పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-203.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలి భవదీయ గుణ సత్కథా విలోలుఁ
య్యెనేనియు నా త్తమోహంబు వలనఁ
బాసి వర్తించు విజ్ఞానరత గలిగి
చిరదయాకార! యిందిరాచిత్తచోర!"

టీకా:

నళినాక్ష = హరి {నళినాక్షుడు - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; విను = వినుము; భవత్ = నీ యొక్క; మాయన్ = మాయ; వశంబునన్ = లొంగుటచేత; దేహంబున్ = శరీరమును; దాల్చి = ధరించి; తత్ = ఆ; దేహము = శరీరము; అందున్ = లో; ఆత్మన్ = మనసులో; అహం = నేను; మమ = నాది; ఇతి = అని; అభిమానమును = గర్వమును; పొంది = పొంది; పుత్ర = పుత్రులు; జాయా = భార్య; గృహ = గృహములు; క్షేత్ర = భూములు; బంధు = బంధువులు; ధన = సంపదలు; పశు = పశువులు; ముఖ = మొదలగు; వస్తు = పదార్థముల; తతులు = సమూహముల; సంయోగ = సంయోగములు; వియోగ = వియోగములవలన; దుఃఖంబులన్ = దుఃఖములను; ఒందుచుండు = పొందుతుండును; ధృతి = ధైర్యము; విహీనుడు = లేనివాడు; అసత్ = అసత్యమైన; విషయా = విషయార్థములందు; అతి = మిక్కలి; లాలసుడు = ఆసక్తిచెందువాడు; అతి = మిక్కలి; దుష్టమతి = చెడ్డ; మతియున్ = హదయముకలవాడు; ఐనట్టి = అయినటువంటి; వాడు = వాడు;
తవిలి = పూని; భవదీయ = నీ యొక్క; గుణ = గుణములు; సత్ = మంచి; కథా = కథల యందు; విలోలుడు = మిక్కిలి వర్తించువాడు; అయ్యెనేనియున్ = అయినప్పటికి; ఆ = ఆ; తమో = తమస్సు; మోహంబు = మోహముల; వలన = వలన; పాసి = విడిచి; = వర్తించు = వర్తించును; విజ్ఞాన = విజ్ఞానము యందు; పరతన్ = ఆసక్తి; కలిగి = కలిగుండి; చిరదయాకార = హరి {చిరదయాకార - చిర (మిక్కిలి) దయ (కృప)కి స్వరూపమైనవాడు, విష్ణువు}; ఇందిరాచిత్తచోర = హరి {ఇందిరాచిత్తచోర - ఇందిర (లక్ష్మీదేవి) చిత్తము (మనసు)ను చోరుడు (దొంగిలించినవాడు), విష్ణువు}.

భావము:

“కమలనయనా! విను. నీ మాయకు వశుడై మానవుడు దేహం ధరించి, ఆ దేహంపై ‘నేను, నాది’ అని ఆసక్తి పెంచుకుంటాడు. కొడుకు, భార్య, ఇల్లు, పొలము, చుట్టాలు, ధనం, పశువులు మొదలైన వాటి సంయోగ వియోగాల వల్ల దుఃఖిస్తాడు. దయామయా! లక్ష్మీప్రియా! అలాంటి ధైర్యహీనుడు, ఇంద్రియార్థాలలో మిక్కిలి ఆసక్తి కలవాడు, చెడ్డ మనస్సు కలవాడు కూడా నీ గుణాలకు సంబంధించిన సత్కథలను వింటే ఆ అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం పొందుతాడు.