పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : విప్రుడు బ్రతికివచ్చుట

  •  
  •  
  •  

5.1-137-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చట విప్రసూనుఁడు భయం బొకయించుకలేక చంపఁగా
చ్చిన వారియందుఁ గరవాలమునందును గాళియందుఁ దా
చ్చుతభావ ముంచి హృదయంబునఁ బద్మదళాక్షు నెంతయున్
చ్చికతోడ నిల్పి యనుమానము నొందక యుండె నెంతయున్.

టీకా:

అచ్చటన్ = అక్కడ; విప్ర = బ్రాహ్మణ; సూనుడు = బాలుడు; భయంబున్ = భయము; ఒకయించుక = కొంచముకూడ; లేక = లేకుండగ; చంపగాన్ = చంపుటకు; వచ్చిన = వచ్చిన; వారిన్ = వారిని; అందున్ = అందు; కరవాలము = కత్తి; అందునున్ = అందు; కాళి = కాళికాదేవి; అందున్ = అందు; తాన్ = అతను; అచ్యుత = విష్ణువుగా; భావమున్ = భావమున; ఉంచి = ధరించి; హృదయంబునన్ = హృదయములో; పద్మాక్షున్ = విష్ణుని; ఎంతయున్ = ఎంతో, మిక్కిలి; మచ్చిక = ఆసక్తి; తోడన్ = తోటి; నిల్పి = నిలుపుకొని; అనుమానము = సంశయము; ఒందక = పడక; ఉండెన్ = ఉండెను; ఎంతయున్ = ఎంతగానో.

భావము:

ఆ బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఏమాత్రం భయపడకుండా తనను చంపడానికి వచ్చినవారిలోను, కత్తిలోను, కాళికాదేవిలోను అచ్యుత భావాన్నే ఉంచి. పద్మాక్షుడైన విష్ణువును మనస్సులో నిల్పుకొని, ఏమాత్రం అనుమానం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు.