పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధక్షాధ్వర ధ్వంసంబు

 •  
 •  
 •  

4-116-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత;
నిఖిల దిక్కరి రాజనివహుఁ డగుచుఁ
టులోగ్రనిష్ఠుర స్తనిత గంభీరాట్ట;
హాస నిర్భిన్నాఖిలాశుఁ డగుచు
భూరి కరాళవిస్ఫా దంష్ట్రా హతి;
తిత తారాగణ ప్రచయుఁ డగుచు
వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ;
మండిత చండ దోర్దండుఁ డగుచు

4-116.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విట రోష భయంకర భ్రుకుటి దుర్ని
రీక్ష్య దుస్సహ తేజోమహిమఁ దనర్చి
న వికీర్ణ జటాబంధ లితుఁ డగుచు
ఖిల సంహార కారణుఁ యి నటించు.

టీకా:

సుమహిత = చాలా గొప్పదైన; నిశిత = వాడి యైన; త్రిశూల = త్రిశూలము; అగ్ర = కొన లందు; సంప్రోత = గుచ్చబడిన; నిఖిల = సమస్తమైన; దిక్కరిరాజ = దిగ్గజముల; నివహుడు = గుంపు కలవాడు; అగుచున్ = అవుతూ; చటుల = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; నిష్టుర = వినుటకు కఠినమైన; స్తనిత = ఉరుముల శబ్దములవలె; గంభీర = గంభీరమైన; అట్టహాస = విరగబడి నవ్వుటచేత; నిర్భిన్న = బాగా పగిలిపోయిన; అఖిల = సమస్తమైన; ఆశుడు = దిక్కులు కలవాడు; అగుచున్ = అవుతూ; భూరి = అతి పెద్దవైన; కరాళ = వంపులు తిరిగిన; విస్ఫార = విప్పారిన; దంష్ట్రా = కోరలచే; హతి = కొట్టబడుటచేత; పతిత = పడిపోయిన; తారా = తారల; గణ = గుంపుల; ప్రచయుడు = సమూహము కలవాడు; అగుచున్ = అవుతూ; వివిధ = రకరకములైన; హేతి = ఆయుధముల; వ్రాత = సమూహము యొక్క; విపుల = విశాలమైన; ప్రభా = కాంతుల; పుంజ = గుంపులచే; మండిత = అలంకరింపబడిన; చండ = భయంకరమైన; దోర్దండుడు = బాహుదండములు కలవాడు; అగుచున్ = అవుతూ.
వికట = వికృతమైన; రోష = రోషము వలన; భయంకర = భయంకరమైన; భ్రుకుటిన్ = కనుబొమముడితో; దుర్నిరీక్ష్య = చూడ శక్యము గాని; దుస్సహ = భరింప శక్యము గాని; తేజస్ = తేజస్సు యొక్క; మహిమన్ = గొప్పదనముచే; తనర్చి = అతిశయించి; ఘన = గొప్ప; వికీర్ణ = విరబోసుకొన్న; జటా = జటల; బంధ = కట్టబడులుతో; కలితుడు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; అఖిల = సమస్తము; సంహార = సంహరింపబడుటకు; కారణుడు = కారణమైనవాడు; అయి = అయ్యి; నటించున్ = నాట్యము చేయును.

భావము:

మహోగ్రమైన తన త్రిశూలాగ్రాన దిగ్గజాల నన్నిటిని గుది గ్రుచ్చేవాడై, దిక్కులన్నీ దద్దరిల్లి బీటలువారే విధంగా ఉరుమినట్లుగా గంభీరంగా అట్టహాసం చేస్తూ, తన వాడియైన గొప్ప కోరల ఘాతాలతో నక్షత్రమండలాన్ని నేల రాలుస్తూ, తన భయంకరమైన చేతులతో ధగధగ మెరిసే రకరకాల ఆయుధాలను ధరిస్తూ, ప్రచండ కోపంతో కనుబొమలను ముడివేసి, తేరి చూడరాని తేజస్సుతో, జడలను విరబోసుకొని ప్రళయనాట్యం చేస్తూ సర్వాన్ని సంహరిస్తాడు.