పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షాదుల శ్రీహరి స్తవంబు

  •  
  •  
  •  

4-169-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళినాయతాక్షుని యనంత పరాక్రమ దుర్నిరీక్ష్య తే
జో నిహతస్వదీప్తు లగుచున్నుతిసేయ నశక్తులై భయ
గ్లాని వహించి బాష్పములు గ్రమ్మఁగ గద్గదకంఠులై తనుల్
మ్రానుపడంగ నవ్విభుని న్ననఁ గైకొని యెట్టకేలకున్.

టీకా:

ఆ = ఆ; నళినాయతాక్షుని = నారాయణునిని {నళినాయతాక్షుడు - నళిని (కమలముల) ఆయత (వలె విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; అనంత = అనంతమైన; పరాక్రమ = పరాక్రమములు; దుర్నిరీక్ష్య = చూచుటకు వీలుకాని; తేజస్ = తేజస్సుచేత; నిహత = బాగా కొట్టబడిన; స్వ = తమ; దీప్తిలు = కాంతులు కలవారు; అగుచున్ = అవుతూ; నుతి = స్తుతుల; చేయన్ = చేయుటకు; అశక్తులు = శక్తిలేనివారు; ఐ = అయ్యి; భయ = భయము; గ్లాని = దౌర్భల్యములను; వహించి = చెంది; బాష్పములు = కన్నీరు; క్రమ్మగ = కమ్ముకొనగ; గద్గద = బొంగురుపోయిన; కంఠులు = కంఠములు కలవారు; ఐ = అయ్యి; తనుల్ = దేహములు; మ్రానుపడంగ = నిశ్చేష్టితములుకాగ; ఆ = ఆ; విభున్ = ప్రభువు; మన్ననన్ = అనుగ్రహములను; కైకొని = స్వీకరించి; ఎట్టకేలకున్ = చివరికి.

భావము:

ఆ విష్ణుమూర్తి అఖండమైన పరాక్రమం వల్ల, తేరిచూడరాని తేజస్సు వల్ల దేవతలు నిర్ఘాంతపోతూ ఆయనను స్తుతించడానికి అశక్తులైనారు. భయకంపితులై కన్నీరు కారుస్తూ డగ్గుత్తికతో నిశ్చేష్టులై నిలబడి ఎట్టకేలకు కమాలాక్షుని కటాక్షం పొంది...