చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట
- ఉపకరణాలు:
శర్వుని యోగక్రమమున
సర్వావయవములుఁ గలిగి సన్ముని ఋత్వి
గ్గీర్వాణముఖ్య లొప్పిరి
పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్.
టీకా:
శర్వు = శివుని; నియోగ = నియమించిన; క్రమమున = ప్రకారము; సర్వ = సమస్తమైన; అవయవములున్ = అవయవములును; కలిగి = పొంది; సత్ = మంచి; ముని = మునులు; ఋత్విక్ = ఋత్విక్కులు; గీర్వాణ = దేవతల; ముఖ్యులు = ప్రముఖులు; ఒప్పిరి = చక్కగ ఉండిరి; పూర్వ = పూర్వపు; తను = దేహ; శ్రీలన్ = సంపదలతో; ఆర్యభూషణా = విదురా, గొప్పవారిచే మన్నిపబడేవాడ; అంతన్ = అంతట.
భావము:
ఓ విదురా! గొప్పవారిచే మన్నిపబడేవాడ! శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…