పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-86-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చికాల తపము నైనను
రియింపఁగ నోపుఁ జిత్త ని పెద్దలు న
మ్మరు జారులకున్ జారిణి
ణిని నడరించు మనసు కామాదులకున్.

టీకా:

చిర = ఎక్కువ; కాల = కాలము చేయబడిన; తపమున్ = తపస్సును; ఐననున్ = అయినప్పటికిని; హరియింపన్ = నాశనము చేయుటకు; ఓపున్ = సమర్థత గలది; చిత్తము = మనసు; అని = అని; పెద్దలు = గొప్పవారు; నమ్మరు = విశ్వసింపరు; జారుల్ = వ్యభిచారుల; కున్ = కి; జారిణి = వ్యభిచారి; కరణిన్ = వలె; అడరించు = ఉద్రేకింప జేయును; మనసు = మనసు; కామ = కోరికలు; ఆదులన్ = మొదలగువాని; కున్ = కి.

భావము:

చాలాకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునైనా మనస్సు హరిస్తుంది. అందుచేత పెద్దలు మనస్సును నమ్మరు. విటులను ఆకర్షించే జారిణిలాగా మనస్సు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను ఆహ్వానిస్తుంది.