పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : విప్రసుతుండై జన్మించుట

 •  
 •  
 •  

5.1-119-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిణ దేహముఁ బాసి యంత నాంగిర సాహ్వ;
యుండు శుద్ధుఁడు పవిత్రుండు ఘనుఁడు
మదమఘనతపస్స్వాధ్యాయ నిరతుండు;
గుణగరిష్ఠుఁడు నీతికోవిదుండు
నైన బ్రాహ్మణునకు నాత్మజుండై పుట్టి;
సంగంబు వలనను కితుఁ డగుచుఁ
ర్మ బంధంబుల ఖండింపఁజాలు నీ;
శ్వరుని నచ్యుతు నజు శ్రవణ మనన

5.1-119.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ములను హరిచరణధ్యానములను విఘ్న
యముననుజేసి మనమందుఁ బాయనీక
నిలిపి సంస్తుతి చేయుచు నిలిచి యుండె
రితయశుఁడైన భరతుండు పార్థివేంద్ర!

టీకా:

హరిణ = లేడి; దేహమున్ = శరీరమును; పాసి = విడిచిపెట్టి; అంతన్ = అంతట; అంగిరస = అంగిరసుడు యని; ఆహ్వయుండు = పిలువబడువాడు; శుద్దుండు = పరిశుద్దమైనవాడు; పవిత్రుండు = పవిత్రమైనవాడు; ఘనుడున్ = గొప్పవాడు; శమ = ఓర్పు; దమ = ఇంద్రియనిగ్రహము; ఘన = గొప్ప; తపస్ = తపస్సు; స్వాధ్యాయ = వేదాధ్యయనమునందు; నిరతుండు = నిష్ఠగలవాడు; గుణ = సుగుణములలో; గరిష్ఠుడు = పెద్దవాడు; నీతికోవిదుండు = నీతిశాస్త్రములో పండితుడు; ఐన = అయిన; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుని; కున్ = కి; ఆత్మజుండు = పుత్రుడు; ఐ = అయ్యి; పుట్టి = జన్మించి; సంగంబు = ఇతరులతో సాంగత్యము; వలననున్ = వలన; చకితుడు = భయపడినవాడు; అగుచున్ = అగుచు; కర్మ = చేసిన కర్మల; బంధంబులున్ = బంధములు; ఖండింపన్ = తెగగొట్టుటకు; చాలున్ = సమర్థతగలవి; ఈశ్వరునిన్ = నారాయణుని; అచ్యుతున్ = నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; అజున్ = నారాయణుని {అజుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; శ్రవణ = వినుట; మననములను = ధ్యానించుటలు.
హరి = నారాయణును; చరణ = పాదముల యొక్క; ధ్యానములను = ధ్యానించుటలయందు; విఘ్న = అంతరాయములు కలుగునని; భయముననున్ = భయము; చేసి = వలన; మనమున్ = మనసు; అందున్ = నుండి; పాయనీక = దూరముగానీక; నిలిపి = పూనికతో; సంస్తుతిన్ = చక్కగా స్తుతించుటను; చేయుచున్ = చేయుచూ; నిలిచియుండె = నిలబడెను; భరిత = నిండైన; యశుడు = కీర్తిగలవాడు; ఐన = అయినట్టి; భరతుండు = భరతుడు; పార్థివేంద్ర = రాజా {పార్థివేంద్రుడు - పార్థవ (పృథ్వికి) ఇంద్రునివంటివాడు, రాజు}.

భావము:

మహారాజా! భరతుడు లేడి దేహాన్ని వదలిపెట్టి తరువాతి జన్మలో పరిశుద్ధుడు, మహానుభావుడు, ఓర్పు, ఇంద్రియనిగ్రహం, గొప్ప తపస్సు, వేదాధ్యయనంలో నిష్ఠ మొదలైన సద్గుణాలు కలవాడు, నీతికోవిదుడు అయిన ఆంగిరసుడు అనే బ్రాహ్మణునికి పుత్రుడై జన్మించాడు. పుట్టినది మొదలు సంసార బంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను త్రెంచేవాడు, సర్వేశ్వరుడు, అచ్యుతుడు, జననం లేనివాడు అయిన హరి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ, ఆయన కథలను వింటూ మళ్ళీ ఎటువంటి ఆటంకం రాకుండా ఆయనను సంస్తుతిస్తూ యశోభరితుడై కాలం గడపసాగాడు.

5.1-120-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లాంగిరసుండు ప్రథమభార్య యందుఁ బుత్రనవకంబును, గనిష్ఠభార్య యందు స్త్రీపురుషుల నిద్దఱను గలుగంజేసిన నందుఁ బురుషుండు పరమ భాగవతుండును రాజర్షి ప్రవరుండును నుత్సృష్ట మృగశరీరుండునుం జరమశరీరంబునం బ్రాప్తవిప్రశరీరుండును నగు భరతుండయ్యె; అతం డా జన్మంబున నన్యజన సంగంబు జన్మపరంపరలకుఁ గారణం బని యత్యంత భయంబు నొంది కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణాదుల శ్రీహరి యనుగ్రహంబునం బూర్వజన్మపరంపరల సంస్మరించుచుఁ దన స్వరూపంబు నున్మత్తజడాంధబధిర రూపంబుల లోకులకుం జూపుచుండె; అంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ఆంగిరసుండు = ఆంగిరసుడు; ప్రథమ = మొదటి; భార్య = భార్య; అందున్ = అందు; పుత్ర = కుమారులను; నవకంబున్ = తొమ్మండుగురను (9); కనిష్ఠ = చిన్న; భార్య = భార్య; అందున్ = అందు; స్త్రీ = కుమార్తె; పురుషులన్ = కుమారులను; ఇద్దఱనున్ = ఇద్దరిని; కలుగంజేసినన్ = పుట్టించగా; అందున్ = వారిలో; పురుషుడు = కుమారుడు; పరమ = అత్యుత్తమ; భాగవతుండును = భాగవతుడు; రాజర్షి = రాజఋషులలో; ప్రవరుండును = శ్రేష్ఠుడు; ఉత్సృష్ట = విడిచిన {ఉత్సృష్టము - సృష్ట (పుట్టించుటకు) ఉత్ (వ్యతిరేకమైనది)}; మృగ = లేడి; శరీరుండును = జన్మము గలవాడును; చరమ = చివరి; శరీరంబునన్ = జన్మము నందు; ప్రాప్త = లభించిన; విప్ర = బ్రాహ్మణ; శరీరుండునున్ = జన్మము గలవాడును; అగు = అయిన; భరతుండు = భరతుడు; అయ్యెన్ = అయ్యెను; అతండు = అతడు; ఆ = ఆ యొక్క; జన్మంబునన్ = జన్మలో; అన్యజన = ఇతరులతో; సంగంబున్ = సాంగత్యములను; జన్మపరంపరల్ = పునర్జన్మముల; కున్ = కు; కారణంబున్ = కారణభూతములు; అని = అని; అత్యంత = అత్యధికమైన; భయంబున్ = భయమును; ఒంది = పొంది; కర్మ = కర్మలవలని; బంధ = బంధముల; విధ్వంసన = నాశనము చేసెడి; శ్రవణ = వినుట; స్మరణ = ధ్యానించుట; ఆదుల = మొదలగువానివలన; శ్రీహరి = నారాయణుని; అనుగ్రహంబునన్ = అనుగ్రహమువలన; పూర్వ = ముందటి; జన్మ = జన్మల; పరంపరలన్ = వరుసలను; సంస్మరించుచున్ = జ్ఞాపకము చేసుకొనుచు; తన = తన యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; ఉన్మత్త = పిచ్చివాని; జడ = మూఢుని; అంధ = గుడ్డివాని; బధిర = చెవిటివాని; రూపంబులన్ = రూపములో; లోకుల్ = ప్రజల; కున్ = కు; చూపుచుండె = చూపించుతుండెను; అంత = అంతట;

భావము:

ఆ ఆంగిరసునికి పెద్ద భార్యకు తొమ్మిది మంది కుమారులు, చిన్న భార్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. పరమ భాగవతుడు, గొప్ప రాజర్షి అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని విడిచి ఈ జన్మలో ఆ బ్రాహ్మణుని చిన్న భార్య కుమారుడై జన్మించాడు. ఇతరులతో సాంగత్యం జన్మపరంపరలకు కారణమౌతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు బంధవిముక్తి కోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. అప్పుడు…

5.1-121-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుం డాంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబునం బెంచుచుం
రం జౌలముఖాగ్ర్యకర్మముల చేతన్ సంస్కృతుం జేసి పా
ని మోహంబున నిచ్చలుం గడఁక శౌచాచారముల్ చెప్పినన్
నుఁ డా భాగవతుం డసమ్మతిని దత్కర్మంబులం గైకొనెన్.

టీకా:

జనకుండు = తండ్రి యగు; ఆ = ఆ; అంగిరసుండు = అంగిరసుడు; ఆత్మజునిన్ = కుమారుని {ఆత్మజుడు - ఆత్మ (తనకు) జుడు (పుట్టినవాడు), పుత్రుడు}; వాత్సల్యంబునన్ = ఆపేక్షతో; పెంచుచున్ = పెంచుతూ; తనరన్ = అతిశయించి; చౌల = కేశసంస్కారము {చౌలము - చూడాకర్మ, ఉపనయనమునకు ముందు జరిపెడి కేశసంస్కారము}; ముఖ్య = మొదలగు; అగ్ర్య = ముఖ్యమైన; కర్మములన్ = వేదోక్త కర్మలు; చేతన్ = చేత; సంస్కృతున్ = సంస్కరింపబడినవానిని; చేసి = చేసి; పాయని = వదలని; మోహంబునన్ = మోహమును; నిచ్చలున్ = నిత్యము; కడకన్ = పూని; శౌచ = శౌచములు {శౌచాచారములు - శుచికై స్నానము నీరు పుక్కిలించుట వేదపారాయణము దీక్షలుపట్టుట నియమములుపాటించుట అగ్నిహోత్రాదిసేవించుటలు మొదలగునవి}; ఆచారములున్ = ఆచారములను {ఆచారములు - ఆచరించవలెనని నియమింపబడిన కర్మములు విధానములు}; చెప్పినన్ = చెప్పగా; ఘనుడున్ = గొప్పవాడు; ఆ = ఆ; భాగవతుండు = భాగవతుడు; అసమ్మతిన్ = ఇష్టము లేకుండగనే; తత్ = ఆ; కర్మంబులన్ = కర్మలను; కైకొనెన్ = చేపట్టెను.

భావము:

తండ్రి అయిన ఆంగిరసుడు తన కుమారుడు భరతుని ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెంట్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కొడుకు మీది మోహంతో నిత్యం శౌచ సదాచారాలు నేర్పాడు. అవి తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని నేర్చుకున్నాడు.

5.1-122-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు బ్రాహ్మణకుమారుండు గర్మంబుల యందు నిచ్చలేక యుండియును బితృనియోగ నిర్బంధంబునం బితృసన్నిధి యందు యసమీచీనంబుగా వ్యాహృతిప్రణవ శిరస్సహితం బగునట్లు గాయత్రీమంత్రంబు జపియించుచుఁ జైత్రాది చతుర్మాసంబుల సమవేతంబుగ వేదంబుల నధ్యయనంబు చేయుచుండె; జనకుం డాత్మజుని శిష్టాచారంబుచే శిక్షింపవలయునను లోకాచారంబు ననువర్తించి యాత్మభూతుండగు నాత్మజునందు నభినివేశిత చిత్తుండగుచు శౌచాచమనాధ్యయన వ్రత నియమగుర్వనల శుశ్రూషణాదికంబు లనభియుక్తంబు లయినం బుత్రునిచే నొనరింపించుచు నప్రాప్తమనోరథుం డయ్యె; అంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; కుమారుండు = పుత్రుడు; కర్మముల్ = కర్మల; అందున్ = లో; ఇచ్చ = ఇష్టము; లేక = లేకుండా; ఉండియున్ = ఉన్నప్పటికిని; పితృ = తండ్రిచేత; నియోగ = నియమించుటవలని; నిర్బంధంబునన్ = తప్పనిసరిగా; పితృ = తండ్రి; సన్నధి = సమీపము; అందె = అందునే; అసమీచీనంబుగా = అసత్యముగా; వ్యాహృతి = వ్యాహృతులు {వ్యాహృతులు - 1భూః 2భువః 3సువః అనెడి మంత్రములు}; ప్రణవ = ఓంకారము యనెడి; శిరః = శిరస్సుగా; సహితంబున్ = కలిగి ఉండునవి; అగునట్లు = అగు విధముగా; గాయత్రీమంత్రంబున్ = గాయత్రీమంత్రమును; జపియించుచున్ = జపించుతూ; చైత్ర = చైత్రమాసము; ఆది = మొదలగు; చాతుర్మాసంబులన్ = నాలుగు నెలలను; సమవేతంబుగా = ఇతరులతో కూడి; వేదంబులన్ = వేదములను; అధ్యయనంబున్ = అధ్యయనము; చేయుచుండెన్ = చేస్తుండెను; జనకుండు = తండ్రి; ఆత్మజునిన్ = పుత్రుని; శిష్ట = మంచివారి యొక్క; ఆచారంబున్ = పద్ధతుల; చేన్ = చేత; శిక్షింపవలయును = నేర్పవలెను; అను = అనెడి; లోకాచారంబున్ = సామాన్య ధర్మమును; అనుసరించి = ప్రకారము; ఆత్మభూతుండు = తానే ఐనవాడు; అగు = అయిన; ఆత్మజున్ = పుత్రుని; అందున్ = ఎడల; అభినివేశిత = పట్టుదల కలగిన; చిత్తుండు = మనసు గలవాడు; అగుచున్ = అగుచూ; శౌచ = శుచికైనస్నానము; ఆచమన = ఆచమనము; అధ్యయన = వేదాధ్యయనము; వ్రత = దీక్షలు పట్టుట; నియమ = నియమములు పాటించుట; గురు = గురువులను; అనల = అగ్నిహోత్రము; శుశ్రూషణ = సేవించుట; ఆదికంబులు = మొదలగువానిని; అనభియుక్తంబులు = వాదింపబడనివి; అయినన్ = అయినప్పటికిని; పుత్రుని = కుమారుని; చేన్ = చేత; ఒనరింపించుచున్ = ఆచరింప జేయుచు; అప్రాప్త = ఫలించని; మనోరథుండు = ప్రయత్నము గలవాడు; అయ్యెన్ = అయ్యెను; అంత = అంతట;

భావము:

ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతునికి కర్మలంటే ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కనుక వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి దగ్గర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేసాడు. తండ్రి కుమారునకు శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమనవిధి, అధ్యయనవిధి, వ్రతవిధి మొదలైన నియమాలను, అగ్ని ఆరాధనం, గురు శుశ్రూష వంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటిపట్ల అభినివేశం లేకుండటం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమయిందని, తన కోరిక నెరవేరలేదని నిరాశ పడ్డాడు. అప్పుడు…

5.1-123-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రీతిని గొడుకున కా
చారంబులు గఱపి చింత ద్గృహమున సం
సారి యగుచుండి విప్రుఁడు
బోన దేహంబుఁ బాసి పోయిన మీఁదన్.

టీకా:

ఈ = ఈ; రీతిన్ = విధముగా; కొడుకున్ = కుమారుని; కున్ = కి; ఆచారంబులున్ = ఆచారాములు; కఱపి = నేర్పి; చింతన్ = వగపుతో; సత్ = మంచి; గృహమునన్ = ఇంటిలో; సంసారి = గృహస్తు; అగుచుండి = అయినను; విప్రుడు = బ్రాహ్మణుడు; బోరనన్ = అకస్మాత్తుగా; దేహంబుబాసిపోయిన = చనిపోయిన {దేహంబు బాసిపోవు - శరీరమును విడిచిపోవుట, మరణించుట}; మీదన్ = తరువాత.

భావము:

ఈ విధంగా తన కుమారునికి సదాచారాలు నేర్పే ప్రయత్నం చేసి కొంతకాలం సంసార జీవితం సాగించి ఆ విప్రుడు అకస్మాత్తుగా పరలోకగతు డైనాడు. ఆ తరువాత…

5.1-124-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ల్లి తండ్రితోడ దా నగ్నిఁ జొచ్చిన
తని మహిమ లెఱుఁగ కంతలోన
వితి తల్లి కొడుకు వినీతు లగుచును
శాస్త్రవిద్య లతనిఁ దువనీక.

టీకా:

తల్లి = తల్లి; తండ్రి = తండ్రి; తోడన్ = తోటి; అగ్నిజొచ్చిన = సహగమనము చేయగా {అగ్నిజొచ్చుట - భర్త దేహము తోపాటు అగ్నిలో ప్రవేశించుట, సహగమనము}; అతని = అతని యొక్క; మహిమలు = గొప్పదనములు; ఎఱుగక = తెలియక; అంతలోనన్ = అప్పటినుంచి; సవతితల్లి = సవతితల్లి యొక్క; కొడుకులు = పుత్రులు; అవినీతులు = నీతి లేనివారు; అగుచునున్ = అగుచూ; శాస్త్రవిద్య = శాస్త్రము మొదలగు విద్యలు; అతనిన్ = అతనిని; చదువనీక = చదువనీయకుండ.

భావము:

తల్లి తండ్రితో సహగమనం చేయగా, అవినీతిపరులైన సవతి తల్లి కొడుకులు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేక అతనిని శాస్త్రవిద్యలను చదువనీయలేదు.

5.1-125-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు బ్రహ్మణకుమారుని సవితి తల్లి కొడుకులు వేదవిద్య వలనం బాపి గృహకర్మంబుల నతని నియమించిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; కుమారుని = పుత్రుని; సవతితల్లి = సవతితల్లి యొక్క; కొడుకులు = కుమారులు; వేద = వేదము లందలి; విద్య = విజ్ఞానము; వలనన్ = నుండి; పాపి = దూరము చేసి; గృహకర్మంబులన్ = ఇంటి పనులలో; అతనిన్ = అతనిని; నియమించినన్ = పెట్టగా.

భావము:

ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతుని సవతితల్లి కొడుకులు వేదవిద్యలు చదువనీయకుండా ఇంటిపనులు చేయడానికి నియమించగా…

5.1-126-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ణీసురోత్తముఁడు దా
రుదుగఁ దమవారు చెప్పివి యెల్లను నే
కందుఁ బ్రీతిచేయక
నితము గృహకర్మమట్లు నెఱపుచు నుండెన్.

టీకా:

ధరణీసుర = బ్రాహ్మణులలో; ఉత్తముడు = ఉత్తముడు; తాన్ = తను; అరుదుగన్ = అపూర్వముగా; తమవారు = స్వంత మనుషులు; చెప్పినవి = చెప్పినట్టివి; ఎల్లన్ = సమస్తమును; ఏమఱకన్ = అశ్రద్ద లేక; అందున్ = వాని ఎడ; ప్రీతి = ఆపేక్ష; చేయక = పెట్టుకొనక; = నిరతమున్ = ఎల్లప్పుడు; గృహకర్మమున్ = ఇంటిపనిని; అట్లు = ఆ విధముగ; నెఱపుచున్ = నెరవేర్చుచు; ఉండెన్ = ఉండెను.

భావము:

భరతుడు వారు చెప్పిన పనులన్నీ కాదనకుండా పనులలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా చేస్తున్నాడు. కాని ఆ పనులపట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది.

5.1-127-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు గృహకర్మప్రవర్తనుం డగుచు నుండ మూఢులగు ద్విపాత్పశువులచే నున్మత్త జడ బధిర యని యాహూయమానుం డగు నపుడు తదనురూపంబులగు సంభాషణంబుల నొనర్చుచుఁ బరేచ్ఛాయదృచ్ఛలం జేసి విష్టివేతన యాచ్ఞాదుల వలన నియుక్తకర్మంబులం బ్రవర్తించుచు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; గృహకర్మ = ఇంటిపనులలో; ప్రవర్తనుండు = చేయుచున్నవాడు; అగుచున్ = అగుచు; ఉండన్ = ఉండగా; మూఢులు = తెలివిలేనివారు; అగు = అయిన; ద్విపాత్పశువుల్ = పశుప్రాయులు {ద్విపాత్పశువులు - ద్వి (రెండు) పాత్ (కాళ్ళ) పశువులు (జంతువులు), పశుప్రాయులు}; చేన్ = చేత; ఉన్మత్త = పిచ్చివాడు; జడ = మూఢుడు; బధిర = చెవిటివాడు; అని = అని; ఆహూయమానుండు = పిలువబడినవాడు; అగునప్పుడు = అయినప్పుడు; తత్ = వానికి; అనురూపంబులు = తగినవి; అగు = అయిన; సంభాషణంబులన్ = మాటలను; ఒనర్చుచున్ = ఆడుతూ; పర = ఇతరుల; ఇచ్చా = కోరికల ననుసరించి; అదృచ్చలన్ = అప్రయత్న సిద్దముగ చేయువాని; చేసి = వలన; విష్టి = వెట్టిపని; వేతన = కూలిపని; యాచ్ఞ = యాచించుట; ఆదుల = మొదలగువాని; వలనన్ = వలన; నియుక్త = నియమింపబడిన; కర్మంబులన్ = పనులలో; ప్రవర్తించుచు = చేయుచు.

భావము:

ఈ విధంగా భరతుడు ఇంటిపనులు చేస్తూ ఉండగా మూఢులు, పశుప్రాయులు అయిన జనుల చేత పిచ్చివాడు, మొద్దు, చెవిటివాడు అని పిలువబడుతూ, అందుకు తగినట్టుగానే వారితో మాట్లాడుతూ వారి ఆజ్ఞల మేరకు నడుకునేవాడు. వెట్టిపని, కూలిపని, భిక్షాటన మొదలైనవి చేస్తూ కాలం గడుపుతూ…

5.1-128-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తుల దివ్యాన్నమైన మృష్టాన్నమైన
నెద్ది వెట్టిన జిహ్వకు హితముగానె
లఁచి భక్షించుఁగా; కొండుఁ లఁచి మిగులఁ
బ్రీతి చేయఁడు రుచులందుఁ బెంపుతోడ.

టీకా:

అతుల = సాటిలేని; దివ్య = దివ్యమైన; అన్నమున్ = ఆహారము; ఐనన్ = అయినను; మృష్ట = రుచికరమైన; అన్నమున్ = ఆహారము; ఐనన్ = అయినను; ఎద్ది = ఏది; పెట్టినన్ = పెట్టినప్పటికిని; జిహ్వ = నాలుక; కున్ = కు; హితమున్ = ఇష్టము; కానె = అగునట్లు; తలచి = భావించి; భక్షించున్ = తినును; కాక = కాని; ఒండు = మరియొకవిధముగ; తలచి = భావించి; మిగులన్ = మిక్కిలి; ప్రీతిచేయడు = ఇష్టపడడు; రుచులు = రుచులు; అందున్ = ఎడల; పెంపు = అతిశయము; తోడన్ = తోటి.

భావము:

భరతుడు షడ్రసోపేతమైన మృష్టాన్నమైనా ఇష్టంగానే తినేవాడు. అంతేకాని రుచులకోసం అఱ్ఱులు చాచేవాడు కాదు.

5.1-129-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నా విప్రుం డాత్మనిత్యానంద సుఖలాభంబు గలిగి ఇహ సుఖదుఃఖంబులయందు దేహాభిమానంబు చేయక శీతోష్ణ వాతవర్షా తపంబులకు నోడి పైచీరగప్పక వృషభంబునుం బోలెఁ బీనుండును గఠినాంగుండు నగుచు స్థండిలశాయియై రజఃపటలంబునం గప్పబడిన దివ్యమాణిక్యంబునుం బోలె ననభివ్యక్త బ్రహ్మవర్చసుం డై మలినాంబర పరీతకటితటుండు నతి మషీలిప్తయజ్ఞోపవీతుండు నగుటం జేసి యజ్ఞ జనంబు లతండు బ్రహ్మణాభాసుండు మందుండు నని పలుక సంచరించుచుండం గర్మమూలంబునం బరులవలన నాహారంబు గొను నపుడు దమవారును వ్యవసాయకర్మంబునందు నియమించిన క్షేత్రవిహిత సమ విషమ న్యూనాధికంబుల నెఱుంగక ప్రవర్తిల్లుచు నూక తవుడు తెలికపిండి పొట్టు మాఁడు ద్రబ్బెడ యాదిగాఁ గల ద్రవ్యంబుల యందు నమృతంబు పగిది రుచిచేసి భక్షించుచుం జేని కావలి యుండు నెడ నొక్కనాఁడు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; ఆత్మన్ = ఆత్మజ్ఞానమున; నిత్య = నిత్యమైన; ఆనంద = ఆనందము; సుఖ = సుఖము; లాభంబులున్ = లాభములు; కలిగి = ఉండి; ఇహ = ప్రాపంచిక; సుఖ = సుఖము; దుఃఖంబులు = దుఃఖములు; అందున్ = ఎడల; దేహ = శరీరముమీది; అభిమానంబున్ = ఆపేక్ష; చేయక = పెట్టుకొనక; శీత = చలి; ఉష్ణ = వేడి; వాత = గాలి; వర్ష = వాన; ఆతాపంబుల్ = ఎండలకు; కున్ = కు; ఓడి = జంకి; పైన్ = శరీరముమీద; చీరన్ = బట్టను; కప్పకన్ = కప్పుకొనక; వృషభంబునున్ = ఎద్దు; పోలెన్ = వలె; పీనుండునున్ = బలిష్ఠుడు; కఠిన = గట్టి; అంగుండు = శరీరము గలవాడు; అగుచున్ = అగుచూ; స్థండిల = మట్టిదిబ్బలపైన; శాయి = పండుకొనువాడు; ఐ = అయ్యి; రజఃపటలంబునన్ = దుమ్ములో; కప్పబడిన = కప్పబడినట్టి; దివ్య = గొప్ప; మాణిక్యంబునున్ = మాణిక్యము; పోలెన్ = వలె; అనభివ్యక్త = వ్యక్తము కాని; బ్రహ్మ = బ్రహ్మజ్ఞనము యొక్క; వర్చసుండునున్ = ప్రకాశముగలవాడు; మలిన = మాసిపోయిన; అంబర = బట్ట; పరీత = చుట్టబెట్టబడిన; కటితటుండున్ = మొలభాగము గలవాడు; అతి = మిక్కిలి; మషీ = మసి; లిప్త = పట్టిన; యజ్ఞోపవీతుండున్ = జంధ్యము గలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; యజ్ఞ = యజ్ఞమునకు వచ్చిన; జనంబులున్ = వారు; అతండు = అతడు; బ్రాహ్మణాభాసుండు = బ్రాహ్మణభ్రష్టుడు; మందుండు = తెలివితక్కువవాడు; అని = అని; పలుకన్ = అనుచునుండగ; సంచరించుచుండన్ = తిరుగుతుండగ; కర్మ = చేసిన పనుల; మూలంబునన్ = వలన; పరుల = ఇతరుల; వలనన్ = నుండి; ఆహారంబున్ = ఆహారము; కొనున్ = తీసుకొనెడి; అపుడున్ = సమయములో; తమవారును = స్వంత మనుషులు కూడ; = వ్యవసాయ = వ్యవసాయపు; కర్మంబున్ = పనుల; అందున్ = లో; నియమించినన్ = అప్పజెప్పగా; క్షేత్ర = పొలము పనులలో; విహిత = కల; సమ = సమంజమైనవి; విషమ = అసమంజసమైనవి; న్యూన = నీచమైనవి; అధికంబులన్ = గొప్పవి యనెడి బేధంబులను; ఎఱుంగక = తెలియక; ప్రవర్తిల్లుచున్ = నడచుకొనుచు; ఊక = ఊక {ఊక - ధాన్యము దంచినప్పుడు వచ్చెడి పై పొరలు}; తవుడు = తవుడు {తవుడు - ధాన్యము దంచినప్పుడు వచ్చెడి మెత్తటిపొడి}; తెలికపిండి = తెలికపిండి {తెలికపిండి - నువ్వులు మొదలగువాని నుండి నూనె తీసినప్పుడు వచ్చెడి అచ్చులు లేదా పొడి}; పొట్టు = పొట్టు {పొట్టు - గింజల యొక్క పై పొర}; మాఁడుద్రబ్బెడ = మాఁడుద్రబ్బెడ {మాఁడుద్రబ్బెడ - అన్నదులు మాడిపోయిన పెచ్చులు}; ఆదిగాగల = మొదలగు; ద్రవ్యంబులన్ = పదార్థంబులు; అందున్ = లోకూడ; అమృతంబున్ = అమృతము; పగిదిన్ = వలె; రుచిచేసి = మంచి రుచి గలవానిగా; భక్షించుచున్ = తినుచూ; చేనిని = పొలము; కావలి = కాపలా; ఉండు = ఉండెడి; ఎడన్ = సమయములో; ఒక్క = ఒక; నాడున్ = దినమున; =

భావము:

ఆ బ్రాహ్మణుడు నిత్యం ఆత్మానందాన్ని పొందుతూ ప్రాపంచిక సుఖ దుఃఖాలపైన, దేహం పైన శ్రద్ధ లేకుండా ఉండేవాడు. చలి, వేడి, గాలి, వాన, ఎండలకు లొంగి శరీరం మీద బట్ట కప్పుకోకుండా, ఆబోతు లాగా బలిసి గట్టిపడిన దేహంతో కటిక నేలపై పడుకునేవాడు. మట్టికొట్టుకున్న మాణిక్యంలాగా ప్రకాశిస్తూ బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు. మాసిన బట్టను నడుముకు చుట్టుకొని, మడ్డి పట్టిన యజ్ఞోపవీతం కలిగి ఉండేవాడు. అజ్ఞానులైన జనులు అతనిని వీడు వేషానికి మాత్రమే బ్రాహ్మణుడని, తెలివితక్కువవాడని అనుకునే విధంగా తిరిగేవాడు. ఏదయినా పని చేసి భరతుడు ఇతరులనుండి ఆహారాదులను తీసుకొనేవాడు కాని ఉచితంగా స్వీకరించేవాడు కాదు. అప్పుడు స్వంత మనుష్యులైన సవతితల్లి కొడుకులు భరతుణ్ణి వ్యవసాయపు పనులలో నియమించారు. ఊక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాడిపోయిన పెచ్చులు ఏది పెట్టినా అమృతంగా భావించి తింటూ పొలానికి కాపలా కాస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు…