పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని పట్టాభిషేకంబు

  •  
  •  
  •  

5.1-80-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధూత వేషమున ని
ట్లనిన్ మలినంబు లైన వయవములతోఁ
విలి చరించుచు నుండును
భువి భూతాక్రాంతుఁ డయిన పురుషుని మాడ్కిన్.

టీకా:

అవధూత = అవధూత యొక్క; వేషమునన్ = వేషములో; ఇట్లు = ఈ విధముగ; అవనిన్ = భూమిపైన; మలినంబులు = మాసిపోయినవి; ఐన = అయిన; అవయవముల = అవయవముల; తోన్ = తోటి; తవిలి = తగుల్కొని; చరించుచున్ = తిరుగుతూ; ఉండును = ఉండును; భువిన్ = నేలపైన; భూత = దయ్యము; ఆక్రాంతుడు = పట్టినవాడు; అయిన = అయిన; పురుషుని = మానవుని; మాడ్కిని = వలె.

భావము:

ఆ ఋషభుడు పిశాచాక్రాంతుడైన వానిలాగా మురికిపట్టిన అవయవాలతో అవధూత వేషంలో సంచరింప సాగాడు.