పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : హరిణీగర్భంబున జనించుట

  •  
  •  
  •  

5.1-116-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భరతుండు హరిణీగర్భంబునం బుట్టియు భగవదారాధన సామర్థ్యంబునం దన మృగజన్మ కారణంబుఁ దెలిసి కడుం దాపంబు నొందుచు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భరతుండు = భరతుడు; హరిణీ = లేడి యొక్క; గర్భంబునన్ = కడుపులో; పుట్టియున్ = పుట్టినప్పటికిని; భగవత్ = భగవంతుని; ఆరాధన = పూజించుటవలన కలిగిన; సామర్థ్యంబునన్ = శక్తి వలన; తన = తన యొక్క; మృగ = మృగముగా; జన్మ = జన్మించుటకు; కారణంబున్ = కారణమును; తెలిసి = ఎరిగి; కడున్ = మిక్కిలి; తాపంబున్ = సంతాపమును; ఒందుచున్ = పొందుతూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; =

భావము:

ఈ విధంగా భరతుడు జింక కడుపులో పుట్టి కూడా భగవంతుణ్ణి ఆరాధించిన పూర్వ పుణ్యం కారణంగా తాను జింకగా పుట్టడానికి కారణం తెలిసికొని బాధపడి ఇలా అనుకున్నాడు.