పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-197-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రక్షా చరణుండ వై నెగడు దీ; య్యగ్నిహోత్రాది పం
విధంబున్ మఱి మంత్రపంచక సుసృష్టంబై తగంబొల్చు నా
రూపం బగు నీకు మ్రొక్కెదను; నీ యాజ్ఞన్ భువిన్ హవ్యముల్
నవ్రాతములన్ వహింతు హరి! యుష్మత్తేజముం బూనుచున్."

టీకా:

హవ = యజ్ఞమును; రక్షా = రక్షించుటను; ఆచరణుండవు = చేయవాడవు; ఐ = అయ్యి; నెగడుదువు = అతిశయించుదువు; ఈవ = నీవే; అగ్నిహోత్రాది = అగ్నిహోత్రది {అగ్నిహోత్రాది పంచకము- 1 అగ్నిహోత్రము 2 హవిస్సు 3 వేదిక 4నేయి 5 హోమము చేయువాడు}; పంచ = ఐదు (5); విధంబున్ = విధములును; మఱి = మరియు; మంత్రపంచక = ఐదు (5) మంత్రములుచే; సు = చక్కగా; సృష్టంబు = చేయబడినది; ఐ = అయ్యి; తగన్ = చక్కగా; పొల్చు = విలసిల్లు; ఆ = ఆ; హవ = యజ్ఞ; రూపంబు = స్వరూపము; అగు = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదను = నమస్కరించెదను; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞతో; భువిన్ = లోకమున; హవ్యముల్ = హవ్యము {హవ్యము - అగ్నుహోత్రమున వేల్చుటకు ఇగిర్చిన అన్నము,నేయి}; సవనవ్రాతములన్ = యజ్ఞమందలి స్తోత్రముల సమూహములు; వహింతు = నిర్వహింతును; హరి = నారాయణ; యుష్మత్ = నీ యొక్క; తేజమున్ = తేజమును; పూనుచున్ = ధరించి.

భావము:

“హరీ! నీవు యజ్ఞాలను రక్షిస్తావు. ఐదు అగ్నిహోత్రాలు, ఐదు మంత్రాలు గల యజ్ఞమూర్తివి నీవే. నీవు హోమస్వరూపుడవు. నీ తేజస్సును దాల్చి నీ ఆజ్ఞానుసారం నేను యజ్ఞాలలో హోమద్రవ్యాలైన హవ్యలను ధరిస్తున్నాను.”