పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

 •  
 •  
 •  

4-173-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"శోదావాగ్ని శిఖాకులితంబు పృ-
థుక్లేశ ఘన దుర్గదుర్గమంబు
దండధరక్రూర కుండలిశ్లిష్టంబు-
పాపకర్మవ్యాఘ్ర రివృతంబు
గురు సుఖ దుఃఖ కాకోలపూరిత గర్త-
గుచు ననాశ్రయ మైన యట్టి
సంసార మార్గ సంచారులై మృగతృష్ణి-
లఁ బోలు విషయ సంము నహమ్మ

4-173.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మేతి హేతుక దేహ నికేతనములు
యి మహాభారవహు లైన ట్టి మూఢ
నము లేనాఁట మీ పదాబ్జములు గానఁ
జాలు వారలు? భక్తప్రన్న! దేవ!"

టీకా:

శోక = దుఃఖము అనెడి; దావాగ్ని = కారుచిచ్చు; శిఖ = మంటల; ఆకులితంబున్ = చీకాకులుకలిగినది; పృథు = పెద్ద; క్లేశ = చిక్కులు అనెడి; ఘన = గొప్ప; దుర్గ = దుర్గములతో; దుర్గమంబు = దాటరానిది; = దండధర = యముడు అనెడి; క్రూర = క్రూరమైన; కుండలి = సర్పములచే; శ్లిష్టంబు = చుట్టుముట్టబడినది; పాప = పాపపు; కర్మ = కర్మములు అనెడి; వ్యాఘ్ర = పెద్దపులులుచే; పరివృతంబు = ఆక్రమించబడినది; గురు = పెద్ద; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములు అనెడి; కాకోల = కాకోలవిషముతో; పూరిత = నిండిన; గర్తము = గొయ్యి; అగుచున్ = అవుతూ; అనాశ్రయము = ఆశ్రయములేనిది; ఐన = అయిన; అట్టి = అటువంటి; = సంసార = సంసారపు; మార్గ = మార్గమున; సంచారులు = సంచరించువారు; ఐ = అయ్యి; మృగతృష్టికలన్ = ఎడమావులను; పోలు = పోలెడి; విషయ = ఇంద్రియలక్ష్యాంశముల; సంఘమున్ = సమూహమును; అహం = నేను; మమ = నాది; ఇతి = అనెడి; హేతుక = కారణములు కలిగిన.
దేహ = శరీరములు అనెడి; నికేతనములున్ = నివాసములు; అయి = అయ్యి; మహా = పెద్ద; భార = బరువులను; ఆవహులు = మోయువారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; మూఢ = మూర్ఖులైన; జనములు = వారు; ఏనాట = ఏసమయమున; మీ = మీ యొక్క; పద = పాదములు అనెడి; అబ్జములు = పద్మములు; కానన్ = దర్శించుటకు; చాలువారలు = సమర్థులు; భక్తప్రసన్న = నారాయణ {భక్తప్రసన్న - భక్తులకు అనుగ్రహము కలవాడు, విష్ణువు}; దేవ = నారాయణ.

భావము:

“భక్తప్రసన్నుడవైన దేవా! సంసారమార్గం శోకమనే కార్చిచ్చు మంటలచే చీకాకైనది. కష్టాలు అనే గొప్ప కోటలతో దాటరానిది. యముడనే క్రూర సర్పంతో కూడినది. దుర్జనులనే పెద్ద పులులతో నిండినది. అంతులేని సుఖదుఃఖాలనే కాలకూట విషంతో నిండిన గుంట వంటిది. దిక్కు లేనిది. అటువంటి సంసార మార్గంలో సంచరిస్తూ ఎండమావులవంటి ఇంద్రియ వాంఛలలో పడి కొట్టుమిట్టాడుతూ ‘నేను, నాది’ అనే భావాలకు కారణాలయిన దేహం గేహం వంటి గొప్ప బరువును మోస్తూ ఉండే పరమమూర్ఖులైన మానవులు నీ పాదపద్మాలను ఎప్పుడూ చూడలేరు.”