పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధక్షాధ్వర ధ్వంసంబు

  •  
  •  
  •  

4-109-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ
య వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్
రువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే
రిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్?"

టీకా:

గురు = మిక్కిలి; భుజ = బాహు; శౌర్య = బల మతిశయించినవాడ; భూరి = బహు మిక్కిలి; రణ = యుద్ధము చేయుటలో; కోవిద = నేర్పరి; మత్ = నా యొక్క; భట = సేనా; కోటి = సమూహము; ఎల్లన్ = అంతటకును; నీవు = నీవు; అరయ = పూని; వరూధినీ = సేనా; వరుడవు = నాయకుడవు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; యజ్ఞమున్ = యజ్ఞమున; కూడన్ = తో పాటు; దక్షునిన్ = దక్షని; పరువడిన్ = వెంటనే; త్రుంపుము = సంహరించుము; ఈవు = నీవు; అచటన్ = అక్కడ; బ్రాహ్మణతేజము = బ్రాహ్మణతేజము; అజేయము = జయింప శక్యము కానిది; అంటివేమి = అంటే; అరిదిని = దుర్లభముగ; మత్ = నా యొక్క; అంశ = అంశతో; సంభవుడవు = పుట్టినవాడవు; ఐ = అయ్యి; తగు = తగినవాడవు; నీకున్ = నీకు; అసాధ్యము = అసాధ్యము; ఎయ్యెడన్ = ఎక్కడిది.

భావము:

“యుద్ధవిద్యా విశారదుడవైన భుజపరాక్రమశాలీ! నా ప్రమథగణాల కంతటికీ నీవు సేనానివై వెంటనే వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని సంహరించు. బ్రాహ్మణతేజం అజేయమని సందేహించకు. నా అంశతో జన్మించిన నీకు అసాధ్య మెక్కడిది?”