పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : విప్రుడు బ్రతికివచ్చుట

  •  
  •  
  •  

5.1-131-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రసి కానలేక యా రాత్రి వీరాస
మునఁ జేని కాఁపు విల బుద్ధి
నెసఁగు విప్రయోగి నొయ్యనఁ బొడగాంచి
శువు మంచి దనుచుఁ ట్టి రతని.

టీకా:

అరసి = వెదకినను; కానలేక = కనుగొనలేక; ఆ = ఆ; రాత్రి = రాత్రి; వీరాసనమునన్ = వీరాసనము వేసికొని {వీరాసనము – యోగాసనములలో నొకటి, పాదములు రెండును రెండవ తొడపక్కకి వచ్చెడి భంగిమగల ఆసనము}; చేనిన్ = పొలమును; కాపు = కాపలా కాసెడి; విమల = నిర్మలమైన; బుద్ధిన్ = బుద్ధితో; ఎసగు = అతిశయించుతున్న; విప్ర = బ్రాహ్మణ; యోగిన్ = యోగిని; ఒయ్యనన్ = ఒప్పిదముగా; పొడగాంచి = కనుగొని; పశువు = బలిపశువు; మంచిది = బాగున్నది; అనుచున్ = అనుచూ; పట్టిరి = పట్టుకొనిరి; అతనిన్ = అతనిని.

భావము:

(భటులు) ఎంత వెదకినా ఆ వ్యక్తి కనిపించలేదు. చేలో ఒకచోట వీరాసనం వేసికొని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణ యోగి భరతుని చూచి నరబలికి తగినవాడని భావించి పట్టుకున్నారు.