పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-93-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వివాహితుండై యా పంచజని వలన నహంకారంబునం బంచతన్మాత్రలు జనించిన తెఱంగున సుమతి రాష్ట్రభృక్సుదర్శనాచరణ ధూమ్రకేతువు లను నేవురు పుత్రులం బుట్టించె; నటమున్న యజనాభం బను పేరం బరఁగు వర్షంబు భరతుండు పాలించు కతంబున భారతవర్షంబు నాఁ బరగె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వివాహితుండు = వివాహము చేసుకొన్నవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; పంచజని = పంచజని; వలనన్ = వలన; అహంకారంబునన్ = అహంకారము వలన; పంచతన్మాత్రలు = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1 శబ్దము 2 స్పర్శము 3 రూపము 4 రుచి 5 వాసన}; జనించిన = పుట్టెడి; తెఱంగునన్ = విధముగ; సుమతి = సుమతి; రాష్ట్రభృక్ = రాష్ట్రభృక్కు; సుదర్శన = సుదర్శనుడు; ఆచరణ = ఆచరణుడు; ధూమ్రకేతువు = ధూమ్రకేతువు; అను = అనెడి; ఏవురన్ = ఐదుగురిని; పుత్రులన్ = కుమారులను; పుట్టించెన్ = పుట్టించెను; అటమున్ను = అంతకు పూర్వము; అజనాభంబు = అజనాభము {అజనాభము - అజ (మేషము) రాశి నాభము (ముఖ్యముగాగలది), రాశిచక్రము}; అను = అనెడి; పేరన్ = పేరుతో; పరగు = ప్రసిద్దమైన; వర్షంబున్ = వర్షము, భూఖండము; భరతుండు = భరతుడు; పాలించు = పాలించిన; కతంబునన్ = కారణముచేత; భారతవర్షంబున్ = భారతవర్షము; నా = అని; పరగెన్ = ప్రసిద్దమైనది; అంతన్ = అంతట; =

భావము:

అహంకారానికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనబడే పంచతన్మాత్రలు పుట్టినట్లు భరతునికి పంచజని వలన సుమతి, రాష్ట్రభృక్కు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే అయిదుగురు కొడుకులు పుట్టారు. అంతకుముందు అజనాభం అనే పేరుతో పిలువబడిన భూభాగం భరతుడు పాలించడం వల్ల భరతవర్షం అనే పేరును పొందింది.