పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-96-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రీతిఁ గర్మసిద్ధుల
నాయ నత్యంత శుద్ధ గు చిత్తముతో
నా రాచపట్టి భరతుఁడు
ధారుణిఁ బాలించె నధిక ర్మాన్వితుఁడై.

టీకా:

ఈ = ఈ; రీతిన్ = విధముగ; కర్మ = వేదకర్మములు; సిద్ధులన్ = సిద్ధించుటలను; ఆరయన్ = తరచిచూసిన; అత్యంత = మిక్కిలి; శుద్ధము = స్వచ్ఛమైనది; అగు = అయిన; చిత్తము = మనసు; తోన్ = తోటి; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుడు; భరతుడు = భరతుడు; ధారుణిన్ = భూమండలమును; పాలించెన్ = పరిపాలించెను; అధిక = మిక్కిలి; ధర్మ = ధర్మములతో; ఆన్వితుడు = కూడినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగా పరిశుద్ధమైన చిత్తంతో, ధర్మదీక్షతో, తాను చేస్తున్న కర్మలు ఫలించే విధంగా రాకుమారుడైన భరతుడు భూమిని పాలించాడు.