పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-95.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములను బలికెడు నా దైవములను శ్రీశు
వయవంబులు గాఁగ భూవుఁడు ప్రేమ
నుదినంబును బాయక నతఁ దలఁచి
ఖిల రాజ్యానుసంధానుఁ గుచు నుండె.

టీకా:

భగవంతుడు = హరి; అగు = అయిన; జగద్భరితున్ = నారాయణుని {జగత్భరితుడు - జగత్తును భరించెడివాడు, విష్ణువు}; అల్పంబులున్ = చిన్నవి; అధికంబులున్ = పెద్దవి; ఐన = అయినట్టి; పెక్కు = అనేకమైన; అధ్వరములన్ = యజ్ఞములచే; దర్శ = అమావాస్యనాటి యాగములు; పూర్ణిమ = పున్నమినాటి యాగములు; చేన్ = వలన; చాతుర్మాస్యములన్ = త్రికాలములందు {చాతుర్మాసములు - నాలుగు నెలలచొప్పున యుండెడి త్రికాలములు (ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము)}; అగ్నిహోత్రము = హోమము; వలనన్ = తోటి; కడకన్ = పూని; పశుసోమముల్ = పశుయాగముల {పశుసోమములు - పశువులను బలిచ్చెడి సోమములు (యజ్ఞములు)}; చేతన్ = చేత; పలుమఱు = మాటిమాటికిని; పూజించి = పూజించి; = = వేద = వేదములందు; ఉక్తము = ఉదహరింపబడినవి; ఐన = అయిన; ఆ = ఆ; విమల = స్వచ్ఛమైన; కర్మములన్ = కర్మలలో; కల్గు = ఉండెడి; ధర్మంబున్ = ధర్మములను; పురుషోత్తమ = నారాయణునికి {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; అర్పణంబుగన్ = అర్పించెడిది యగునట్లు; చేయుచున్ = చేయుచూ; మఖంబులనున్ = యాగములయందు; మంత్రములను = మంత్రములను; పలికెడు = ఉచ్చరించెడి; ఆ = ఆ.
దైవములను = బ్రాహ్మణులను; శ్రీశు = విష్ణుని {శ్రీశః- లక్మీదేవికి నాథుడు, విష్ణుసహస్రనామాలలో 606వ నామం}; అవయవంబులున్ = అవయవములు; కాగన్ = అన్నట్లు; భూధవుడు = రాజు {భూధవుడు - భూమికి భర్త, రాజు}; ప్రేమన్ = ప్రీతిపూర్వకముగ; అనుదినంబును = ప్రతిదినమును; పాయక = విడువక; ఘనతన్ = గొప్పగా; తలచి = భావించుతూ; అఖిల = సమస్తమైన; రాజ్య = రాజ్యమును; అనుసంధానుడు = కూర్చెడివాడు; అగుచునుండె = అగుతుండె.

భావము:

భరతుడు లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవి, పెద్దవి అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమలలో చేసే సత్కర్మలను, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులను ఆచరించాడు. ఇంకా పశుయాగాలను, సోమయాగాలను నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మల ఫలాన్ని పరమేశ్వరార్పణం చేసాడు. యాగాలలోను, మంత్రాలలోను పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలచుకుంటూ భక్తిమయమైన హృదయంతో శ్రద్ధతో సమస్త రాజ్యాన్ని పరిపాలించాడు.