = నిప్పు; చేతన్ = చేత; తప్తుండు = కాలినవాడు; అయిన = అయిన; వాడు = వాడు; దావాగ్నిన్ = కారుచిచ్చును; చేరి = చేరి; వ్యధన్ = బాధను; ఒందు = పొందెడి; రీతిన్ = విధముగా; అన్నార్థి = ఆన్నమును కోరువాడు; అగుచున్ = అగచు; దాయాదులన్ = దాయాదుల {దాయాదులు - పిత్రార్జితమును పంచుకొనెడివారు}; చేరి = దగ్గరకు చేరి; దుఃఖించుచు = దుఃఖించుచు; మఱియున్ = ఇంకను; ఒక్క = ఒక; చోటన్ = చోట; పర = శత్రువుల యొక్క; బాధన్ = బాధ; చేసి = వలన; మున్నున్ = భవిష్యత్తు; కానక = చూడలేక; రాజ్య = రాజ్యముపైని; అభిలాషన్ = కోరికవలన; ప్రాణసఖులు = ప్రాణస్నేహితులు; ఐనన్ = అయినను; పితృ = తండ్రి; పుత్ర = కొడుకు; భ్రాతృ = సోదరులు; జ్యేష్ఠులన్ = పెద్దవారిని; ఐననున్ = అయినను; వధియించుచున్ = సంహరించుతూ; మఱియున్ = ఇంకను; శూరుల = వీరుల; చేతన్ = చేత; కొట్టుబడి = కొట్టబడి; సర్వ = సమస్తమైన; ధనంబును = ధనమును; పోనాడి = పోగొట్టుకొని; చింతా = వ్యధలకు; పరవశుండు = లొంగిపోయినవాడు; ఐ = అయ్యి; దుఃఖించుచున్ = దుఃఖించుచు; ఉన్నంతన్ = ఉండగా; గంధర్వనగర = మేఘాలలో గాలిమేడలకు; ప్రాయంబున్ = సమానమైనవి; ఐన = అయిన; సంసార = సంసారము నందలి; సుఖంబున్ = సుఖములను; అనుభవించి = అనుభవించి; మోదించుచు = సంతోషించుతూ; మఱియునున్ = ఇంకను; నగన్ = కొండను; ఆరోహణంబున్ = ఎక్కుట; చేయు = చేసెడి; నరుండు = మానవుడు; కంటక = ముళ్ళు; పాషాణ = రాళ్ళు; ఆదుల = మొదలగువాని; వలన = వలన; పాద = పాదము లందు; పీడితుండు = పీడింపబడువాడు; అగుచున్ = అగుచు; దుఃఖించు = దుఃఖించెడి; చందంబునన్ = విధముగ; గృహాశ్రమ = గృహస్తాశ్రమమునకు; ఉచిత = తగిన; మహా = గొప్పగొప్ప; అనుష్టానంబున్ = ఆచారములకు; ఉపక్రమించి = పూనుకొని; వ్యసన = బాధలు అనెడి; కంటక = ముళ్ళు; శర్కరా = గులకరాళ్లుచేత; పీడితుండు = బాధింపబడినవాడు; ఐ = అయ్యి; దుఃఖించుచున్ = దుఃఖించుచు; ఒక్క = ఒక; చోటన్ = చోట; జఠరాగ్ని = ఆకలిచే; పీడితుండు = బాధింపబడువాడు; ఐ = అయ్యి; కుటుంబంబున్ = కుటుంబసభ్యుల; మీదన్ = పైన; ఆగ్రహించుచు = కోపించుతూ; వనంబునన్ = అడవిలో; అజగర = కొండచిలువచే; గళితుండు = మింగబడినవాడు; ఐ = అయ్యి; జీర్ణితుండు = అరిగిపోయినవాడు; ఐన = అయిన; చందంబునన్ = విధముగ; రాత్రిన్ = రాత్రులలో; గృహా = ఇల్లు అనెడి; అటవిన్ = అడవి; అందున్ = లో; నిద్రా = నిద్రకు; పరవశుండు = లొంగినవాడు; ఐ = అయ్యి; ఎఱుంగక = తెలియక; వర్తించుచున్ = తిరుగుతూ; మఱియునున్ = ఇంకను; వనంబునన్ = అడవిలో; తృణత్ = గడ్డిచే; ఛన్న = కప్పబడిన; కూప = గోతిలో; పతితుండు = పడినవాడు; అగుచున్ = అగుచు; సర్ప = పాముచే; దష్టుండున్ = కాటు వేయబడినవాడు; ఐన = అయిన; తెఱంగునన్ = విధమున; సంసారి = సంసారము నడపువాడు; ఐ = అయ్యి; దుర్జనుల్ = చెడ్డవారి; చేతన్ = చేత; వ్యధిత = బాధింపబడిన; హృదయుండు = హృదయము కలవాడు; అగుచున్ = అగుచు; అంధుండు = గుడ్డివాడు; ఐ = అయ్యి; అజ్ఞాన = అజ్ఞానము అనెడి; అంధ = చీకటి; కూపంబునన్ = బావిలో; పడుచున్ = పడుతూ; ఒక్క = ఒక; ఎడన్ = చోట; జుంటితేనియ = పట్టుతేనె; కున్ = కోసము; ఐ = అయ్యి; మక్షికా = తేనెటీగలచే; బాధన్ = బాధతో; అత్యంత = అత్యధికమైన; దుఃఖితుండు = దుఃఖించువాడు; అయిన = అయిన; మాడ్కిని = వలె; సంసార = సంసారము నందు; కాముండు = ఆపేక్ష కలవాడు; ఐ = అయ్యి; పర = ఇతరుల; దార = భార్యను; ద్రవ్య = వస్తువులు ఎడ; అభిలాషి = కోరువాడు; అగుచున్ = అగుచు; భూపాలకుల్ = రాజుల {భూపాలకులు - భూమి (రాష్ట్రము)ని పరిపాలించెడివారు, రాజులు}; చేతన్ = చేత; ఐననున్ = అయినను; గృహపతి = ఇంటి యజమాని; చేతన్ = చేత; ఐననున్ = అయినను; తాడితుండు = కొట్టబడినవాడు; ఐ = అయ్యి; నరకంబునన్ = నరకములో; పడుచున్ = పడుతూ; యౌవనంబునన్ = యువకవయస్సులో; సంపాదించిన = సంపాదించినట్టి; ద్రవ్యంబులు = వస్తువులు; పరుల = ఇతరుల; చేతన్ = చేత; పోనాడిన = పోగొట్టుకొన్న; విధంబునన్ = విధముగ; శీతవాతా = చలిగాలి; ఆది = మొదలగు; అనేక = అనేకమైన; ప్రయాసలన్ = శ్రమలచే; లబ్ధంబున్ = లభించినది; ఐన = అయిన; ధనంబున్ = ధనమును; పోనాడి = పోగొట్టుకొని; సంసారి = సంసారి; అతి = మిక్కిలి; చింతా = ఆవేదనలచే; ఆక్రాంతుండు = ఆక్రమింపబడినవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; మఱియునున్ = ఇంకను; వనంబునన్ = అడవిలో; లుబ్ధకులు = బోయవాండ్రు; సంసృష్టంబు = చక్కగా చేసినది; అయిన = అయిన; అల్ప = కొద్ది, అల్పప్రాణుల; అమిషంబున్ = మాంసమున; కున్ = కోసము; అన్యోన్య = వారిలోవారే; వైషమ్యంబునన్ = విరోధములతో; కలహించిన = దెబ్బలాడుకొనిన; విధంబునన్ = విధముగనే; సంసృష్ట = కల్పించుకొన్నట్టి; వ్యవహారి = వివాదములు చేయువాడు; ఐ = అయ్యి; అల్ప = కొద్దిపాటి; ద్రవంబుల్ = ధనముల; కున్ = కు; పోరాడుచుండును = తగవులాడుతూండును; అని = అని; భూపాలున్ = రాజున; కున్ = కు; విప్రుండు = బ్రాహ్మణుడు; సంసార = సంసార మనెడి; అటవిన్ = అడవిని; తెఱంగున్ = విధమును; ఎఱింగించి = తెలియజేసి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా ఒకచోట గుడ్లగూబల కూతలకు, కీచురాళ్ళ రొదలకు సమానమైన విరోధుల తిరస్కారాలకు దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకొకచోట ఆకలితో బాధపడుతూ పిచ్చిచెట్ల పళ్ళను తినడానికి సిద్ధపడినట్లు పాపాత్ములైన దరిద్రులను ఆశ్రయిస్తూ ఉంటాడు. మరోచోట దాహంతో బాధపడుతూ వట్టిపోయిన నది దగ్గరికి పోయినట్లు ఇహపరాలకు విముఖులైన పాషండులను సేవిస్తూ ఉంటాడు. వేరొకచోట మంటలు చుట్టుకొన్నవాడు దావాగ్నిలో చిక్కుకొని బాధపడినట్లు దాయాదులను చేరి కష్టాల పాలౌతాడు. ఇంకొకసారి శత్రుబాధల వలన భవిష్యత్తును కోల్పోయి రాజ్యంమీది కోరికతో తండ్రి, కొడుకులు, సోదరులు, పెద్దవారినైనా చంపుతూ చివరకు బలవంతుల చేత దెబ్బతిని సమస్త సంపదలను పోగొట్టుకొని బాధపడతాడు. గాలిమేడలవంటి సంసార సుఖాలను అనుభవిస్తూ సంతోషంగా ఉన్నా ననుకుంటాడు. కొండ లెక్కేవాడు ముళ్ళు, రాళ్ళు గుచ్చుకొని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్లుగా గృహస్థాశ్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాలలో నానావిధాలైన బాధలతో వ్యసనాలతో పీడింపబడతాడు. ఒక్కొక్కసారి ఆకలి మంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరిమీద అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. అడవిలో కొండచిలువ వాతబడి మెలికలు తిరిగి స్పృహ కోల్పోయినట్లుగా ఇల్లనే అడవిలో రాత్రివేళ నిద్రలో మైమరచి పొరలుతూ ఉంటాడు. అడవిలో గడ్డిచేత కప్పబడిన బావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్లు సంసారంలో దుర్జనులు పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కనులు గానక అజ్ఞానమనే చీకటిగోతిలో పడతాడు. ఒక్కొక్కసారి తేనెకోసం తేనెతెట్టెను రేపి తేనెటీగల బారిన పడినట్లు సంసార సుఖాన్ని కోరి ఇతరుల భార్యలను, వస్తువులను కోరుకొని ఇంటి యజమానులచేతనో, రాజులచేతనో దెబ్బలు తింటాడు. యౌవనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయినవాడు చలికీ గాలికీ వానకూ ఓర్చుకొని సంపాదించిన సొమ్మును ఇతరులు హరింపగా దిగులుతో క్రుంగిపోతాడు. అంతే కాకుండా అడవిలో లభించిన అల్పజంతువుల మాంసంకోసం బోయలు కొట్లాడుకున్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ కొద్దిపాటి ధనంకోసం తన్నులాడుకొంటారు” అని ఈ విధంగా భరతుడు రాజుకు సంసారం అడవి వంటిదని తెలియజేసి ఇంకా ఇలా అన్నాడు.

5.1-172-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ల్పధనుఁడు విశ్రమాస్థానములఁ దృప్తిఁ
బొంద కొరుల ధనముఁ బొందఁ గోరి
రిగి వారివలన వమానములఁ బొంది
ధికమైన దుఃఖ నుభవించు.

టీకా:

అల్పధనుడు = బీదవాడు; విశ్రమ = విశ్రాంతి గల; ఆస్థానములన్ = చోటు లందు; తృప్తిన్ = తృప్తిని; పొందక = పొందకుండగ; ఒరుల = ఇతరుల; ధనమున్ = ధనమును; పొందన్ = పొందవలెనని; కోరి = కోరుచూ; అరిగి = వెళ్ళి; వారి = వారి; వలనన్ = వలన; అవమానములన్ = అవమానములను; పొంది = పొంది; అధికమైన = ఎక్కువ; దుఃఖమున్ = దుఃఖమును; అనుభవించున్ = అనుభవించును.

భావము:

కొద్దిపాటి ధనం కలవాడు తనకున్న ఇల్లువాకిళ్ళతో తృప్తి పడక ఇతరుల ధనం కోరుకొని అందువల్ల అవమానాలను పొంది దుఃఖపడతాడు.

5.1-173-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంతఁ గొందఱల్ల న్యోన్యవిత్తాది
వినిమయమునఁ గడుఁ బ్రవృద్ధమైన
వైములనుబొంది పోరాట మొందుదు
రాత్మచింత లేక నుదినంబు.

టీకా:

అంతన్ = అంతట; కొందఱు = కొంతమంది; అల్లన = మెల్లగా; అన్యోన్య = వారిలోవారు; విత్త = ధనము; ఆది = మొదలగునవానిని; వినిమయమునన్ = వాడుకొనుటలలో; కడున్ = మిక్కిలి; ప్రవృద్దమైన = పెచ్చుపెరిగిన; వైరములను = విరోధములను; పొంది = చెంది; పోరాటమున్ = తగవులను; ఒందుదురు = పెట్టుకొనెదరు; ఆత్మ = ఆత్మగురించిన; చింత = ఆలోచన; లేక = లేకుండగా; అనుదినంబున్ = ప్రతిరోజు.

భావము:

ఇంకా కొందరు వస్తువులను, డబ్బును పరస్పరం మార్చుకొనడలో పెరిగిన వైరంవల్ల ఆత్మచింత లేక అనుదినం అలమటిస్తారు.

5.1-174-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సంసారమార్గ సంచారుఁడై యధిక ప్ర-
యాసంబునను గూర్చు ర్థములను
విహరించుచును గొంద ఱిహలోక ఫలములఁ-
గోరుచు మోక్షంబు గోర కంతఁ
జెడిపోవుచుందు; రెపుడు గాని యందుకుఁ-
డపటి యోగంబుఁ గానలేరు;
మానవంతులు నసమానశౌర్యులు నగు-
వారు మిక్కిలియైన వైరబుద్ధి

5.1-174.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాహవంబున మడియుదు; రంతె కాని
మోక్షమార్గంబు గానరు మూఢవృత్తి
నుచు సంసార గహన విహార మెల్లఁ
దెలిపి క్రమ్మఱ ననియె ధాత్రీసురుండు.

టీకా:

సంసార = సంసారపు; మార్గ = దారిలో; సంచారుడు = తిరుగువాడు; ఐ = అయ్యి; అధిక = మిక్కిలి; ప్రయాసంబుననున్ = శ్రమలతో; కూర్చు = సమకుర్చుకొన్న; అర్థములను = ప్రయోజనములందు; = విహరించుచునున్ = తిరుగుతూ; కొందఱు = కొంతమంది; ఇహలోక = భూలోకపు; ఫలములన్ = ఫలితములను; కోరుచున్ = అపేక్షించుతూ; మోక్షంబున్ = మోక్షమును; కోరక = కోరుకొనకుండగ; అంతన్ = చివరకు; చెడిపోవుచుందురు = చెడిపోతుంటారు; ఎపుడుకాని = ఎప్పుడైనాసరే; అందుకున్ = అందువలన; కడపటి = అవసానకాలపు; యోగంబున్ = విలీనమును, లయమును; కానలేరు = చూసుకోలేరు; = మానవంతులున్ = అహంకారము కలవారు; అసమాన = సాటిలేని; శౌర్యులు = శూరత్వము కలవారు; అగువారు = ఐనవారు; మిక్కిలి = అధికమైనది; ఐన = అయినట్టి; వైర = విరోధ; బుద్ధిన్ = భావముతో; ఆహవంబునన్ = యుద్ధములో.
మడియుదురు = మరణించెదరు; అంతెకాని = అంతేకాని; మోక్ష = మోక్షమును చెందెడి; మార్గంబున్ = దారులను; కానరు = చూడలేరు; మూఢ = తెలివితక్కువ; వృత్తిన్ = వర్తనలతో; అనుచున్ = అనుచూ; సంసార = సంసారము యనెడి; గహన = అడవియొక్క; విహారమున్ = వర్తనము; ఎల్లన్ = సమస్తము; తెలిపి = తెలియజేసి; క్రమ్మఱన్ = మరల; అనియె = పలికెను; ధాత్రీసురుండు = విప్రుడు {ధాత్రీసురుడు - ధాత్రీ (భూమికి) సురుడు (దేవత), బ్రాహ్మణుడు}.

భావము:

మరికొందరు సంసారంలో సంచరిస్తూ ఆ సంసార పోషణకోసం మిక్కిలి ప్రయాసపడుతూ అందుకుగాను సంపదలను సమకూర్చుకొంటూ ఇహలోక సుఖాలనే కోరుకుంటూ శాశ్వతమైన మోక్షాన్ని కోరుకోకుండా చెడిపోతూ ఉంటారు. ఎప్పుడు అవసాన కాలపు యోగాన్ని చూడలేరు. మానధనులు, శౌర్యవంతులు పరస్పరం వైరం పెంచికొని యుద్ధంలో ఒకరినొకరు చంపుకొంటారు. అంతేకాని ఆ మూఢులు మోక్షమార్గాన్ని చూడరు” అంటూ సంసారమనే అరణ్యంలో విహరించేవారి వృత్తాంతాన్ని తెలియజేసి భరతుడు ఇంకా ఇలా అన్నాడు.

5.1-175-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మఱియుం గాలచక్రనియంత్రితుండై చక్రాయుధునిం గొల్వక కాక గృధ్ర బకసమానులైన పాషాండులతోడి సఖ్యంబునం జేసి వారలచేత వంచితుండై బ్రాహ్మణకులంబునంజేసి శ్రౌత స్మార్తకర్మానుష్ఠానపరుం డై విషయసుఖంబు లందుఁ దగులుబడి కాలంబు తుద నెఱుంగక వృక్షంబులుం బోలె నైహికార్థంబులయందుఁ దృష్ణ గలిగి మైథున నిమిత్తంబు సుతదారాదులయందు స్నేహంబు చేయుచుఁ బథికుండు మాతంగంబుల యందు భయంబున దీర్ఘనిమ్నకూపంబునం బడిన తెఱంగున సంసారమృత్యు గజ భయంబున గిరికంధరప్రాయం బయిన యజ్ఞాన తమంబునం బడుం గావున మాయచేత సంసారమార్గం బైన రాజ భావంబు విడిచి సర్వభూతమైత్రి గలిగి జితేంద్రియుండవై జ్ఞానాసిచే మార్గంబు కడపల గను" మని పలికిన భూపాలుం డిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; కాల = కాల మనెడి; చక్ర = వలయమున; నియంత్రితుండు = నియమింపబడెడివాడు; ఐ = అయ్యి; చక్రాయుధునిన్ = విష్ణుని {చక్రాయుధుడు - చక్రము ఆయుధముగా కలవాడు, విష్ణువు}; కొల్వక = సేవించకుండగ; కాక = కాకులు; గృధ్ర = గద్దలు; బక = కొంగలకు; సమానులు = సమానమైనవారు; ఐన = అయినట్టి; పాషాండులు = పాషాండులు {పాషాండులు - వేదోక్త ధర్మములకు దూరమైనవారు}; తోడి = తోటి; సఖ్యంబునన్ = స్నేహములు; చేసి = వలన; వారల = వారి; చేతన్ = చేత; వంచితుండు = మోసగింపబడినవాడు; ఐ = అయ్యి; బ్రాహ్మణ = విప్ర; కులంబునన్ = కులము; చేసి = వలన; శ్రౌత = వేదము లందు విధింపబడినట్టి; స్మార్త = స్మృతు లందు విధింపబడినట్టి; కర్మ = కర్మములను; అనుష్ఠాన = ఆచరించుట యందు; పరుండు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; విషయ = ఇంద్రియార్థ; సుఖంబుల్ = సుఖముల; అందున్ = లో; తగులుబడి = తగుల్కొని; కాలంబున్ = కాలము యొక్క; తుదన్ = ప్రభావమును; ఎఱుంగక = తెలియలేక; వృక్షంబులున్ = చెట్ల; పోలెన్ = వలె; ఐహిక = భౌతిక; అర్థంబులు = ప్రయోజనముల; అందున్ = లో; తృష్ణ = మిక్కిలి లాలస; కలిగి = కలిగి; మైథున = ఇంద్రిసుఖముల; నిమిత్తంబున్ = కోసము; సుత = బిడ్డలు; దార = భార్య; ఆదుల = మొదలగువారి; అందున్ = ఎడల; స్నేహంబున్ = ప్రీతి; చేయుచున్ = చేయుచూ; పథికుండు = బాటసారి; మాతంగంబుల = మదపుటేనుగుల; అందున్ = ఎడలి; భయంబునన్ = భయముచేత; దీర్ఘ = పెద్దదైన; నిమ్న = లోతైన; కూపంబునన్ = బావిలో; పడిన = పడిపోయిన; తెఱంగునన్ = విధముగ; సంసార = సంసారపు; మృత్యు = మరణము యనెడి; గజ = ఏనుగు వలని; భయంబునన్ = భయముచేత; గిరి = కొండ; కంధర = గుహకు; ప్రాయంబున్ = సమానమైనది; అయిన = అయినట్టి; అజ్ఞానతమంబునన్ = అజ్ఞానము అనెడి చీకటిలో; పడున్ = పడిపోవును; కావునన్ = కనుక; మాయ = మాయ; చేతన్ = చేత; సంసార = సాంసారికపు; మార్గంబున్ = పద్దతిలోనిది; ఐన = అగు; రాజ = రాజు యనెడి; భావంబున్ = భావమును; విడిచి = వదలివేసి; సర్వ = నిఖిలమైన; భూత = ప్రాణుల ఎడ; మైత్రి = స్నేహము; కలిగి = కలిగి; జిత = జయించిన; ఇంద్రియుండవు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; జ్ఞాన = జ్ఞానము యనెడి; అసి = కత్తి; చేన్ = చేత; మార్గంబున్ = జీవితమార్గమును; కడపలన్ = దాటుటను; కనుము = చూడుము; అని = అని; పలికినన్ = పలుకగా; భూపాలుండు = రాజు {భూపాలుడు - భూమిని పాలించెడివాడు, రాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా కాలచక్రాన్నే నియమించిన ఆ విష్ణువును కొలువక కాకులు, గ్రద్దలు, కొంగల వంటి వారైన పాషండులతో స్నేహం పెంచుకొని వారిచేత మోసగింపబడతారు. కొందరు బ్రాహ్మణకులంలో పుట్టి శ్రౌతం, స్మార్తం మొదలైన వైదిక కర్మలను నియమ నిష్ఠలతో చేస్తున్నా విషయసుఖాలకు లోబడి కాలప్రభావాన్ని తెలుసుకొనక ఉంటారు. చెట్టులాగా ఐహిక ప్రయోజనాలపై ఆసక్తి కలిగి, ఇంద్రియ సుఖాలకోసం భార్యాపుత్రులు మొదలైన వారియందు ఇష్టాన్ని పెంచుకొంటారు. మదపు టేనుగులకు భయపడిన బాటసారి లోతైన బావిలో పడిపోయిన విధంగా సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండగుహ వంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు. అందుచేత మాయను తొలగించుకొని, సంసార కారణమయిన నీ రాజభావాన్ని విడిచిపెట్టు. అన్ని ప్రాణుల పట్ల మైత్రి పెంచుకొని ఇంద్రియాలను జయించు. జ్ఞానమనే కత్తి చేపట్టి మార్గం చేసుకొని భయంకరమైన ఆ అడవినుండి బయటపడు” అని భరతుడు చెప్పగా రాజు ఇలా అన్నాడు.

5.1-176-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"అక్కట! మానుష జన్మము
పెక్కువయై యుండు నెపు డభేదమతిం బెం
పెక్కిన యోగిసమాగమ
క్కజముగఁ గలిగెనేని ఖిలాత్ములకున్.

టీకా:

అక్కట = అయ్యో; మానుష = మానవ; జన్మము = జన్మ; పెక్కువ = శ్రేష్ఠము; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ఎపుడున్ = ఎప్పుడైతే; అభేద = ద్వంద్వాతీత; మతిన్ = జ్ఞానముతో; పెంపెక్కిన = అతిశయించిన; యోగి = యోగి యొక్క; సమాగమము = సాంగత్యము; అక్కజముగన్ = ఆశ్చర్యకరముగ; కలిగెన్ = కలిగిన; ఏనిన్ = అప్పుడు మాత్రమే; అఖిల = సామాన్య; ఆత్ముల్ = పురుషుల {ఆత్ములు - ఆత్మ కలవారు, జీవులు}; కున్ = కు; =

భావము:

“ఔరా! అన్ని జన్మలలో మానవ జన్మ శేష్ఠ మంటారు. మీ వంటి సర్వసములైన యోగుల సాంగత్యం కలిగినప్పుడే కదా మానవ జన్మ శ్రేష్ఠమౌతుంది.

5.1-177-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ణీసురవర! నీ శ్రీ
ణాంబుజ యుగళ రేణు సంస్పర్శము నా
దురితంబు లడఁచె; నింతట
రిభక్తియు నంతకంత ధికం బయ్యెన్.

టీకా:

ధరణీసుర = విప్రులలో; వర = ఉత్తముడా; నీ = నీ యొక్క; శ్రీ = శుభకరమైన; చరణ = పాదములు యనెడి; అంబుజ = పద్మముల; యుగళ = జంట యొక్క; రేణు = దూళిరాణువు యొక్క; సంస్పర్శము = చక్కగా తగులుట; నా = నా యొక్క; దురితంబులు = పాపములు; అడచెన్ = అణచివేసెను; ఇంతట = ఇంతలో; హరి = నారాయణుని; భక్తియున్ = భక్తికూడ; అంతకంతకున్ = అంతకంతకు; అధికంబు = ఎక్కువ; అయ్యెన్ = అయినది.

భావము:

ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! నీ శ్రీపాదపద్మపరాగాల సంస్పర్శనం నా పాపాల నన్నింటినీ పటాపంచలు చేసింది. అంతకంతకు నాలో హరిభక్తి అతిశయించింది.

5.1-178-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు విప్రవరులయందు యోగీశ్వరు లవధూత వేషంబునం జరియించు చుందురు; గావున విప్రులు పిన్న పెద్ద లనక యందఱకు నమస్కారం" బని స్తుతియించిన నా యోగీశ్వరుండును సింధుపతికిఁ గరుణాన్వితుం డగుచుఁ దత్త్వజ్ఞానం బుపదేశించి యారాజుచేత వందిత చరణుండై పూర్ణార్ణవంబునుం బోలె సంపూర్ణకరుణారసపూరిత స్వాంతుండై వసుంధరం జరియించుచుండె; సింధుభూపతియును సుజన సమాగమంబున లబ్ధతత్త్వజ్ఞానుండయి దేహాత్మభ్రమం బాసె;" నని పలికిన శుకయోగీంద్రునకుం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; విప్ర = బ్రాహ్మణులలో; వరుల = శ్రేష్ఠుల; అందున్ = అందు; యోగి = యోగులలో; ఈశ్వరుల్ = ఈశ్వరునివంటివారు; అవధూత = అవధూతల; వేషంబునన్ = వేషములో; చరియించుచుందురు = తిరుగుతుందురు; కావునన్ = అందుచేత; విప్రులు = బ్రాహ్మణులు; పిన్న = చిన్నవారు; పెద్దలు = పెద్దవారు; అనక = అనకుండా; అందఱ = అందరి; కున్ = కి; నమస్కారంబు = నమస్కారము; అని = అని; స్తుతియించినన్ = కీర్తించినచో; ఆ = ఆ; యోగి = యోగులలో; ఈశ్వరుండును = శ్రేష్ఠుడును; సింధు = సింధుదేశపు; పతి = రాజున; కిన్ = కు; కరుణా = దయతో; ఆన్వితుండు = కూడినవాడు; అగుచున్ = అగుచు; తత్త్వజ్ఞానంబు = తత్త్వజ్ఞానమును; ఉపదేశించి = నేర్పి; ఆ = ఆ; రాజు = రాజు; చేతన్ = చేత; వందిత = వందనములు చేయబడిన; చరణుండు = పాదములు కలవాడు; ఐ = అయ్యి; పూర్ణ = నిండు; ఆర్ణవంబునున్ = సముద్రమును; పోలెన్ = వలె; సంపూర్ణ = సంపూర్ణముగ; కరుణా = దయా; రస = రసముతో; పూరిత = నిండిన; స్వాంతుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; వసుంధరన్ = భూమిపైన; చరియించుచుండెన్ = తిరుగుచుండెను; సింధు = సింధుదేశపు; భూపతియునున్ = రాజుకూడ; సుజన = మంచివారిని; సమాగమంబునన్ = కలియుటవలన; లబ్ధ = లభించిన; తత్త్వజ్ఞానుండు = తత్త్వజ్ఞానము కలవాడు; అయి = అయ్యి; దేహ = శరీరమే; ఆత్మన్ = తాననెడి; భ్రమన్ = భ్రమను; పాసెన్ = విడిచిపెట్టెను; అని = అని; పలికినన్ = పలికినట్టి; శుక = శుకుడు యనెడు; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కున్ = కి; పరీక్షత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుడు = రాజు {నరేంద్రుడు - నరులలో ఇంద్రుని వంటివాడు, రాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా బ్రాహ్మణులలో యోగేశ్వరులు అవధూత వేషాలతో తిరుగుతుంటారు. కనుక చిన్న పెద్ద భేదం లేకుండా బ్రాహ్మణులందరికీ నా నమస్కారం” అని రాజు భరతుణ్ణి స్తుతించగా ఆ యోగీశ్వరుడు సింధుపతియైన రహూగణునికి దయతో తత్త్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. రాజు అతని పాదాలకు నమస్కరించాడు. ఆ తరువాత భరతుడు నిండు సముద్రంలాగా దయారస పరిపూర్ణమైన హృదయంతో భూమిమీద సంచరింపసాగాడు. సింధురాజు కూడా సజ్జన సాంగత్యం చేత తత్త్వజ్ఞానాన్ని పొంది దేహమే ఆత్మ అనే భ్రమను పోగొట్టుకున్నాడు” అని పలికిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

5.1-179-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"యఁగ మక్షికంబు వినతాత్మజుఁ గూడఁగలేని రీతి యీ
తుని సచ్చరిత్రములు ప్రస్తుతి చేయఁగ నీ వసుంధరన్
పతు లెల్ల నోపరు మనంబున నైనను నెంచ; నింక నా
తుని పుణ్యవర్తనముఁ బ్రస్తుతిచేయఁగ నాకు శక్యమే?

టీకా:

అరయగన్ = తరచి చూసిన; మక్షికంబు = ఈగ; వినతాత్మజున్ = గరుత్మంతుని; కూడగలేని = (ఎగురుటలో) సాటిరాలేని; రీతిన్ = విధముగ; ఈ = ఈ; భరతుని = భరతుని; సత్ = సత్యమైన; చరిత్రములున్ = వర్తనములు; ప్రస్తుతి = స్తోత్రములు; చేయగన్ = చేయుటకు; ఈ = ఈ; వసుంధరన్ = భూమిపైనగల; నరపతులు = రాజులు {నరపతి - నరులకు ప్రభు, రాజు}; ఎల్లన్ = అందరును; ఓపరు = సరిపోరు; మనంబునన్ = మనసులో; ఐననున్ = అయినప్పటికిని; ఎంచన్ = గణించుటకు; ఇంకన్ = ఇంక; భరతుని = భరతుని యొక్క; పుణ్య = పుణ్యవంతమైన; వర్తనమున్ = నడవడికలను; ప్రస్తుతి = స్తోత్రము; చేయగన్ = చేయుటకు; నా = నా; కున్ = కు; శక్యమే = సాధ్యమా ఏమి(కాదు).

భావము:

“మహానుభావ! ఈగ ఎంత ఎగిరినా గరుత్మంతునికి సాటిరాలేదు కదా. అలాగే రాజులందరూ కలసినా భరతుని సచ్చరితము ప్రస్తుతించడం సాధ్యం కాదు. కనీసం మనసులో అయినా వారు ఊహించలేరు. కనుక. భరతుని పవిత్ర చరితము కొనియాడుట నాకు శక్యం కానిపని”

5.1-180-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరేంద్రా! భరతుండు సుతదారరాజ్యాదులను బూర్వకాలంబునంద విడిచి భగవత్పరుం డగుచు యజ్ఞరూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును బ్రకృతిపురుష స్వరూపంబును నైన నారాయణునకు నమస్కారం బనుచు మృగరూపంబును బాసె; నట్టి భరతుని చరిత్రం బెవ్వరు చెప్పిన నెవ్వరు వినిన నట్టివారలఁ బుండరీకాక్షుండు రక్షించు; నాయు రభివృద్ధి యగు; ధనధాన్య సమృద్ధియు నగుచుండ స్వర్గోపభోగంబులం బొందుదు; రని.

టీకా:

నరేంద్రా = రాజా; భరతుండు = భరతుడు; సుత = బిడ్డలు; దార = భార్య; రాజ్య = రాజ్యము; ఆదులనున్ = మొదలగునవానిని; పూర్వ = ఇంతకుముంద; కాలంబునన్ = కాలములోనే; విడిచి = వదలివేసి; భగవత్ = భగవంతుని ఎడ; పరుండు = లగ్నమైనవాడు; అగుచున్ = అగుచు; యజ్ఞ = యజ్ఞము యొక్క; రూపంబును = రూపమును; ధర్మ = ధర్మము యొక్క; రూపంబునున్ = రూపమును; సాంఖ్యయోగంబును = సాంఖ్యయోగమును; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషుడు; స్వ = తన యొక్క; రూపంబున్ = రూపమే; ఐన = అయినట్టి; నారాయణున్ = నారాయణుని; కున్ = కి; నమస్కారంబున్ = నమస్కారములు; అనుచున్ = అనుచూ; మృగ = లేడి; రూపంబున్ = రూపమును; పాసెన్ = విడిచిపెట్టెను; అట్టి = అటువంటి; భరతుని = భరతుని యొక్క; చరిత్రంబు = చరిత్రను; ఎవ్వరు = ఎవరు; చెప్పినన్ = చెప్పితే; ఎవ్వరు = ఎవరు; వినినన్ = వినినను; వారలన్ = వారిని; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి {పుండరీకాక్షుండు - పుండరీకములు (పద్మములు) వంటి అక్షుండు (కన్నులు కలవాడు), విష్ణువు}; రక్షించున్ = రక్షించును; ఆయుర్ = ఆయుర్దాయము; అభివృద్ధి = పెరిగినది; అగున్ = అగును; ధన = ధనము; ధాన్య = సంపదలు; సమృద్దియున్ = మిక్కిలి వృద్ధిపొందినవి; అగుచుండన్ = అగుతుడగా; స్వర్గ = స్వర్గమునకు; ఉప = పోల్చదగిన; భోగంబులన్ = భోగములను; పొందుదురు = పొందెదరు; అని = అని.

భావము:

“రాజా! భరతుడు భార్య, కుమారులు, రాజ్యం మొదలైనవి ముందే విడిచి, భగవంతుని పట్ల నిష్ఠ పెంచుకొని యజ్ఞమయుడు, ధర్మస్వరూపుడు, ప్రకృతి పురుషాత్మకుడు అయిన నారాయణునికి నమస్కార మంటూ హరిణరూపాన్ని విడిచాడు. అటువంటి భరతుని చరిత్రను ఎవరు చెప్పినా, ఎవరు విన్నా వారిని విష్ణువు రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధి, ధనధాన్య సమృద్ధి సిద్ధిస్తుంది. స్వర్గ సుఖాలను అనుభవిస్తారు”.