పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : విప్రుడు బ్రతికివచ్చుట

  •  
  •  
  •  

5.1-132-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రీతిని భూసురవరు
నాయ నా కాళికాగృమునకు భృత్యుల్
బోనఁ గొని చని సల్పిరి
చారుత రాభ్యంజనాది సంస్కారంబుల్.

టీకా:

ఆ = ఆ; రీతిన్ = విధముగ; భూసుర = బ్రాహ్మణులలో; వరున్ = శ్రేష్ఠుని; ఆరయన్ = చూచి; ఆ = ఆ; కాళికా = కాళిక యొక్క; గృహమున్ = గుడి; కున్ = కి; భృత్యుల్ = సేవకులు; బోరనన్ = సందడిగా; కొని = తీసుకొని; చని = పోయి; సల్పిరి = చేసిరి; చారుతర = అతి మనోహరముగ {చారు - చారుతరము - చారుతమము}; అభ్యంజన = తలస్నానము; ఆది = మొదలగు; సంస్కారముల్ = సిద్దపరచుటలు.

భావము:

ఆ విధంగా సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని కాళికాలయానికి తీసికొని వెళ్ళారు. తలంటి పోయడం మొదలైన బలి సంస్కారాలు చేశారు.