పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : విప్రుడు బ్రతికివచ్చుట

  •  
  •  
  •  

5.1-130-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురిలోన వృషలపతి దా
రుదుగ సంతాన కాముఁడై వేడుకతోఁ
బురుషుఁడగు పశువుఁ గాళికి
ఱుముక గొనిపోవఁ బశువు లఁగిన భృత్యుల్.

టీకా:

పురి = పురము; లోనన్ = లోని; వృషలపతి = శూద్రుల; పతి = పెద్ద; తాన్ = తను; అరుదుగన్ = అపూర్వముగా, ఎప్పుడో కాని జరుగనిది ఐన; సంతాన = సంతానమును; కాముడు = కోరెడివాడు; ఐ = అయ్యి; వేడుక = జాతర ఊరేగింపు; తోన్ = తోటి; పురుషుడు = మగమనిషి; అగు = అయిన; పశువున్ = బలిపశువును; కాళి = కాళికాంబ {కాళి - భయంకర రూపమున ఉన్న శక్తిస్వరూపిణి, కాళికాదేవి}; కున్ = కు; తఱుముకున్ = వెంటబడి; కొనిపోవ = తీసుకొనిపోతుండగా; పశువున్ = బలిపశువు; తలగిన్ = తప్పించుకొనిపోగా; భృత్యుల్ = సేవకులు.

భావము:

భరతుడు ఉంటున్న నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. సంతానం కోసం కాళికాదేవికి నరబలి ఇవ్వడం కోసం ఒక మనుష్యుణ్ణి వెంట బెట్టుకొని పోతుండగా ఆ బలిపశువు తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు సేవకులు…