పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-171.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయ ననవద్యమూర్తివి యైన నీదు
లిత తత్త్వస్వరూపంబుఁ దెలియఁజాల
య్య మాధవ! గోవింద! రి! ముకుంద!
చిన్మయాకార! నిత్యలక్ష్మీవిహార!"

టీకా:

వామదేవుని = నందీశ్వరుని; శాప = శాపమునకు; వశమునన్ = లొంగుట; చేసి = వలన; కర్మా = కర్మల; అనువర్తులము = అనుసరించువారము; మేము = మేము; ఐన = అయిన; కతన = కారణముచేత; బలసి = అతిశయించి; వేద = వేదమునందు; ప్రతిపాద్య = ప్రతిపాదింపబడిన; ధర్మ = ధర్మముచే; ఉపలక్ష్యంబు = గుర్తింపదగినది; ఐనట్టి = అయినటువంటి; మఖంబున్ = యజ్ఞము; అందున్ = లో; దీపింపన్ = ప్రకాశించగ; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలైన; దేవతా = దేవతలతో; కలిత = కూడిన; రూప = రూపముల; వ్యాజమునన్ = మిషతో; పొంది = పొంది; పరగ = ప్రవర్తిల్లు; నిన్ను = నిన్ను; యజ్ఞ = యజ్ఞముయొక్క; స్వరూపుండవు = స్వరూపుడవు; అని = అని; కాని = కాని; కేవల = కేవలము; నిర్గుణుండవు = త్రిగుణములునులేనివాడవు; నిత్యనిర్మలుడవు = శాశ్వతమువిమలమైనవాడవు; అరయన్ = తరచిచూసిన; అనవధ్యమూర్తివి = వంకపెట్టరానివాడవు.
ఐన = అయిన; నీదు = నీయొక్క; లలిత = చక్కటి; తత్త్వ = తత్త్వముయొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; తెలియజాలన్ = తెలిసికోలేను; అయ్య = తండ్రి; మాధవ = విష్ణుమూర్తి {మాధవ - మనసును రంజింపజేయువాడు, విష్ణువు}; గోవింద = విష్ణుమూర్తి {గోవింద - గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు}; హరి = విష్ణుమూర్తి; ముకుంద = విష్ణుమూర్తి; చిన్మయాకార = విష్ణుమూర్తి {చిన్మయాకార - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), విష్ణువు}; నిత్యలక్ష్మీవిహార = విష్ణుమూర్తి {నిత్యలక్ష్మీవిహార - నిత్యమును లక్ష్మీ (లక్ష్మీదేవితో, సంపదలలో) విహరించువాడు, విష్ణువు}.

భావము:

“దేవా! మేము నందీశ్వరుని శాపం వల్ల యజ్ఞాది కర్మలయందు ఆసక్తుల మైనాము. వేదాలలో ప్రతిపాదింపబడిన ధర్మలక్షణాలు కలది యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంతో నీవే సాక్షాత్కరిస్తుంటావు. నీవు యజ్ఞస్వరూపుడవు. నిష్కించనుడవు. నిర్మలుడవు. నిరవద్యుడవు. మాధవా! గోవిందా! హరీ! ముకుందా! చిన్మయమూర్తీ! నిత్యసౌభాగ్యశాలీ! నీ యథార్థ స్వరూపాన్ని మేము గ్రహింపలేము.”