పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-187-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రి! భవ దుఃఖ భీషణ దవానల దగ్ధతృషార్త మన్మనో
ద్విదము శోభితంబును బవిత్రము నైన భవత్కథా సుధా
రి దవగాహనంబునను సంసృతి తాపము వాసి క్రమ్మఱం
దిరుగదు బ్రహ్మముం గనిన ధీరుని భంగిఁ బయోరుహోదరా!"

టీకా:

హరి = నారాయణ; భవ = సంసారము నందలి; దుఃఖ = దుఃఖము అనెడి; భీషణ = భయంకరమైన; దవానల = కార్చిచ్చుచే; దగ్ధ = కాలి; తృష = దప్పిక; ఆర్త = బాధపడిన; మత్ = నా యొక్క; మనస్ = మనసు అనెడి; ద్విరదము = ఏనుగు; శోభితంబున్ = శోభిల్లుతున్నది; పవిత్రమున్ = పవిత్రము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; కథా = కథలు అనెడి; సుధా = అమృతపు; సరిత్ = ప్రవాహములో; అవగాహనంబునను = స్నానము చేయుట వలన; సంసృతి = సంసార; తాపమున్ = బాధను; వాసి = పోగొట్టుకొని; క్రమ్మఱందిరుగదు = మరలిరాదు; బ్రహ్మమున్ = పరబ్రహ్మమును; కనిన = దర్శించిన; ధీరుని = విద్వాంసుని; భంగిన్ = వలెను; పయోరుహోదరా = నారాయణ {పయోరుహోదరుడు - పయోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}.

భావము:

“శ్రీహరీ! సంసార దుఃఖం అనే భయంకరమైన కార్చిచ్చుకు చిక్కి మా మనస్సు అనే ఏనుగు తపించి దప్పిగొన్నది. ఇప్పుడు నీ పవిత్ర గాథలనే అమృత స్రవంతిలో మునిగి తేలి సంసార తాపాన్ని పోగొట్టుకున్నది. పరబ్రహ్మతో ఐక్యాన్ని సంపాదించిన ధీరునివలె ఆ నదిలో నుండి తిరిగి బయటికి రావటం లేదు.”