పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-212-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఈ యాఖ్యానముఁ జదివిన
ధీయుతులకు వినినయట్టి ధీరుల కైశ్వ
ర్యాయుః కీర్తులు గలుగును;
బాయును దురితములు; దొలఁగు వబంధంబుల్."

టీకా:

ఈ = ఈ; ఆఖ్యానమున్ = కథను; చదివిన = చదివిన; ధీ = బుద్ధిబలముతో; యుతులకు = కూడినవారికి; వినిన = విన్న; అట్టి = అటువంటి; ధీరుల్ = బుద్ధిబలము కలవారి; కిన్ = కి; ఐశ్వర్య = ఐశ్వర్యము; ఆయుస్ = జీవితకాలము; కీర్తులున్ = కీర్తి; కలుగును = కలుగును; పాయును = దూరమగును; దురితములున్ = పాపములు; తొలగున్ = తొలగిపోవును; భవబంధంబుల్ = సంసారబంధములు.

భావము:

“ఈ కథను చదివిన బుద్ధిమంతులకు, విన్న ధీరులకు ఐశ్వర్యం, ఆయువు, కీర్తి లభిస్తాయి. పాపాలు, భవబంధాలు తొలగిపోతాయి.”