పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-81-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుల కిట్లు యోగసంచార మెల్ల వి
రుద్ధ మనుచు నాత్మ బుద్ధిఁ జూచి
జగరంబు మాడ్కి వనిపై నుండె బీ
త్సకర్మమునకుఁ బాలుపడుచు.

టీకా:

జనుల్ = లోకుల; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; యోగసంచారము = యోగ పూర్వక సంచారము; ఎల్లన్ = అంతయు; విరుద్ధము = వ్యతిరేకము; అనుచున్ = అనుచూ; ఆత్మ = తన యొక్క; బుద్ధిన్ = మనసులో; చూచి = చూసి; = అజగరంబున్ = కొండచిలువ; మాడ్కిన్ = వలె; అవని = భూమి; పైన్ = మీద; ఉండె = పడియుండెను; బీభత్స = అసహ్యకరమైన; కర్మమున్ = కర్మమున; కున్ = కు; పాలుపడుచున్ = పూనుకొనుచు.

భావము:

తన యోగవిధానం లోకవిరుద్ధంగా ఉంటుందని ఋషభుడు గ్రహించి ఒకచోట అజగరం లాగా భూమిపై అసహ్యంగా పొరలసాగాడు.