పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధక్షాధ్వర ధ్వంసంబు

  •  
  •  
  •  

4-122-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుల దర్పోద్ధతుండై వీరభద్రుండు-
గైకొని దక్షు వక్షంబుఁ ద్రొక్కి
శితధారాసిఁ గొని మేను వొడిచియు-
మంత్రసమన్విత హిత శస్త్ర
జాలావినిర్భిన్న ర్మంబు గల దక్షుఁ-
జంపఁగా లేక విస్మయము నొంది
ద్వధోపాయంబు న చిత్తమునఁ జూచి-
కంఠనిష్పీడనతిఁ దలంచి

4-122.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్తకముఁ దున్మి యంచితార్షణమున
క్షిణానలమున వేల్చెఁ దనుచరులు
ర్షమును బొంద; నచటి బ్రాహ్మణజనంబు
లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ.

టీకా:

అతుల = సాటిలేని; దర్ప = దర్పముతో; ఉద్ధతుండు = చెలరేగినవాడు; ఐ = అయ్యి; వీరభద్రుండు = వీరభద్రుడు; కైకొని = చేపట్టి; దక్షు = దక్షుని; వక్షంబున్ = వక్షస్థలమును; త్రొక్కి = తొక్కి; ఘన = గొప్ప; శిత = వాడియైన; ధారా = పదును కలిగిన; అసిన్ = కత్తిని; కొని = తీసుకొని; మేను = చర్మము; ఒలిచియు = ఒలిచినప్పటికిని; మంత్ర = మంత్రశక్తులతో; సమన్విత = కూడినది; మహిత = గొప్ప; శస్త్ర = శస్త్రముల; జాలా = సమూహములముతోనైనా; అవినిర్భిన్న = చినిగిపోనట్టి; చర్మంబున్ = చర్మము; కల = కలిగిన; దక్షున్ = దక్షుని; జంపగాలేక = చంపలేక; విస్మయమున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; తత్ = అతనిని; వధ = చంపెడి; ఉపాయంబున్ = ఉపాయమును; తన = తన యొక్క; చిత్తమున = మనసులో; చూచి = కనుగొని; కంఠ = గొంతు; నిష్పీడన్ = నులుము; గతిన్ = విధమును; తలంచి = ఆలోచించుకొని.
మస్తకమున్ = శిరస్సును; తున్మి = తునిమి; అంచిత = మించుతున్న; అమర్షణమున = రోషముతో; దక్షిణానలమున = దక్షిణాగ్నిలో; వేల్చెన్ = హోమము చేసెను; తత్ = అతని; అనుచరులు = అనుచరులు; హర్షమును = సంతోషమును; పొందన్ = పొందగ; అచటి = అక్కడి; బ్రాహ్మణ = బ్రహ్మణులైన; జనంబులు = జనులు; ఆత్మలనున్ = మనసులలో; చాలన్ = మిక్కిలి; దుఃఖంబులు = దుఃఖములు; అందుచున్ = చెందుతూ; ఉండన్ = ఉండగ.

భావము:

వీరభద్రుడు సాటిలేని దర్పంతో విజృంభించి దక్షుణ్ణి పడవేసి రొమ్ము త్రొక్కిపట్టి వాడి అంచు కలిగిన కత్తితో ఒడలంతా తూట్లు పొడిచాడు. కాని మంత్రపూతాలయిన అనేక శస్త్రాస్త్రాలతో గట్టిపడిన చర్మం కలిగిన దక్షుణ్ణి చంపలేక ఆశ్చర్యపడి, అతణ్ణి చంపే ఉపాయాన్ని ఆలోచించి మెడ నులిమి, శిరస్సు తునిమి దక్షిణాగ్ని కుండంలో వేసి భస్మం చేశాడు. అది చూచి వీరభద్రుని అనుచరులు సంతోషించగా, అక్కడి బ్రాహ్మణులు మనస్సులో ఎంతో బాధపడ్డారు.