పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-91.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నదు లోకంబు చూపంగఁ గిన యట్టి
మోక్షమార్గంబు నెఱిఁగించి ముక్తదేహుఁ
గుచుఁ దాదాత్మ్య మొందెఁ బ్రత్యక్ష విష్ణు
వైన ఋషభుండు జనులకు ద్భుతముగ.

టీకా:

నిత్య = శాశ్వతమైన; అనుభూతము = అనుభవింపబడుతున్నది; ఔ = అయిన; నిజరూప = స్వస్వరూపము; లాభ = జ్ఞానమువలన; నివృత్తమై = తొలగింపబడినదై; తగు = తగిన; మహాతృష్ణ = తరుగనికోరికలు; కలిగి = పొంది; అతులిత = సాటిలేని; విపుల = విస్తారమైన; మాయా = మాయచేత; రచితంబున్ = ఏర్పరుపబడినది; ఐనన్ = అయినట్టి; లాభంబున్ = ప్రయోజనమున; కున్ = కు; తగులంబు = లాలస; లేని = లేనట్టి; మతిన్ = బుద్ధి; కల్గి = ఉండి; లోకులన్ = ప్రజలను; అతి = మిక్కిలి; వేడ్కన్ = సంతోషముతో; కరుణించి = దయచూపి; అభయ = అభయ, రక్షణ; దానంబున్ = ప్రదానము; ఇచ్చి = ఇచ్చి; అందఱ = అందరి; కిన్ = కి; ఇలన్ = భూమిపైన; అవ్యయంబు = తరుగనిది; ఐ = అయ్యి; దివ్యము = దివ్యమైనది; ఐ = అయ్యి; మహానందము = గొప్ప ఆనందము; ఐ = కలిగి; అత్యంత = అత్యున్నతమైన; సేవ్యము = సేవింపదగినది; ఐ = అయ్యి; అతులమున్ = సాటిలేనిది; ఐనన్ = అయినట్టి.
తనదు = తనయొక్క; లోకంబున్ = లోకమును; చూపంగన్ = చూపుటకు; తగిన = తగినది; అట్టి = అటువంటి; మోక్ష = ముక్తిని చేరెడి; మార్గంబున్ = దారిని; ఎఱిగించి = తెలిపి; ముక్తదేహుడు = మరణించినవాడు {ముక్తదేహుడు - విడిచిన దేహముగలవాడు, మరణించినవాడు}; అగుచున్ = అగుచూ; తాదాత్మ్యంబున్ = తాదాత్మ్యమును; ఒందెన్ = పొందెను; ప్రత్యక్ష = సాక్షాత్; విష్ణువు = విష్ణుమూర్తి; ఐనన్ = అయినట్టి; = ఋషభుండు = ఋషభుడు; జనులు = ప్రజల; కున్ = కి; అద్భుతముగ = ఆశ్చర్యకరమగునట్లు.

భావము:

ఋషభుడు నిత్యానుభూత అయిన స్వస్వరూప లాభంవల్ల తృష్ణను నివారింపజేశాడు. యోగమాయా ప్రాప్తాలైన మహాసిద్ధుల చేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయ మిచ్చాడు. నిత్యమైనది, దివ్యమైనది, ఆనంద ప్రదమైనది, సేవింప దగినది, సాటిలేనిది అయిన వైకుంఠ లోకాన్ని అందింపగల మోక్షమార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహాన్ని వదలి జనులంతా ఆశ్చర్యపడేటట్లు విష్ణువులో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తుగా విష్ణువు.