పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : విప్రసుతుండై జన్మించుట

  •  
  •  
  •  

5.1-121-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుం డాంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబునం బెంచుచుం
రం జౌలముఖాగ్ర్యకర్మముల చేతన్ సంస్కృతుం జేసి పా
ని మోహంబున నిచ్చలుం గడఁక శౌచాచారముల్ చెప్పినన్
నుఁ డా భాగవతుం డసమ్మతిని దత్కర్మంబులం గైకొనెన్.

టీకా:

జనకుండు = తండ్రి యగు; ఆ = ఆ; అంగిరసుండు = అంగిరసుడు; ఆత్మజునిన్ = కుమారుని {ఆత్మజుడు - ఆత్మ (తనకు) జుడు (పుట్టినవాడు), పుత్రుడు}; వాత్సల్యంబునన్ = ఆపేక్షతో; పెంచుచున్ = పెంచుతూ; తనరన్ = అతిశయించి; చౌల = కేశసంస్కారము {చౌలము - చూడాకర్మ, ఉపనయనమునకు ముందు జరిపెడి కేశసంస్కారము}; ముఖ్య = మొదలగు; అగ్ర్య = ముఖ్యమైన; కర్మములన్ = వేదోక్త కర్మలు; చేతన్ = చేత; సంస్కృతున్ = సంస్కరింపబడినవానిని; చేసి = చేసి; పాయని = వదలని; మోహంబునన్ = మోహమును; నిచ్చలున్ = నిత్యము; కడకన్ = పూని; శౌచ = శౌచములు {శౌచాచారములు - శుచికై స్నానము నీరు పుక్కిలించుట వేదపారాయణము దీక్షలుపట్టుట నియమములుపాటించుట అగ్నిహోత్రాదిసేవించుటలు మొదలగునవి}; ఆచారములున్ = ఆచారములను {ఆచారములు - ఆచరించవలెనని నియమింపబడిన కర్మములు విధానములు}; చెప్పినన్ = చెప్పగా; ఘనుడున్ = గొప్పవాడు; ఆ = ఆ; భాగవతుండు = భాగవతుడు; అసమ్మతిన్ = ఇష్టము లేకుండగనే; తత్ = ఆ; కర్మంబులన్ = కర్మలను; కైకొనెన్ = చేపట్టెను.

భావము:

తండ్రి అయిన ఆంగిరసుడు తన కుమారుడు భరతుని ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెంట్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కొడుకు మీది మోహంతో నిత్యం శౌచ సదాచారాలు నేర్పాడు. అవి తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని నేర్చుకున్నాడు.