పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధక్షాధ్వర ధ్వంసంబు

  •  
  •  
  •  

4-120-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుపితుఁడై నాఁడు భవుని దక్షుఁడు శపింపఁ
"రిహసించిన" పూషుని పండ్లు డుల్లఁ
గొట్టె బలభద్రుఁ డా కళింగుని రదంబు
లెలమి డులిచిన పగిదిఁ జండీశ్వరుండు.

టీకా:

కుపితుడు = కోపము కలవాడు; ఐ = అయ్యి; నాడు = ఆవేళ; భవుని = శివుని; దక్షుడు = దక్షుడు; శపింపన్ = శపిస్తుండగ; పరిహసించిన = విపరీతముగ నవ్విన; పూషుని = పూషుని; పండ్లు = దంతములు; డుల్లగొట్టెను = ఊడగొట్టెను; బలభద్రుడు = బలభద్రుడు; ఆ = ఆ; కళింగుని = కళింగుడు అనెడివాని; రదంబులు = పండ్లు; ఎలమిన్ = పౌరుషముతో; డులిచిన = ఊడగొట్టిన; పగిదిన్ = విధముగ; చండీశ్వరుండు = చండీశ్వరుడు.

భావము:

ఆనాడు దక్షుడు కోపంతో శివుని శపించినప్పుడు పరిహాసం చేసిన పూషుని దంతాలను బలభద్రుడు కళింగుని దంతాలను రాలగొట్టినట్లు చండీశ్వరుడు రాలగొట్టాడు.