పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధక్షాధ్వర ధ్వంసంబు

  •  
  •  
  •  

4-117-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి దేవునిఁ ద్రిపుర సంహార కరునిఁ
జంద్రశేఖరు సద్గుణసాంద్రు నభవు
నము రోషింపఁ జేసిన మంగళములఁ
బొంద వచ్చునె పద్మగర్భునకునైన?"

టీకా:

అట్టి = అటువంటి; దేవుని = దేవుని; త్రిపురసంహారకుని = శివుని {త్రిపురసంహారకుడు - త్రిపురములను కూల్చివేసినవాడు, శివుడు}; చంద్రశేఖరు = శివుని {చంద్రశేఖరుడు - చంద్రవంక సిగదండగ కలవాడు, శివుడు}; సత్ = మంచి; గుణ = గుణములు; సాంద్రున్ = మిక్కిలిగా కలవాని; అభవున్ = శివుని {అభవుడు - పుట్టుక లేనివాడు, శివుడు}; మనమున్ = మానసమును; రోషింపన్ = కోపింపను; చేసిన = చేసినచో; మంగళములన్ = శుభములను; పొంద = పొందుట; వచ్చునె = శక్యమా ఏమి; పద్మగర్భున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; ఐనన్ = అయినప్పటికిని.

భావము:

అటువంటి దేవదేవునికి, త్రిపురసంహారికి, చంద్రచూడునకు, సకల సద్గుణ విభవునకు, అభవుని మనస్సుకు ఆగ్రహం తెప్పించి బ్రహ్మదేవుడైనా శుభాలను పొందగలడా?”