పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-75-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిహంకార నిరస్తపాప సుజనానింద్యోల్ల సత్కీర్తిఁ గొం
ఱు కామించి యశక్తులై మనములన్ దందహ్యమానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముం డీశ్వరుం డైన యా
రితో బద్ద విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.

టీకా:

నిరహంకార = అహంకారములేని; నిరస్త = పోగొట్టుకొనిన; పాప = పాపములు కలిగిన; సుజనా = మంచివారి; అనింద్య = నిదింపదగనివారి; ఉల్లసత్ = ప్రకాశిస్తున్న; కీర్తిన్ = కీర్తిని; కొందఱు = కొంతమంది; కామించి = కోరుకొని; అశక్తులు = శక్తిలేనివారు; ఐ = అయ్యి; మనములన్ = మనసులలో; దందహ్యమాన = దహింపబడుతున్న; ఇంద్రియ = ఇంద్రియముల; ఆతురులు = బాధలు గలవారు; ఐ = అయ్యి; ఊరక = ఉట్టినే; మచ్చరింతురు = ఈర్ష్యవహింతురు; మహాత్ముండు = గొప్పవాడు; ఈశ్వరుడున్ = భగవంతుడును; ఐన = అయిన; ఆ = ఆ; హరి = విష్ణువు; తోన్ = తోటి; బద్ధ = మిక్కిలి; విరోధమున్ = శత్రుత్వమున; తొడరు = పూనుకొను; దైత్య = దానవుల {దైత్యులు - దితి యొక్క పుత్రులు, దానవుల}; శ్రేణి = సమూహము; చందంబునన్ = వలె.

భావము:

అహంకారం, పాపం లేని సజ్జనులు పొందే కీర్తిని తాముకూడా పొందాలని కోరుకొని కొందరు అసమర్థులై మనసులో కుతకుత ఉడికిపోయి, భగవంతుడైన హరితో వైరం పెంచుకొన్న రాక్షసులవలె ఆ సజ్జనులపై అసూయ పెంచుకుంటారు.