పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-83-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునివర! యోగజ్ఞానం
బునఁ జెఱుపంబడ్డ కర్మములు గల పెద్దల్
ని యుండెడి యైశ్వర్యం
బును ఋషభుం డెఱిఁగి యేల పొందక యుండెన్?"

టీకా:

ముని = మునులలో; వర = శ్రేష్ఠుడ; యోగ = యోగము యొక్క; జ్ఞానంబునన్ = విజ్ఞానమువలన; చెఱుపంబడ్డ = పోగొట్టబడిన; కర్మములు = కర్మములు; కల = కలిగిన; పెద్దల్ = గొప్పవారు; కనియుండెడి = చూడగలిగెడి; ఐశ్వర్యంబునున్ = ఐశ్వర్యములు; ఋషభుండు = ఋషభుడు; ఎఱిగి = తెలిసి తెలిసి; ఏల = ఎందులకు; పొందక = చేపట్టక; ఉండెన్ = ఉండెను.

భావము:

“మునివర్యా! యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు?”