పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : హరిణీగర్భంబున జనించుట

  •  
  •  
  •  

5.1-117-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రాజులు ప్రస్తుతింప సురరాజసమానుఁడనై తనూజులన్
రాజులఁ జేసి తాపసులు రాజఋషీంద్రుఁ డటంచుఁ బల్కఁగాఁ
దేము నొంది యా హరిణదేహము నందలి ప్రీతిఁ జేసి నా
యో చెడంగ నేఁ జెడితి యోగిజనంబులలోన బేలనై.

టీకా:

రాజులు = రాజులు; ప్రస్తుతింపన్ = స్తుతించుతుండగా; సురరాజ = ఇంద్రునికి {సురరాజు - సురలు (దేవతలు)కి రాజు, దేవేంద్రుడు}; సమానుడవున్ = సమానమైన వాడవు; ఐ = అయ్యి; తనూజులన్ = పుత్రులను; రాజులన్ = రాజులుగా; చేసి = చేసి; తాపసులున్ = తపస్సు చేసెడివారు; రాజఋషి = రాజఋషులలో; ఇంద్రుడు = ఇంద్రునివంటివాడు; అటంచన్ = అనుచూ; పల్కగా = పలుకుతుండగా; తేజమున్ = తేజస్సును; ఒంది = పొంది; ఆ = ఆ; హరిణ = లేడి; దేహమున్ = దేహము; అందలి = ఎడ; ప్రీతిన్ = ఆపేక్ష; చేసి = వలన; నా = నా యొక్క; యోజ = విధాన మంతయు; చెడంగ = చెడిపోగా; నేన్ = నేను; చెడితి = చెడిపోతిని; యోగి = యోగులైన; జనంబుల్ = వారి; లోనన్ = లో; బేలను = మూఢుడను; ఐ = అయ్యి.

భావము:

“రాజులు పొగడుతుండగా, దేవేంద్రునితో సమానమైన వైభవాన్ని అనుభవించి, కొడుకులను రాజులుగా చేసి, మునులు నన్ను రాజర్షి అని గౌరవించగా తపస్వినై ఈ జింకపిల్ల మీద మోహాన్ని పెంచుకొని, విధం చెడి సాటి యోగులలో భ్రష్టుణ్ణి అయ్యాను.