పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-140-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంచిత వామపాదాంభోరుహము దక్షి-
ణోరుతలంబున నొయ్య నునిచి
వ్యజానువుమీఁద వ్యబాహువు సాఁచి-
లపలి ముంజేత లలితాక్ష
మాలిక ధరియించి హనీయ తర్కము-
ద్రాయుక్తుఁ డగుచుఁ జిత్తంబులోన
వ్యయం బయిన బ్రహ్మానందకలిత స-
మాధి నిష్ఠుఁడు వీతత్సరుండు

4-140.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోగపట్టాభిరాముఁడై యుచిత వృత్తి
రోషసంగతిఁ బాసి కూర్చున్న జముని
నువునను దర్భరచిత బ్రుస్యాసనమున
నున్న మునిముఖ్యు నంచిత యోగనిరతు.

టీకా:

అంచిత = పూజనీయమైన; వామ = ఎడమ; పాద = పాదము అనెడి; అంభోరుహమున్ = పద్మమును {అఁబోరుహము - అంబువు (నీట) రుహము (పుట్టునది), పద్మము}; దక్షిణ = కుడి; ఊరు = తొడ; తలంబునన్ = ప్రదేశమునందు; ఒయ్యన = తీర్పుగ; ఉనిచి = ఉంచి; = సవ్య = ఎడమ; జానువు = మోకాలి; మీద = పైన; భవ్య = శుభమైన; బాహువు = హస్తమును; సాచి = చాచి; వలపలి = కుడి; ముంజేత = మంజేతి యందు; సలలిత = అందమైన; అక్షమాలిక = జపమాల; ధరియించి = ధరించి; మహనీయ = గొప్ప; తర్కముద్రా = ధ్యానముద్రతో; యుక్తుడు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; చిత్తంబు = మనసు; లోనన్ = అందు; అవ్యయంబు = తరుగని; బ్రహ్మానంద = బ్రహ్మానందముతో; సంకలిత = కూడిన; సమాధి = సమాధి; నిష్ఠుడు = నిష్ఠకలవాడు; వీత = తొలగిన; మత్సరుండు = మాత్సర్యముకలవాడు.
యోగ = యోగము; పట్టాభిరాముడు = అందుఒప్పుతున్నవాడు; ఐ = అయ్యి; ఉచిత = తగిన; వృత్తి = విధముగ; రోష = రోషముఎడల; సంగతిన్ = సంగమునుండి; పాసి = దూరమై; కూర్చున్న = కూర్చుని ఉన్న; జముని = యముని; అనువునను = వలె; దర్భ = దర్భలతో; రచిత = కూర్చిన; బ్రుసి = వ్రతాభ్యాసమునకైన; ఆసనమున = ఆసనము; ఉన్న = ఉన్నట్టి; ముని = మునులలో; ముఖ్యు = ప్రముఖుని; అంచిత = పూజనీయమైన; యోగ = యోగమునందు; నిరతున్ = నిష్ఠకలవాని.

భావము:

ఆ మహేశ్వరుడు కుడితొడపై ఎడమకాలును మోపి, ఎడమ మోకాలిపై ఎడమచేతిని చాచి కూర్చున్నాడు. కుడి ముంజేతిలో జపమాలను ధరించాడు. మహనీయమైన ధ్యానముద్రను ధరించి బ్రహ్మానందంతో నిండిన మనస్సు కలవాడై సమాధి నిష్ఠలో ఉన్నాడు. అతడు మాత్సర్యం లేనివాడు. యోగపట్టంతో ఒప్పుతూ కోపం విడిచిపెట్టి కూర్చున్న యమునివలె దర్భాసనం మీద యోగనిమగ్నుడై ఉన్నాడు.