పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-193.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుచు నుందువు గద; ని న్నన్యభక్తి
భృత్యభావంబుఁ దాల్చి సంప్రీతిఁ గొల్చు
మ్ము రక్షింపవే; కృపాయ! రమేశ!
పుండరీకాక్ష! సంతతభువనరక్ష!"

టీకా:

విశ్వాత్మ = నారాయణ {విశ్వాత్మ - విశ్వమే ఆత్మ(స్వరూపము)గా కలవాడు, విష్ణువు}; నీ = నీ; అందు = నుండి; వేఱుగా = ఇతరము అగునట్లు; జీవులన్ = సమస్తజీవములను; కనడు = చూడడు; ఎవ్వడు = ఎవడో; అటువాని = అటువంటివాని; కంటెన్ = కంటె; ప్రియుండు = ఇష్టుడు; = నీకున్ = నీకు; లేడు = లేడు; అయినను = అయినప్పటిటకిని; నిఖిల = సమస్తమైన; విశ్వ = భువన; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; విలయంబుల = లయముల; కతన = కోసము; దైవ = దైవత్వ; సంగతిన్ = కూడుటచేత; నిర్భిన్న = నశించని; సత్త్తాదిగుణ = త్రిగుణములతో {సత్త్వాది - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు}; విశిష్ట = ప్రత్యేకమైన; ఆత్మీయ = స్వంత; మాయన్ = మాయ; చేన్ = చేత; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆది = మొదలైన; వివిధ = రకరకముల; భేదములన్ = భేదములుకల రూపములను; ఒందుదువు = పొందుతావు; స్వ = స్వంత; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = లోను; ఉండుదువు = ఉంటావు; వినిహత = బాగుగాపోగొట్టబడిన; విమోహివి = మోహము కలిగినవాడవు; అగుచున్ = అవుతూ; ఉందువు = ఉంటావు; కదా = కదా.
నిన్ను = నిన్ను; అనన్య = అనితరమైన; భక్తిన్ = భక్తితో; భృత్యు = సేవక; భావంబున్ = భావమును; తాల్చి = ధరించి; సంప్రీతిన్ = మిక్కిలిప్రీతితో; కొల్చు = సేవించు; మమ్మున్ = మమ్ములను; రక్షింపవే = కాపాడుము; కృపామయ = దయామయ; రమేశ = నారాయణ {రమేశ - రమ (లక్ష్మీదేవి) యొక్క ఈశ (భర్త), విష్ణువు}; పుండరీకాక్ష = నారాయణ {పుండరీకాక్ష - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సంతతభువనరక్ష = నారాయణ {సంతతభువనరక్ష - సంతత (ఎల్లప్పుడు) భువన (జగత్తును) రక్ష (రక్షించువాడు), విష్ణువు}.

భావము:

“ఓ విశ్వస్వరూపా! ఈ విశ్వంలోని జీవులను నీకంటె వేరుగా చూడనివాడు నీకు మిక్కిలి ఇష్టుడు. నీవు లోకాల సృష్టి, స్థితి, లయల కోసం బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన అనేక భేదాలను పొందుతావు. సత్త్వరజస్తమస్సులనే వేరు వేరు గుణాలతో కూడిన నీ మాయవల్ల ఇలా చేస్తూ స్వస్వరూపాన్ని ధరిస్తూ ఉంటావు. ఓ కరుణామయా! కమలాప్రియా! కమలనయనా! నిరంతర నిఖిల భువన రక్షా! భృత్యభావంతో, అత్యంతానురక్తితో అనన్య భక్తితో నిన్ను సేవించే మమ్ము కాపాడు.”