పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-65-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ముమునఁ దన్మఖోద్భవ విభూతిఁ గనుంగొన నన్యకామినుల్
దువులు గట్టి భూషణవిభాసితలై నిజనాథయుక్తలై
కలహంస పాండురసమంచిత దివ్య విమానయానలై
దె చనుచున్నవారు గను భ్రపథంబున నీలకంధరా!

టీకా:

ముదమునన్ = సంతోషముతో; తత్ = ఆ; మఖ = యాగమున; ఉద్భవ = కలుగు; విభూతిన్ = వైభవములను; కనుంగొనన్ = చూచుటకు; అన్య = ఇతర; కామినులు = స్త్రీలు {కామిని - కోరదగినది, స్త్రీ}; పదువులుగట్టి = గుంపులుకట్టి; భూషణ = అలంకారములచే; విభాసితలు = మిక్కిలి ప్రకాశిస్తున్నవారు; ఐ = అయ్యి; నిజ = తమ; నాథ = భర్తలతో; యుక్తలు = కూడినవారు; ఐ = అయ్యి; మద = పరవశిస్తున్న; కలహంస = కలహంసల; పాండుర = తెల్లదనముతో; సమ = చక్కగ; అంచిత = అలంకరింపబడిన; దివ్య = దివ్యమైన; విమాన = విమానములలో; యానలు = ప్రయాణిస్తున్నవారు; ఐ = అయ్యి; అదె = అదిగో; చనుచున్నవారు = వెళ్తున్నారు; కనుము = చూడుము; అభ్ర = ఆకాశ; పథంబునన్ = మార్గములో; నీలకంధర = శివ {నీలకంధరుడు - నీల (నల్లని) కంధర (కంఠము) కలవాడు, శివుడు}.

భావము:

నీలకంఠా! మా తండ్రి మహావైభవోపేతంగా చేసే యజ్ఞాన్ని సందర్శించే నిమిత్తం సంతోషంతో దేవతాస్త్రీలు గుంపులు గుంపులుగా పలువిధాల ఆభరణాలను అలంకరించుకొని భర్తలతో కలిసి రాజహంసల వలె తెల్లని రెక్కలతో కూడిన దివ్య విమానాలు ఎక్కి అదిగో ఆకాశమార్గంలో వెళ్తున్నారు. చూడండి.