పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-97.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మహాత్ముని యంక పీమ్మునందు
నాదరంబున నుండు దేహంబు దక్షు
లని దోషంబునను విడువంగఁ దలఁచి
తాల్చెఁ దనువున ననిలాగ్ని ధారణములు.

టీకా:

వరుసన్ = వరుసగా; ప్రాణ = ప్రాణవాయువు; అపాన = అపాన; వాయు = వాయువులను; నిరోధము = ఆపుట; కావించి = చేసి; వానిన్ = వాటిని; ఏకముగ = ఒకటిగ కలిపి; నాభి = బొడ్డు; తలమునన్ = ప్రాంతమున; కూర్చి = చేర్చి; అంతటన్ = అప్పుడు; ఉదానము = ఉదాన స్థానము; దాకన్ = వరకు; ఎగయించి = ఎక్కించి; బుద్ధితో = బుద్ధిపూర్వకముగ; హృదయ = హృదయము అనెడి; పద్మమున = పద్మమున; నిల్పి = నిలబెట్టి; వానిని = వాటిని; మెల్లన = మెల్లగ; కంఠ = కంఠము; మార్గమున = దారి యమ్మటను; మఱి = మరి; భ్రూమధ్యమునన్ = భ్రూమధ్యమునను; వసింపన్ = ఉండునట్లు; చేసి = చేసి; శివ = శివుని యొక్క; అంఘ్రి = పాదములు అనెడి; రాజీవ = పద్మముల; చింతనము = ధ్యానము; చేత = వలన; నాథునిన్ = భర్తను; తక్క = తప్పించి; అన్యంబున్ = ఇతరమును; చూడక = చూడకుండగ; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని. అంక = ఒడి అనెడి; పీఠమ్ము = ఆసనము; అందున్ = పైన; ఆదరంబునన్ = ప్రీతిగ; ఉండు = ఉండెడి; దేహంబున్ = శరీరమును; దక్షున్ = దక్షని; వలని = మూలమున; దోషంబునను = దోషముచేత; విడువంగ = విడిచిపెట్ట; తలచి = నిర్ణయించుకొని; తాల్చెన్ = ధరించెను; తనువునన్ = దేహ మందు; అనిల = వాయువును; అగ్నిన్ = అగ్నుల; ధారణములు = ధారణములు.

భావము:

ప్రాణాపానాలనబడే వాయువులను నిరోధించి, వాటి నొక్కటిగా చేసి బొడ్డుతో కలిపి, ఉదానస్థానం వరకు ఎక్కించి, బుద్ధిపూర్వకంగా హృదయపద్మంలో నిలిపి, మెల్లగా కంఠమార్గంలో భ్రూమధ్య భాగానికి చేర్చి, మనస్సులో శివుని పాదపద్మాలను ధ్యానిస్తూ అతన్ని తప్ప ఇతరములైనవేవీ చూడక అతని ఒడిలో ఆదరంతో ఉండే దేహాన్ని దక్షుని కారణంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకొని, యోగాగ్నిని రగుల్కొల్పింది.