పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-160.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుసఁ బుట్టించితివి; కాన వారి నెపుడుఁ
గే దండంబుఁ బూని గోపాకుండు
లసి గోవుల రక్షించు గిది నీవు
రసి రక్షించుచుందు గయ్య రుద్ర!

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్మ; తగన్ = తగ; నీవున్ = నీవును; అబ్జనాభుండును = విష్ణువు {అబ్జనాభుడు - అబ్జము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు}; పరికింప = సరిగచూసిన; బ్రాహ్మణ = బ్రహ్మణులలో; అభాసులు = బ్రష్టులు; అయిన = అయిన; వారల = వారి; ఎడ = అందు; ఎవ్వలనను = ఏవిధముగ; ఉపేక్షింపరట = నిర్లక్ష్యముచేయరట; దృఢ = గట్టి; వ్రతచర్యులు = విధముగ చరించువారు; ఐన = అయిన; వారి = వారి; ఎడ = అందు; నీకున్ = నీకు; ఉపేక్ష = అశ్రద్ధ; ఎక్కడిది = ఎక్కడిది; సర్గ = సృష్టి; ఆదిని = మొదటిలో; ఆమ్నాయ = వేదముల; సంప్రదాయమున్ = సంప్రదాయమును; ప్రవర్తనమున్ = విధానమును; ఎఱింగించుట = తెలుపుట; కున్ = కు; అమర = దేవతలను; విద్యా = విద్య; తపస్ = తపస్సు; వ్రత = వ్రతములందు; పరాయణులు = నిష్ఠకలవారు; ఐన = అయిన; బ్రాహ్మణులను = బ్రహ్మణులను.
వరుసన్ = వరుసగా; పుట్టించితివి = పుట్టించితివి; కాన = కావున; వారినిన్ = వారిని; ఎపుడున్ = ఎప్పుడును; కేలన్ = చేతితో; దండంబున్ = కర్ర; పూని = ధరించి; గోపాలకుండు = గోవులుకాచెడివాడు; బలిసి = అతిశయించి; గోవులన్ = ఆవులను; రక్షించు = కాపాడు; పగిది = విధముగ; నీవున్ = నీవును; అరసి = చక్కగచూసి; రక్షించుచుందు = కాపాడుతుంటావు; కదు = కదా; అయ్య = తండ్రి; రుద్రా = శివ.

భావము:

పుణ్యాత్మా! నీవు, విష్ణువు కపట బ్రాహ్మణులను క్షమింపరు. దృఢమైన వ్రతం కల బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయరు. సృష్టి ఆరంభంలో వేదసంప్రదాయాలను ప్రవర్తింపజేయడానికి నీవు బ్రాహ్మణులను సృజించావు. విద్య, తపస్సు, వ్రతం బ్రాహ్మణుల ధర్మాలు. కాబట్టి కర్ర చేత పట్టుకొని గోపాలుడు గోవులను కాపాడే విధంగా నీవు బ్రాహ్మణులను నిత్యం శ్రద్ధగా కాపాడుతూ ఉంటావు.